చరణ్ డబ్బింగ్...


Send us your feedback to audioarticles@vaarta.com


అదేంటి చరణ్ ఇప్పుడు ఏ సినిమా చేయడం లేదు కదా! మరెందుకు డబ్బింగ్ చెబుతున్నాడనే సందేహం రావచ్చు. అయితే అసలు విషయమేమంటే బాలీవుడ్ సూపర్‌స్టార్ సల్మాన్‌ఖాన్ కుటుంబంతో మెగాస్టార్ చిరంజీవి కుటుంబానికి మంచి అనుబంధం ఉంది. ముంబైకి చిరు, చరణ్ ఎవరు వెళ్లినా.. సల్మాన్ అతిథ్య ఇస్తుంటాడు.
అలాగే సల్మాన్‌ఖాన్ హైదరాబాద్ వస్తే చిరంజీవిని లేదా చరణ్ అతిథ్యానైనా తీసుకుంటాడు. అంత మంచి అనుబంధం ఉండటంతో ఇప్పుడు సల్మాన్ భాయ్ కోసం రాంచరణ్ డబ్బింగ్ చెప్పబోతున్నాడు. అది కూడా ఆయన పాత్రకు. వివరాలేమంటే.. సల్మాన్‌ఖాన్, కత్రినా కైఫ్ జంటగా నటించిన భారత్ చిత్రం ఈద్ సందర్భంగా జూన్ 5న విడుదల కానుంది.
ఈ సినిమాను తెలుగు, తమిళంలో కూడా అనువాదం చేసి విడుదల చేయబోతున్నారు. తెలుగులో సల్మాన్ పాత్రకు రాంచరణ్ డబ్బింగ్ చెప్పబోతున్నారు. ఇది వరకు సల్మాన్ నటించిన `ప్రేమ్ రతన్ ధన్‌పాయొ` సినిమాను తెలుగు అనువాదానికి సల్మాన్ పాత్రకు చెర్రీ డబ్బింగ్ చెప్పాడు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.