కాలేజీ డేస్ గుర్తుకొచ్చాయంటున్న హీరోయిన్‌..

  • IndiaGlitz, [Wednesday,November 22 2017]

ర‌ష్మిక మండ‌న్నా..కిరిక్ పార్టీతో స‌క్సెస్ కొట్టి, ఆ ద‌ర్శ‌కుడితోనే ప్రేమ‌లో మునిగిన ఈ అమ్మ‌డు తెలుగులో నాగశౌర్య హీరోగా రూపొందుతోన్న 'ఛలో' చిత్రంతో తెలుగులోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తుంది. ఈ సినిమాలో కాలేజ్ వెళ్లే అమ్మాయి పాత్రలో రష్మిక నటించింది.

ఈ సినిమా కోసం గుంటూరు క్యాంప‌స్‌లో స‌న్నివేశాల‌ను చిత్రీక‌రించిన‌ప్పుడు తనకు, తన కాలేజీ రోజులు గుర్తుకొచ్చాయన్న రష్మిక. ఈ సినిమా షూటింగ్ సమాయంలో చిల్లీ చికెన్, చికెన్ మసాలా వంటి ఆంధ్ర వంటకాలను రుచి చూశానని చెప్పారు.

అలాగే హైదరాబాద్‌లో చారిత్రాత్మక ప్రదేశాలను కూడా చూడాలనుకంటుందట. పనిలో పనిగా నాగశౌర్య చాలా మంచి వ్యక్తి. నటన పరంగా, డైలాగ్స్ పరంగా నాకెంతో సపోర్ట్ చేశాడంటూ పొగడ్తల వర్షం కురిపించేసింది.

More News

సీక్వెల్ హీరోయిన్‌గా అనన్య‌..

అనన్య అంటే జ‌ర్నీ చిత్రంలో న‌టించిన హీరోయిన్ కాదు..బాలీవుడ్ ఎంట్రీ కోసం ఎదురుచూస్తోన్న అన‌న్య పాండే. విల‌క్ష‌ణ న‌టుడు చంకీ పాండే కుమార్తె ఈమె.

ఈ 24న ఇప్పట్లో రాముడిలా సీతలా ఎవరుంటారండీ బాబు

లక్ష్మి ప్రసాద్ ప్రొడక్షన్ లో శివ సాయి సమర్పణలో నిర్మాత ప్రశ్నాద్  తాతా నిర్మిస్తున్న చిత్రం ఇప్పట్లో రాముడిలా సీతలా ఎవరుంటారండీ బాబు.

'ఖాకి' ఇంట్రస్టింగ్ లొకేషన్స్

సినిమా చూస్తున్నంత సేపు మనకు లొకేషన్లు చాలా కీలక పాత్ర పోషిస్తాయి. సినిమాల్లో చూసిన లొకేషన్లనే చూపించడం ఒక పద్ధతి. కానీ అప్పటిదాకా ప్రేక్షకుడికి అనుభవంలో లేని లొకేషన్లను కళ్లకు కట్టడం మరో పద్ధతి.

నవంబ‌ర్ 24న 'నెపోలియ‌న్‌' సంద‌డి

ఆచార్య క్రియేషన్స్‌, ఆనంద్‌ రవి కాన్సెప్ట్‌ బ్యానర్స్‌పై రూపొందుతున్న చిత్రం 'నెపోలియన్‌'. ఆనంద్‌ రవి హీరోగా న‌టిస్తూ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. కోమ‌లి, ర‌వివ‌ర్మ‌, కేదార్ శంక‌ర్‌, మ‌ధుమ‌ణి, గురురాజ్ త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ధారులు.

నాగచైతన్య 'సవ్యసాచి' ఫస్ట్ లుక్ విడుదల

అక్కినేని నాగచైతన్య కథానాయకుడిగా చందు మొండేటి దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తున్న "సవ్యసాచి" రెగ్యులర్ షూట్ నవంబర్ 8 నుంచి మొదలైన విషయం తెలిసిందే.