బాలయ్య టాక్ షోలో పాల్గొనాలని వుంది... వర్మ ట్వీట్ , అంతలోనే డిలీట్

సినిమాలు, రాజకీయాలు, బసవ తారకం క్యాన్సర్ ఆసుపత్రి వ్యవహారాలతో క్షణం తీరిక లేకుండా వుండే బాలయ్య.. గతేడాది కొత్త అవతారం ఎత్తారు. తెలుగు ఓటీటీ ‘‘ఆహా’’లో అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బీకే పేరిట టాక్ షో చేస్తున్నారు. ఈ షోకు మంచి ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకునే బాలయ్య తొలిసారి యాంకర్‌గా మారి తోటి తారలను ఇంటర్వ్యూ చేసే విధానం ప్రజలను ఆకట్టుకుంటోంది. తొలి సీజన్‌లో భాగంగా మొత్తం 10 ఎపిసోడ్‌లు ముగిశాయి. ఇదిలా ఉంటే బాలయ్య అన్‌స్టాపబుల్‌ టాక్‌షో అరుదైన ఘనతను సాధించింది. IMDBలోని టాప్ 10 రియాలిటీ టీవీ షోల జాబితాలో స్థానం దక్కించుకుంది. ఒక తెలుగు టాక్‌ షోకి ఇలాంటి గౌరవం లభించడం ఇదే తొలిసారి.

ఈ నేపథ్యంలో మరింత మంది స్టార్స్‌ను బాలయ్య ఇంటర్వ్యూ చేస్తే చూడాలని ప్రేక్షకులు కామెంట్స్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే క్రియేటివ్ డైరెక్టర్ రామ్‌గోపాల్ వర్మ సైతం తన మనసులోని కోరికను బయటపెట్టారు. బాలయ్య హోస్ట్ చేసే ఈ షో అంటే తనకు చాలా ఇష్టమని.. తనకు ఇందులో పాల్గొనాలనుందంటూ ట్విట్టర్ ద్వారా వర్మ కోరారు. దీంతో ఈ ట్వీట్ క్షణాల్లో వైరల్ అయింది. కానీ ఏమైందో ఏమో కానీ వెంటనే తన ట్వీట్ ను డిలీట్ చేశారు ఆర్జీవీ.

నిజానికి 90వ దశకంలో వర్మ స్టార్‌డమ్ వెలిగిపోతోన్న సమయంలో ఆయనతో సినిమాలు చేయాలని సౌత్ నుంచి నార్త్ వరకు స్టార్ హీరోలు కలలు కనేవారు. అలాగే బాలకృష్ణ కూడా వర్మతో సినిమా చేస్తాడని అప్పట్లో ప్రచారం జరిగింది. కానీ ఆ దిశగా ఎలాంటి ప్రయత్నాలు జరగలేదు. నాలుగేళ్ల క్రితం ముంబైలో సర్కార్ 3 షూటింగ్‌లో వుండగా... వర్మను బాలయ్య కలవడంతో ఇద్దరి కాంబినేషన్‌పై మళ్లీ ఊహాగానాలు వినిపించాయి. కానీ అది కూడా ఒట్టిదే అని తేలిపోయింది.

More News

కొందరు యోధులు తయారవుతారు.. కానీ ‘‘గనీ’’ యోధుడిగా పుట్టాడు

బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో దూసుకెళ్తున్నారు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్. లవ్ స్టోరీలతో తనకు తిరుగులేదని నిరూపించుకున్న ఆయన..

చంద్రబాబుకు కరోనా.. ‘‘మావయ్య.. మీరు త్వరగా కోలుకోవాలి’’ : ఎన్టీఆర్ ట్వీట్

దేశవ్యాప్తంగా కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్న సంగతి తెలిసిందే. సామాన్యులతో పాటు పలువురు ప్రముఖులు కూడా వైరస్ బారినపడుతున్నారు.

ఐదుగురు హీరోయిన్లు, ఇద్దరు మ్యూజిక్ డైరెక్టర్లతో ‘‘రావణాసుర’’ పాలన ప్రారంభం

మాస్ మహారాజ్ వరుస సినిమాలతో హోరెత్తిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఆయన చేతిలో నాలుగైదు సినిమాలు వున్నాయి.

కెరీర్ ను మలుపు తిప్పేలా "వర్మ"... వీడు తేడా- హీరో నట్టి క్రాంతి

న‌టుడిగా ర‌జ‌నీకాంత్‌ అంటే ఇష్టం. సినిమారంగంలో గురువులుగా డా. దాస‌రి నారాయ‌ణరావు, డా. డి. రామానాయుడు అయితే న‌ట‌న గురువుగా స‌త్యానంద్ గార‌ని

ఏపీలో నేటి నుంచే అమల్లోకి నైట్ కర్ఫ్యూ.. వారికి మాత్రం మినహాయింపు

కరోనా కేసులు మరోసారి పెరుగుతుండటంతో దేశంలోని అన్ని రాష్ట్రాలు మరోసారి ఆంక్షలను అమలు చేస్తున్నాయి.