close
Choose your channels

ఈ ఏడాది దసరాకి రామ్ చరణ్ సినిమా లేనట్టేనా?

Tuesday, April 17, 2018 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

ఈ ఏడాది దసరాకి రామ్ చరణ్ సినిమా లేనట్టేనా?

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కథానాయకుడిగా మాస్ చిత్రాల‌ ద‌ర్శ‌కుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో చరణ్‌కు జోడీగా కియరా అద్వాని న‌టిస్తోంది. డి.వి.వి.ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై డి.వి.వి.దానయ్య నిర్మిస్తున్న ఈ  చిత్రాన్ని ముందుగా దసరా కానుకగా విడుదల చేయాలని చిత్ర బృందం ప్లాన్ చేసిన సంగ‌తి తెలిసిందే.

కాని రెండో షెడ్యూల్ చిత్రీకరణ ఆలస్యమవుతుండ‌డంతో.. విడుదల వాయిదా పడినట్లు సమాచారం. కాస్త వివ‌రాల్లోకి వెళితే.. మార్చిలో చిత్రీకరణ ప్రారంభించుకున్న ఈ చిత్రం తొలి షెడ్యూల్‌లో చరణ్ లేని సన్నివేశాలను చిత్రీకరించారు. అయితే.. చరణ్ ‘రంగస్థలం’ ప్ర‌మోషన్ పనుల్లో బిజీగా ఉండడం వలన ఇప్పటికే ప్రారంభం కావలసిన రెండో షెడ్యూల్ ఆలస్యమయింది. ఈ నేపథ్యంలో దసరాకి సినిమాని విడుదల చేయడం కష్టమని బోయపాటి అనడంతో.. 2019 సంక్రాంతికి సినిమాని విడుదల చేయమని చెప్పారట చ‌ర‌ణ్‌. కాగా.. ఈ సినిమాని వీలైనంత త్వరగా పూర్తి చేసి.. దసరా తర్వాత రాజమౌళి మల్టీస్టారర్ మూవీ కోసం నిర్వహించబోయే వర్క్‌షాప్‌లో పాల్గొనే ఆలోచనలో చరణ్ ఉన్నారని స‌మాచారం.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.