విక్రమ్ ఇంకొక్కడు ఆడియోకు గెస్ట్ ఎవరో తెలుసా...

  • IndiaGlitz, [Sunday,July 24 2016]

త‌మిళ హీరో విక్ర‌మ్ న‌టిస్తున్న తాజా చిత్రం ఇరు ముగ‌న్. ఈ చిత్రాన్ని ఆనంద్ శంక‌ర్ తెర‌కెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో విక్ర‌మ్ స‌ర‌స‌న న‌య‌న‌తార‌, నిత్యామీన‌న్ న‌టిస్తున్నారు. యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ గా రూపొందుతున్న‌ ఈ చిత్రాన్ని తెలుగులో ఇంకొక్క‌డు అనే టైటిల్ తో రిలీజ్ చేయ‌నున్నారు.
విక్ర‌మ్, న‌య‌న‌తార‌, నిత్యామీన‌న్ ల‌కు త‌మిళ్ తో పాటు తెలుగులో కూడా మంచి క్రేజ్ ఉండ‌డంతో తెలుగులో ఇంకొక్క‌డు చిత్రాన్ని భారీ స్ధాయిలో రిలీజ్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే...ఈ మూవీ ఆడియో రిలీజ్ కార్య‌క్ర‌మాన్ని వైవిధ్యంగా ద‌క్షిణాదిలోని వివిధ భాష‌ల‌కు చెందిన యువ హీరోల స‌మ‌క్షంలో ఘ‌నంగా నిర్వ‌హించేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ వేడుక‌లో టాలీవుడ్ నుంచి మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ గెస్ట్ గా హాజ‌ర‌వుతున్న‌ట్టు స‌మాచారం. ఆగ‌ష్టు 2న చెన్నైలో ఈ వేడుక‌ను నిర్వ‌హించ‌నున్నారు.

More News

స్పీడు పెంచిన చైతు

అక్కినేని నాగ చైతన్య దోచెయ్ సినిమా రిలీజై సంవత్సరం దాటిపోయింది.

కొత్త కొత్త భాష అంటూ కింగ్ రాకింగ్

కింగ్ అక్కినేని నాగార్జున సమర్పణలో హీరో శ్రీకాంత్‌ తనయుడు రోషన్‌ను హీరోగా పరిచయం చేస్తూ రూపొందిస్తున్న చిత్రం నిర్మ‌లా కాన్వెంట్. జై చిరంజీవ, దూకుడు, రోబో చిత్రాల్లో బాలనటిగా నటించిన శ్రేయాశర్మ ఈ చిత్రంలో రోషన్‌ సరసన హీరోయిన్‌గా నటించింది.

ఆ నలుగురు లో నేనున్నాను అని తెలిసినప్పుడు నా ఫీలింగ్ అదే - డి.సురేష్ బాబు

విజయ్ దేవరకొండ,రీతువర్మ,నందు ప్రధాన పాత్రల్లో నూతన దర్శకుడు తరుణ్ భాస్కర్ తెరకెక్కించిన చిత్రం పెళ్లి చూపులు.

చిన్న నిర్మాత‌లు ఇబ్బంది ప‌డుతున్నారు - ఎస్.కె.బ‌షీద్

ఎక్స్‌వైజడ్ చిత్రం ఉభయ తెలుగు రాష్ర్టాల్లో చక్కటి వసూళ్లను సాధిస్తోంది అని తెలిపారు ఎస్.కె. బషీద్. ఆయన స్వీయ దర్శకత్వంలో నూతన తారాగణంతో రూపొందించిన చిత్రం ఎక్స్‌వైజడ్. ఇటీవలే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకొచ్చింది.

ప‌వ‌న్ మూవీకి ముహుర్తం ఖ‌రారు

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ హీరోగా గోపాల గోపాల ఫేమ్ డాలీ ద‌ర్శ‌క‌త్వంలో ఓ చిత్రం రూపొందుతుంది. ఈ చిత్రాన్ని ప‌వ‌న్ ఫ్రెండ్ శ‌ర‌త్ మ‌రార్ నార్త్ స్టార్ ఎంట‌ర్ టైన్మెంట్ బ్యాన‌ర్ పై నిర్మిస్తున్నారు.