'రాములో రాముల..' సాంగ్ రికార్డ్‌

  • IndiaGlitz, [Wednesday,May 13 2020]

ఈ మ‌ధ్య విడుద‌లైన చిత్రాల్లోని పాట‌ల్లో ‘అల వైకుంఠ పుర‌ములో’ సాంగ్స్‌కు వ‌చ్చినంత రెస్పాన్స్ మ‌రే సినిమాకు రాలేదు. అల్లు అర్జున్‌, త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్‌లో రూపొందిన ఈ హ్యాట్రిక్ చిత్రం బ్లాక్ బ‌స్ట‌ర్ విజ‌యాన్ని సాధించింది. పాట‌ల విష‌యానికి వ‌స్తే.. సినిమా విడుద‌ల‌కు ముందు లిరిక‌ల్ వీడియో సాంగ్స్ సెన్సేష‌న్ క్రియేట్ చేశాయి. ‘సామ‌జ‌వ‌ర‌గ‌మ‌న‌..’, ‘రాములో రాముల ...’, ‘బుట్ట‌బొమ్మ..’ సాంగ్స్‌కు విప‌రీత‌మైన క్రేజ్ ద‌క్కింది. ఒక్కొక్క సాంగ్ వంద మిలియ‌న్ మార్కును చేరుకున్నాయి.

ఇక సినిమా విడుద‌ల త‌ర్వాత వీడియో సాంగ్స్‌కు అదే రేంజ్‌లో ఆద‌ర‌ణ ద‌క్కుతుంది. ఇటీవ‌ల ‘బుట్ట‌బొమ్మ..’ వీడియో సాంగ్ 150 మిలియ‌న్ మార్క్‌ను క్రాస్ చేసిన సంగ‌తి తెలిసిందే. తాజాగా ఇప్పుడు ‘రాములో రాముల..’ సాంగ్ 100 మిలియ‌న్ మార్కును అందుకుంది. ఈ విష‌యాన్ని నిర్మాణ సంస్థ‌లు అధికారికంగా తెలియ‌జేశాయి. కాసర్లశ్యామ్ ఈ పాటను రాయగా తమన్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందించిన సంగతి తెలిసిందే. ఈ సంక్రాంతికి విడుద‌లైన ఈ సినిమా 200 కోట్ల రూపాయ‌ల వ‌సూళ్ల‌ను దాటి నాన్ బాహుబ‌లి రికార్డుల‌ను సాధించింది. ప్ర‌స్తుతం బ‌న్నీ, సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో పుష్ప అనే పాన్ ఇండియా సినిమా చేస్తున్నాడు.

More News

బాలీవుడ్ రీమేక్‌లో రాజ్ త‌రుణ్‌

ఉయ్యాలా జంపాలా చిత్రంతో హీరోగా కెరీర్‌ను స్టార్ట్ చేసిన రాజ్‌త‌రుణ్ తర్వాత మంచి విజయాలను దక్కించుకుని హీరోగా తనకంటూ ఓ గుర్తింపును సంపాదించుకున్నారు.

మ‌రోసారి త్రిష‌కు చిరు ఛాన్స్ ఇస్తాడా?

మెగాస్టార్ చిరంజీవితో స్టాలిన్ సినిమాలో త్రిష జోడీ క‌ట్టింది. దాని త‌ర్వాత చిరు 152వ చిత్రం ‘ఆచార్య‌’లోనూ జోడీ క‌ట్టాల్సింది. అయితే చివ‌రి నిమిషంలో క్రియేటివ్ డిఫ‌రెన్సెస్‌తో త‌ప్పుకుంటున్న‌ట్లు

మలయాళ రీమేక్‌లో ప‌వ‌న్‌..?

రాజ‌కీయాల నుండి సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన త‌ర్వాత ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్ వ‌రుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు. ఇప్ప‌టికే ఆయ‌న మూడు సినిమాల‌ను లైన్‌లో పెట్టారు.

విశాఖ గ్యాస్ లీక్ ఘటనపై వైసీపీ ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు

విశాఖ ఎల్‌జీ గ్యాస్ లీకేజీ ఘటనలో 12 మంది కన్నుమూసిన విషయం విదితమే. తెల్లారుజామున జరిగిన ఈ ప్రమాదంలో పోలీసులు అప్రమత్తమవ్వడంతో మరణాలు చాలానే తగ్గాయి.

ఈసారి ఖైరతాబాద్ గణపతి ఒక్క అడుగే..!

తెలుగు రాష్ట్రాల్లో ఖైరతాబాద్ గణేశ్‌కు ప్రత్యేక స్థానం గురించి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. రూపంలో ఏటికేడు కొత్తదనం సంతరించుకుంటూ కనువిందు చేసే ఈ భారీ గణేశుడిని