నెటిజన్‌ను బండ బూతులు తిట్టిన రకుల్ ప్రీత్!

  • IndiaGlitz, [Thursday,January 17 2019]

సోషల్ మీడియాను కొందరు అనవసర విషయాలకు వాడుతూ చేజేతులారా లేనిపోని చిక్కులు తెచ్చుకుంటున్నారు. మరీ ముఖ్యంగా సెలబ్రటీలను టార్గెట్ చేస్తూ కొందరు నెటిజన్లు వాడిన పదజాలంతో జైలుపాలైన సందర్భాలున్నాయ్. అయినప్పటికీ ఈ బూతు మాటలు మాత్రం తగ్గట్లేదు. అయితే నెటిజన్ల వాడుతున్న బూతులకు కొందరు సహనంగా స్పందిస్తుంటే మరికొందరు మాత్రం మేమూ బూతుల్లో డిగ్రీలు చేశామంటూ దుమ్ముదులిపి వదులుతున్నారు. ఇక విషయానికొస్తే.. హీరోయిన్ రకుల్ ప్రీత్‌ సింగ్‌ సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటుందో అందరికీ తెలిసిందే. ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన కార్యక్రమాలు, ఫొటోలను అప్డేట్ చేస్తూ అభిమానులు, సినీ ప్రేక్షకులను అలరిస్తూ ఉంటుందీ ఈ ముద్దగుమ్మ. అయితే తాజాగా కారు దిగుతున్నట్లు ఉన్న ఫొటోను రకుల్ తన అభిమానులతో పంచుకుంది. అయితే ఈ పిక్‌‌కు కొందరు నెటిజన్ల నుంచి పెద్ద ఎత్తున కామెంట్స్ వచ్చాయి. ఓ నెటిజన్ ఏకంగా ఆమెపై అసభ్య పదజాలం వాడాడు. దీంతో చిర్రెత్తు కొచ్చిన రకుల్‌‌ అతనికి దిమ్మదిరిగి బొమ్మ కనపడేలా కౌంటరిచ్చింది.

నెటిజన్ కామెంట్: ‘కారులో ఏదో సెష‌న్‌లో పాల్గొన్న ర‌కుల్ ప్యాంట్ వేసుకోవ‌డం మ‌ర్చిపోయింది’ అని భగత్ అనే యువకుడు రకుల్‌ పై అసభ్య పదజాలం వాడాడు.

రకుల్ రియాక్షన్: 'నాకు తెలిసి మీ అమ్మ కూడా ఇలా కారులో చాలా సెష‌న్స్‌లో పాల్గొని ఉంటుంది. అందుకే నీకు ఈ విష‌యాలు బాగా తెలిశాయి.! ఈ సెష‌న్‌ల గురించి కాకుండా కొంచెం సంస్కారానికి సంబంధించిన విష‌యాలను కూడా నేర్పించమని మీ అమ్మని అడుగు. ఇలాంటి మ‌నుషులు ఉన్నంత వ‌ర‌కు మ‌హిళ‌ల‌కు ర‌క్షణ ఉండ‌దు. ర‌క్షణ‌, స‌మాన‌త్వం అంటూ చర్చలు సాగించ‌డం వ‌ల్ల ఉప‌యోగం ఉండ‌దు అని నెటిజన్ దిమ్మదిరిగేలా రకుల్ రియాక్టయ్యింది.

ఈ కామెంట్స్ వ్యక్తి చేసిన వ్యాఖ్యలపై పలువురు నెటిజన్లు ఓ రేంజ్‌‌లో కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. మరోవైపు రకుల్‌‌ మీరు ఇలా చిట్టి పొట్టి డ్రస్సులతో ఏంటి..? మీకైనా తెలియదా ఎలాంటివి సోషల్ మీడియాలో పోస్ట్ చేయాలో అంటూ నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. విమర్శలను తిప్పి కొడుతూ మళ్లీ మళ్లీ రకుల్ ట్వీట్ చేయడంతో వివాదం మరింత ముదిరినట్లైంది. అయితే రకుల్‌కు ట్వీట్‌‌కు మరో నెటిజన్ స్పందిస్తూ 'ఇప్పుడైనా ఫ్యాంట్ వేసుకున్నారా .. లేదా??' అని కామెంట్ చేయడం గమనార్హం.

More News

సందీప్‌కి తెలంగాణ అమ్మాయి కావాల‌ట‌...

టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిల‌ర్స్ హీరోల్లో సందీప్ కిష‌న్ ఒక‌డు. తెలుగు, త‌మిళ చిత్రాల‌తో బిజీగా ఉంటున్న హీరో పెళ్లి గురించి సోష‌ల్‌మీడియాలో ఓ ఆస‌క్తిక‌ర‌మైన చ‌ర్చ జ‌రిగింది.

క‌మ‌ల్ మ‌న‌వ‌డిగా శింబు కాదు.. సిద్ధార్థ్‌

యూనివ‌ర్ప‌ల్ స్టార్ క‌మ‌ల్ హాస‌న్ త‌న చివ‌రి చిత్రం 'ఇండియ‌న్ 2' కు సిద్ధ‌మ‌య్యారు. త్వ‌ర‌లోనే సెట్స్‌కు వెళ్ల‌బోయే ఈ సినిమాలో కాజ‌ల్ అగ‌ర్వాల్ క‌మ‌ల్ జోడిగా న‌టించ‌నుంది.

బాలీవుడ్ హిట్ జోడి మ‌రోసారి...

ఆరేళ్ల క్రితం ఫ్ల‌యింగ్ సిక్ జీవిత క‌థ ఆధారంగా 'బాగ్ మిల్కా బాగ్‌' సినిమాను రూపొందించాడు ద‌ర్శ‌కుడు రాకేష్ ఓం ప్ర‌కాష్ మెహ్ర‌. ఫ్ల‌యింగ్ సిక్ పాత్ర‌లో ఫ‌ర్హాన్ అక్త‌ర్ న‌టించారు.

వైఎస్ షర్మిళమ్మకు రాములమ్మ మద్దతు

సోషల్ మీడియా వేదికగా తనపై, తనకుటుంబంపై టీడీపీ దుష్ప్రచారం చేస్తోందని వైసీపీ అధినేత వైఎస్ జగన్ సోదరి షర్మిళ పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.

కృష్ణ.. కృష్ణా.. సీతతో పోలికేంటి స్వామీ..!

వైసీపీ అధినేత, ఏపీ ప్రతిపక్షనేత వైఎస్ జగన్ మోహన్‌‌రెడ్డి సోదరి షర్మిళ.. తనపై, తన కుటుంబంపై సోషల్ మీడియాలో టీడీపీ దుష్ప్రచారం చేస్తోందని హైదరాబాద్ సీపీని కలిసి ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.