రవితేజ 'టచ్ చేసి చూడు' ప్రారంభం

  • IndiaGlitz, [Friday,February 03 2017]

'మాస్ మ‌హారాజా' ర‌వితేజ హీరోగా రూపొందుతున్న చిత్రం 'ట‌చ్ చేసి చూడు'. విక్ర‌మ్ సిరికొండ ద‌ర్శ‌క‌త్వంలో ల‌క్ష్మీ న‌ర‌సింహ ప్రొడ‌క్ష‌న్స్ ప‌తాకంపై న‌ల్ల‌మ‌లుపు శ్రీనివాస్ (బుజ్జి), వ‌ల్ల‌భ‌నేని వంశీమోహ‌న్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. బేబీ భ‌వ్య స‌మ‌ర్ప‌ణ‌లో రూపొందుతున్న ఈ సినిమాలో రాఖీఖ‌న్నా, లావ‌ణ్య త్రిపాఠి క‌థానాయిక‌లు.
ఈ సినిమా ప్రారంభోత్స‌వం శుక్ర‌వారం (ఫిబ్ర‌వ‌రి 3) హైద‌రాబాద్‌లో జ‌రిగింది. హీరో ర‌వితేజ‌పై చిత్రీక‌రించిన ముహూర్త‌పు దృశ్యానికి నిర్మాత‌ల్లో ఒక‌రైన వ‌ల్ల‌భ‌నేని వంశీ మోహ‌న్ క్లాప్ ఇవ్వ‌గా, సీనియ‌ర్ ఎడిట‌ర్ గౌతంరాజు కెమెరా స్విచ్ ఆన్ చేశారు. ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు వీవీ వినాయ‌క్ గౌర‌వ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు.
ఈ సంద‌ర్భంగా నిర్మాత‌లు న‌ల్ల‌మ‌లుపు శ్రీనివాస్ (బుజ్జి), వ‌ల్ల‌భ‌నేని వంశీ మోహ‌న్ మాట్లాడుతూ ''ఈ రోజు నుంచి రెగ్యుల‌ర్ షూటింగ్ మొద‌లుపెడుతున్నాం. వారం రోజుల‌కు పైగా ఇక్క‌డే తొలి షెడ్యూల్ చేయ‌నున్నాం. త‌దుప‌రి షెడ్యూలు పాండిచ్చేరిలో 25 రోజులు చేయ‌నున్నాం. మాస్ మ‌హారాజా ర‌వితేజ ఇమేజ్‌కి తగ్గ‌ట్టుగా ప్ర‌ముఖ ర‌చ‌యిత వ‌క్కంతం వంశీ మంచి క‌థ‌ను త‌యారుచేశారు'' అని తెలిపారు. యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నామ‌ని, హేమాహేమీలైన సాంకేతిక బృందం ఈ చిత్రానికి ప‌ని చేస్తున్నార‌ని ద‌ర్శ‌కుడు విక్ర‌మ్ సిరికొండ పేర్కొన్నారు.
ఈ చిత్రానికి ఫోటోగ్ర‌ఫీ: ఎం.సుకుమార్‌, సంగీతం: జామ్8, ఫైట్స్: పీట‌ర్ హెయిన్‌, క‌థ‌: వ‌క్కంతం వంశీ, స్క్రీన్‌ప్లే: దీప‌క్ రాజ్‌, మాట‌లు: శ‌్రీనివాస‌రెడ్డి, అడిష‌న‌ల్ డైలాగ్స్: ర‌విరెడ్డి మ‌ల్లు, ఎడిటింగ్‌: గౌతంరాజు, ఆర్ట్: ర‌మ‌ణ వంక‌, ప్రొడ‌క్ష‌న్ కంట్రోల‌ర్‌: కొత్త‌ప‌ల్లి ముర‌ళీకృష్ణ‌, నిర్మాత‌లు: న‌ల్ల‌మ‌లుపు శ్రీనివాస్ (బుజ్జి), వ‌ల్ల‌భ‌నేని వంశీమోహ‌న్‌, ద‌ర్శ‌క‌త్వం: విక్ర‌మ్ సిరికొండ‌.

More News

హాథీరాం బాబా క్యారెక్టర్ లో అద్భుతంగా నటించిన నాగార్జున చరిత్రలో నిలిచిపోతారు - నిర్మాత ఎ.మహేష్ రెడ్డి

వ్యాపార రంగంలో అంచెలంచెలగా ఎదిగి ఎ.ఎం.ఆర్.గ్రూప్ సంస్థను స్థాపించి నాలుగు వేల మందికి పైగా జీవనోపాధిని కల్పిస్తూ సక్సెస్ ఫుల్ బిజినెస్మేన్గా రాణిస్తున్నారు ఎ.ఎం.ఆర్.గ్రూప్ అధినేత ఎ.మహేష్ రెడ్డి.

పవన్ టీజర్ డేట్ ఫిక్సయ్యింది

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా నార్త్ స్టార్ ఎంటర్ టైన్మెంట్ బ్యానర్పై శరత్ మరార్ నిర్మాతగా డాలీ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం `కాటమరాయుడు`. సినిమా శరవేగంగా చిత్రీకరణను జరుపుకుంటుంది.

మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో కళాబంధు టి.సుబ్బరామిరెడ్డి నిర్మాతగా మల్టీస్టారర్

ఖైదీ నంబర్ 150 చిత్రంతో తెలుగు చిత్రసీమలోకి రీ ఎంట్రీ ఇచ్చి సెన్సేషనల్ హిట్ సాధించిన మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కాంబినేషన్లో స్టార్ రైటర్, డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో టి.సుబ్బరామిరెడ్డి నిర్మాతగా మల్టీస్టారర్ రూపొందనుంది.

సూపర్ స్టార్ తో హన్సిక....

మలయాళంతో పాటు దక్షిణాది సినిమాలపై ఫుల్ ఫోకస్ పెట్టిన మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్

'ఆక్సిజన్' షూటింగ్ పూర్తి...

ఎగ్రెసివ్ హీరో గోపీచంద్ కథానాయకుడిగా ఎ.ఎం.జోతికృష్ణ దర్శకత్వంలో శ్రీసాయిరాం క్రియేషన్స్ పతాకంపై ఎస్.ఐశ్వర్య నిర్మిస్తున్నచిత్రం 'ఆక్సిజన్`. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణను పూర్తి చేసుకుంది.