రామ్ చ‌ర‌ణ్ సినిమా టైటిల్ ఏంటంటే..

  • IndiaGlitz, [Tuesday,April 17 2018]

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వాని జంటగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగ‌తి తెలిసిందే. ఫ్యామిలీ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని డి.వి.వి.దానయ్య నిర్మిస్తుండగా.. దేవీశ్రీ ప్రసాద్ స్వరాలను సమకూరుస్తున్నారు. ప్ర‌శాంత్‌, స్నేహ‌, ఆర్య‌న్ రాజేశ్‌, అన‌న్య, వివేక్ ఒబెరాయ్ త‌దిత‌రులు ఇత‌ర ముఖ్య‌ పాత్ర‌ల్లో సంద‌డి చేయ‌నున్నారు.

ఇదిలా ఉంటే.. ఈ సినిమాకి  ‘రాజవంశస్థుడు’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నార‌ని స‌మాచారం. సాధారణంగా బోయపాటి తన సినిమాల‌కు సంబంధించిన‌ టైటిల్స్‌ను.. హీరో పాత్ర పేరుతోనో లేదంటే హీరో క్యారెక్టర్‌ను ఎలివేట్‌ చేస్తూ వచ్చే విధంగానో ఉండేట్టుగా సెలెక్ట్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఈ సినిమాకి కూడా అటువంటి టైటిల్‌నే ప‌రిశీలిస్తుండ‌డం గ‌మ‌నార్హం. మరి దీన్నే అధికారికంగా ఓకే చేస్తారా? లేదా? అన్నది మరి కొద్ది రోజుల్లో తెలియనుంది.  వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమా విడుదల కానున్నట్టు సమాచారం.

More News

త‌న నిర్మాత‌కు జోడీగా నివేదా?

యువ కథానాయకుడు నందమూరి కల్యాణ్ రామ్ హీరోగా

ఈ ఏడాది దసరాకి రామ్ చరణ్ సినిమా లేనట్టేనా?

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కథానాయకుడిగా మాస్ చిత్రాల‌ ద‌ర్శ‌కుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో

'మ‌హాన‌టి'.. కొన్ని సీన్స్ మాత్ర‌మే

న‌టీమ‌ణి సావిత్రి జీవితం ఆధారంగా తెర‌కెక్కుతున్న చిత్రం 'మ‌హాన‌టి'.

భూమిక‌.. ఈ చిత్రాల‌తో బ్రేక్ చేస్తుందా?

‘ఖుషి’, ‘ఒక్కడు’, ‘సింహాద్రి’ వంటి ఘ‌న‌విజ‌యాల‌తో స్టార్‌డ‌మ్‌ను పొందిన‌ కథానాయిక భూమిక చావ్లా.

'భరత్‌ అనే నేను' సెన్సార్‌ పూర్తి, ఏప్రిల్‌ 20 విడుదల

సూపర్‌స్టార్‌ మహేష్‌బాబు, సూపర్‌ డైరెక్టర్‌ కొరటాల శివ కాంబినేషన్‌లో