close
Choose your channels

బ్లాక్ బష్టర్ డైరెక్టర్ చేతుల మీదుగా రిలీజ్ కానున్న జయమ్ము నిశ్చయమ్మురా ట్రైలర్..!

Saturday, November 12, 2016 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

క‌మెడియ‌న్ శ్రీనివాస్ రెడ్డి - పూర్ణ జంట‌గా న‌టించిన చిత్రం జ‌య‌మ్ము నిశ్చయ‌మ్ము రా. ఈ చిత్రాన్ని శివ‌రాజ్ ఫిల్మ్స్ బ్యాన‌ర్ పై శివ‌రాజ్ క‌నుమూరి స్వీయ నిర్మాణంలో తెర‌కెక్కిస్తున్నారు. స‌మైక్యంగా న‌వ్వుకుందాం అనే ట్యాగ్ లైన్, దేశ‌వాళి ఎంట‌ర్ టైన్మెంట్ అనే నినాదంతో ఈ చిత్రం ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చేందుకు రెడీ అవుతుంది.
ఈ సినిమాలోని ఓ రంగుల చిల‌క‌...అనే పాట ఎంత పాపుల‌ర్ అయ్యిందో తెలిసిందే. ఈ మూవీ థియేట్రిక‌ల్ ట్రైల‌ర్ ను బ్లాక్ బ‌ష్ట‌ర్ డైరెక్ట‌ర్ కొర‌టాల శివ రేపు (ఈనెల 13న‌) స్పెష‌ల్ ఈవెంట్ లో రిలీజ్ చేయ‌నున్నారు. గీతాంజ‌లి చిత్రంలో కీల‌క పాత్ర పోషించిన శ్రీనివాస్ రెడ్డి ఈ చిత్రంలో పూర్తి స్ధాయి హీరోగా న‌టించారు. ఓ రంగుల చిల‌క అనే పాట‌తో అంద‌ర్నీ ఆక‌ట్టుకున్నాడు శ్రీనివాస‌రెడ్డి. మ‌రి...ఈ సినిమాతో హీరోగా కూడా స‌క్సెస్ అవుతాడ‌ని ఆశిద్దాం..!

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.