`రొమాంటిక్‌`లో `ఇస్మార్ట్ శంక‌ర్‌`.. కార‌ణ‌మ‌దేనా?

  • IndiaGlitz, [Thursday,December 05 2019]

ఎనర్జిటిక్‌స్టార్ రామ్ హీరోగా ఈ ఏడాది 'ఇస్మార్ట్ శంక‌ర్'తో సెన్సేష‌నల్ హిట్‌ను అందుకున్నాడు. రామ్ కెరీర్‌లోనే బెస్ట్ హిట్ మూవీగా నిలిచింది. ఇంత పెద్ద హిట్ ఇచ్చిన ద‌ర్శ‌క నిర్మాత పూరి జ‌గ‌న్నాథ్ కోసం హీరో రామ్ ఓ ప‌నిచేయ‌డానికి ఓకే అన్నాడ‌ని సినీ వ‌ర్గాల స‌మాచారం. ఇంత‌కు త‌న‌కు కెరీర్ బెస్ట్ హిట్ ఇచ్చిన పూరి కోసం రామ్ ఏం చేయ‌బోతున్నాడో తెలుసా?..

వివ‌రాల్లోకెళ్తే, పూరి త‌నయుడు ఆకాశ్ పూరి హీరోగా రూపొందుతోన్న‌న చిత్రం 'రొమాంటిక్‌'. అనిల్ పాదూరి ద‌ర్శ‌క‌త్వంలో పూరి, ఛార్మి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్ప‌టికే ఆంధ్రాపోరి, మెహ‌బూబా చిత్రాల్లో హీరోగా న‌టించిన ఆకాశ్ పూరికి స‌రైన బ్రేక్ ద‌క్క‌లేదు. ఈ సినిమాపై అంచ‌నాలు పెంచ‌డానికి హీరో రామ్ ఈ సినిమాలో ఓ పాట‌లో ఓ నిమిషం పాటు క‌నిపించ‌బోతున్నాడ‌ని వార్త‌లు విన‌ప‌డుతున్నాయి. అయితే ఈ వ్య‌వ‌హారంపై ఇప్ప‌టి వ‌ర‌కు చిత్ర యూనిట్ స్పందించ‌లేదు.

ఆకాష్ పూరి స‌ర‌స‌న కేతికా శ‌ర్మ హీరోయిన్‌గా న‌టిస్తుంది. ర‌మ్య‌కృష్ణ కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్నారు. సినిమా ప్ర‌స్తుతం చిత్రీక‌ర‌ణ ద‌శ‌లో ఉంది. త్వ‌ర‌లోనే పాట‌ల చిత్రీక‌ర‌ణ జ‌ర‌గ‌నుంది.