చ‌ర‌ణ్ డ‌బ్బింగ్‌...

  • IndiaGlitz, [Friday,April 19 2019]

అదేంటి చ‌ర‌ణ్ ఇప్పుడు ఏ సినిమా చేయ‌డం లేదు క‌దా! మ‌రెందుకు డ‌బ్బింగ్ చెబుతున్నాడ‌నే సందేహం రావ‌చ్చు. అయితే అస‌లు విష‌య‌మేమంటే బాలీవుడ్ సూప‌ర్‌స్టార్ స‌ల్మాన్‌ఖాన్ కుటుంబంతో మెగాస్టార్ చిరంజీవి కుటుంబానికి మంచి అనుబంధం ఉంది. ముంబైకి చిరు, చ‌ర‌ణ్ ఎవ‌రు వెళ్లినా.. సల్మాన్ అతిథ్య ఇస్తుంటాడు.

అలాగే స‌ల్మాన్‌ఖాన్ హైద‌రాబాద్ వ‌స్తే చిరంజీవిని లేదా చ‌ర‌ణ్ అతిథ్యానైనా తీసుకుంటాడు. అంత మంచి అనుబంధం ఉండ‌టంతో ఇప్పుడు స‌ల్మాన్ భాయ్ కోసం రాంచ‌ర‌ణ్ డ‌బ్బింగ్ చెప్ప‌బోతున్నాడు. అది కూడా ఆయ‌న పాత్ర‌కు. వివ‌రాలేమంటే.. స‌ల్మాన్‌ఖాన్‌, క‌త్రినా కైఫ్ జంట‌గా నటించిన భార‌త్ చిత్రం ఈద్ సంద‌ర్భంగా జూన్ 5న విడుద‌ల కానుంది.

ఈ సినిమాను తెలుగు, త‌మిళంలో కూడా అనువాదం చేసి విడుద‌ల చేయ‌బోతున్నారు. తెలుగులో స‌ల్మాన్ పాత్ర‌కు రాంచ‌ర‌ణ్ డ‌బ్బింగ్ చెప్ప‌బోతున్నారు. ఇది వ‌ర‌కు స‌ల్మాన్ న‌టించిన 'ప్రేమ్ ర‌త‌న్ ధ‌న్‌పాయొ' సినిమాను తెలుగు అనువాదానికి సల్మాన్ పాత్ర‌కు చెర్రీ డ‌బ్బింగ్ చెప్పాడు.

More News

స్వాతి రీ ఎంట్రీ

క‌ల‌ర్స్ ప్రోగ్రాంతో పాపుల‌ర్ అయిన స్వాతి.. త‌ర్వాత సినిమాల్లో న‌టిగా, సింగ‌ర్‌, డ‌బ్బింగ్ ఆర్టిస్ట్‌గా మెప్పించింది.

నాని బ్రిలియంట్ ఫెర్ఫామెన్స్.. గౌతమ్ హ్యాట్సాప్: ఎన్టీఆర్

నేచురల్ స్టార్ నాని, శ్రద్ధా శ్రీనాథ్‌ జంటగా గౌతమ్‌ తిన్ననూరి తెరకెక్కించిన చిత్రం ‘జెర్సీ’. ఏప్రిల్-19న విడుదలైన ఈ సినిమా మంచి హిట్ టాక్ సంపాదించుకుంది.

శర్వా స్కూబా డైవింగ్

యువ కథానాయుకుడు శర్వానంద్ ఇప్పుడు తమిళ నుండి తెలుగులోకి రీమేక్ అ

బ‌న్ని సినిమాలో మ‌ల‌యాళ నటుడు

ఇప్ప‌డు తెలుగు సినిమా రేంజ్ పెరిగింది. ప‌ర భాషా న‌టులు తెలుగులో న‌టించ‌డానికి ఆస‌క్తిని క‌న‌ప‌రుస్తున్నారు.

ఎన్నికల వేళ రాహుల్ గాంధీకి ఈసీ షాక్

కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహల్ గాంధీకి కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ) ఝలక్ ఇచ్చింది.