close
Choose your channels

'ఆర్ఆర్ఆర్` నుండి చెర్రీ, ఆలియా లుక్స్ లీక్స్..?

Tuesday, February 18, 2020 • తెలుగు Comments

ఆర్ఆర్ఆర్` నుండి చెర్రీ, ఆలియా లుక్స్ లీక్స్..?

రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో ఎన్టీఆర్‌, రామ్‌చ‌ర‌ణ్ క‌థానాయ‌కులుగా న‌టిస్తోన్న చిత్రం ‘ఆర్ఆర్ఆర్‌’. డి.వి.వి.దాన‌య్య నిర్మాత‌. భారీ బ‌డ్జెట్‌తో రూపొందుతోన్న ఈ సినిమాను ‘బాహుబ‌లి’ త‌ర్వాత రాజ‌మౌళి తెర‌కెక్కిస్తుండ‌టంతో సినిమాపై భారీ అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. సినిమా షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుగుతుంది. ఎన్టీఆర్ జ‌త‌గా బ్రిట‌న్ భామ‌ ఒలివియా మోరిస్ న‌టిస్తుంటే.. రామ్‌చ‌ర‌ణ్ జ‌త‌గా బాలీవుడ్ బ్యూటీ ఆలియా భ‌ట్ న‌టిస్తుంది. కాగా.. సినిమా మ‌రి ఆల‌స్యం కావ‌డం.. ఇప్ప‌టి వ‌ర‌కు ఓ పోస్ట‌ర్ మిన‌హా సినిమాలో అటు ఎన్టీఆర్‌, ఇటు రామ్‌చ‌ర‌ణ్‌ల‌కు సంబంధించిన లుక్స్ ఏవీ లేక‌పోవ‌డంతో ప‌లు సంద‌ర్భాల్లో అభిమానులే త‌మ చేతివాటం చూపించారు.

కాగా.. నేడు `ఆర్ఆర్ఆర్` సినిమాలో రామ్‌చ‌ర‌ణ్‌, ఆలియా భ‌ట్ లుక్స్ ఇవేనంటూ  సోష‌ల్ మీడియాలో రెండు లుక్స్ వైర‌ల్ అవుతున్నాయి. బ్రిటీష్ అధికారిగా రామ్‌చ‌ర‌ణ్‌, పాత‌కాలం చీర‌క‌ట్టులో ఆలియా భ‌ట్ ఈ ఫొటోలో క‌న‌ప‌డుతున్నారు. మ‌రి దీనిపై చిత్ర‌యూనిట్ ఏమైనా స్పందిస్తుందో చూడాలి. వ‌చ్చే ఏడాది సంక్రాంతి సంద‌ర్భంగా జ‌న‌వ‌రి 8ప విడుద‌ల కానుంది. తార‌క్ తెలంగాణ విప్ల‌వ వీరుడు కొమురం భీమ్‌గా.. రామ్‌చ‌ర‌ణ్ మ‌న్యం వీరుడు అల్లూరి సీతారామరాజు పాత్ర‌లో న‌టిస్తోన్న సంగ‌తి తెలిసిందే. సముద్ర‌ఖ‌నితో పాటు బాలీవుడ్ స్టార్ అజ‌య్ దేవ‌గ‌ణ్ కీల‌క పాత్ర‌లో న‌టిస్తుండ‌గా అజ‌య్ స‌ర‌స‌న శ్రియా శ‌ర‌న్ న‌టిస్తుంది. హాలీవుడ్ స్టార్స్ రే స్టీవెన్ స‌న్‌, అలిస‌న్ డూడ్ త‌ద‌త‌రులు కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు.

Get Breaking News Alerts From IndiaGlitz