రోజాపై రమ్యకృష్ణ పోటీ...

  • IndiaGlitz, [Saturday,November 12 2016]

సినిమాల్లోనూ, రాజ‌కీయాల్లోనూ రోజా ఫైర్‌బ్రాండ్ ఇమేజ్‌ను సంపాదించుకుంది. బుల్లితెర‌పై కూడా ప్రోగ్రామ్స్‌లో త‌న‌దైన శైలిలో రాణిస్తుంది. ముఖ్యంగా నాగ‌బాబు, రోజా చేసే జబ‌ర్‌ద‌స్త్ ప్రోగ్రామ్‌కు మంచి క్రేజ్ ఉంది. ఈ ప్రోగ్రామ్ టి.ఆర్‌.పి.రేటింగ్ కూడా టాప్ రేంజ్‌లో ఉంది. ఇప్పుడు మ‌రో టీవీ చానెల్ ఇలాంటి మ‌రో ప్రోగ్రామ్‌ను డిజైన్ చేసింద‌ట‌. రోజా స్థానంలో ర‌మ్య‌కృష్ణ‌ను, నాగ‌బాబు స్థానంలో పోసాని కృష్ణ‌ముర‌ళిని న్యాయ నిర్ణేత‌లుగా తీసుకుని ఈప్రోగ్రాంను కండెక్ట్ చేయాల‌ని స‌ద‌రు టీవీ చానెల్ ప్ర‌య‌త్నం. బాహుబ‌లితో ర‌మ్య‌కృష్ణ ఇమేజ్ ఒక్క‌సారి మారిపోయింది. ఇప్పుడు ఈ ఇమేజ్‌ను టీవీ చానెల్‌వారు ప్రోగ్రాంకు వాడుకోవాల‌ని ప్ర‌య‌త్నాలు చేస్తున్నార‌ట‌. మ‌రి రోజా త‌ర‌హాలో ర‌మ్య‌కృష్ణ బుల్లితెర‌పై స‌క్సెస్ సాధిస్తుందా...చూద్దాం...

More News

కబాలి సీక్వెల్ కి టైటిల్ రిజిష్టర్ చేసిన ప్రొడ్యూసర్..!

సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన సంచలన చిత్రం కబాలి.ఈ చిత్రాన్ని యువ దర్శకుడు రంజిత్ దర్శకత్వంలో కలైఫులి ఎస్ థాను నిర్మించారు.

బ్లాక్ బష్టర్ డైరెక్టర్ చేతుల మీదుగా రిలీజ్ కానున్న జయమ్ము నిశ్చయమ్మురా ట్రైలర్..!

కమెడియన్ శ్రీనివాస్ రెడ్డి -పూర్ణ జంటగా నటించిన చిత్రం జయమ్ము నిశ్చయమ్ము రా.

మణిరత్నం - కార్తీ ల డ్యూయెట్ మూవీని రిలీజ్ చేస్తున్న దిల్ రాజు

ప్రఖ్యాత దర్శకులు మణి రత్నం గురించి తెలుగు ప్రేక్షకులకు కొత్తగా పరిచయం అక్కర్లేదు.

ప‌వ‌న్‌తో బ‌స్‌స్టాప్ హీరోయిన్‌

ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్ హీరోగా ఆర్‌.టి.నేస‌న్ ద‌ర్శ‌కత్వంలో ఎ.ఎం.ర‌త్నం నిర్మాత‌గా ఓ సినిమా రూపొంద‌నున్న సంగ‌తి తెలిసిందే. ఇటీవ‌ల ఈ సినిమా లాంఛనంగా ప్రారంభ‌మైంది.

2 స్టేట్స్ తెలుగు రీమేక్ లో చైతు..!

కరణ్ జోహార్ ధర్మ ప్రొడక్షన్స్,సాజిద్ నడియాడ్ వాలా గ్రాండ్ సన్ ఎంటర్ టైన్ మెంట్ సంయుక్తంగా నిర్మించిన చిత్రం 2 స్టేట్స్.