close
Choose your channels

రామోజీరావు ఎన్‌సైక్లోపీడియా.. మోహన్ బాబు

Wednesday, October 16, 2019 • తెలుగు Comments

రామోజీరావు ఎన్‌సైక్లోపీడియా..: మోహన్ బాబు

టాలీవుడ్ సీనియర్ నటుడు, నిర్మాత మంచు మోహన్‌బాబు.. ఈనాడు సంస్థల అధినేత రామోజీరావుతో భేటీ అయ్యారు. ఇటీవల రామోజీ ఫిల్మ్ సిటీకి వెళ్లిన మంచు మోహన్ బాబు ఆయనతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా.. సినిమా, విద్యతో పాటు రాజకీయాలకు సంబంధించిన పలు అంశాలపై చర్చించినట్లు సోషల్ మీడియా వేదికగా మోహన్ బాబు చెప్పుకొచ్చారు.

భేటీ అనంతరం ట్విట్టర్‌లో రామోజీరావుపై ప్రశంసల వర్షం కురిపించారు. ‘రామోజీరావు ఓ నడిచే ఎన్‌సైక్లోపీడియా.. ఆయన నుంచి ఎంతో నేర్చుకోవాలి’ అని మోహన్ బాబు తెలిపారు. అయితే ఈ భేటీపై ఇటు రాజకీయాల్లో.. అటు సినీ ఇండస్ట్రీలో పెద్దఎత్తున చర్చ జరుగుతోంది.

Get Breaking News Alerts From IndiaGlitz