'ఖిలాడి' మే 28న విడుద‌ల‌‌

  • IndiaGlitz, [Saturday,January 30 2021]

'క్రాక్' వంటి బ్లాక్‌బ‌స్ట‌ర్ త‌ర్వాత మాస్ మ‌హారాజా ర‌వితేజ హీరోగా, 'రాక్ష‌సుడు' వంటి బ్లాక్‌బ‌స్ట‌ర్‌ని తెర‌కెక్కించిన ర‌మేష్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న హై ఓల్టేజ్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్ 'ఖిలాడి' మే 28న విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతోంది. ర‌వితేజ ద్విపాత్రాభిన‌యం చేస్తున్న ఈ చిత్రానికి స‌త్య‌నారాయ‌ణ కోనేరు నిర్మాత‌. డా. జ‌యంతీలాల్ గ‌డ స‌మ‌‌ర్ప‌ణ‌లో ఏ స్టూడియోస్‌తో క‌లిసి బాలీవుడ్ నిర్మాణ సంస్థ పెన్ స్టూడియోస్ ఈ సినిమాను నిర్మిస్తోంది.

హ‌వీష్ ప్రొడ‌క్ష‌న్‌లో రూపుదిద్దుకుంటున్న ఈ మూవీకి 'ప్లే స్మార్ట్' అనేది ట్యాగ్‌లైన్‌. ప్ర‌స్తుతం ఈ సినిమా షూటింగ్ హైద‌రాబాద్‌లో జ‌రుగుతోంది.

శ‌నివారం ఈ సినిమా రిలీజ్ డేట్‌ను నిర్మాత‌లు ప్ర‌క‌టించారు. మే 28న చిత్రం విడుద‌ల‌వుతోంద‌ని వెల్ల‌డిస్తూ రిలీజ్ డేట్ పోస్ట‌ర్‌ను షేర్ చేశారు. ఈ పోస్ట‌ర్‌లో టాప్ టు బాట‌మ్ బ్లాక్ డ్ర‌స్‌లో, బ్లాక్ గాగుల్స్‌, బ్లాక్ షూస్‌తో, చేతిలో రివాల్వ‌ర్‌తో రోడ్డు మీద న‌డ‌చుకుంటూ వ‌స్తున్న ర‌వితేజ స్టైలిష్‌గా క‌నిపిస్తున్నారు. ఆయ‌న చుట్టూ క‌రెన్సీ నోట్లు గాల్లో ఎగురుతూ ఉన్నాయి.

ఇంత‌కుముందు ర‌వితేజ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా జ‌న‌వ‌రి 26న విడుద‌ల చేసిన వీడియో గ్లిమ్స్‌కు ట్రెమండ‌స్ రెస్పాన్స్ ల‌భించింది. ఈ సినిమా యాక్ష‌న్ ల‌వ‌ర్స్‌కు మంచి ట్రీట్ కానున్న‌ద‌ని ఈ గ్లిమ్స్ ద్వారా తెలిపారు మేక‌ర్స్‌.

ర‌వితేజ స‌ర‌స‌న మీనాక్షి చౌధ‌రి మెయిన్ హీరోయిన్‌గా న‌టిస్తుండ‌గా, డింపుల్ హ‌య‌తి సెకండ్ హీరోయిన్ రోల్ చేస్తున్నారు.

ఉన్న‌త స్థాయి టెక్నిక‌ల్ విలువ‌ల‌తో ర‌మేష్ వ‌ర్మ 'ఖిలాడి'ని ఆద్యంతం ఉత్కంఠ‌భ‌రితంగా తీర్చిదిద్దుతున్నారు. రాక్‌స్టార్ దేవి శ్రీప్రసాద్ అందిస్తున్న మ్యూజిక్ ఈ సినిమాకు బిగ్ ఎస్సెట్ కానున్న‌ది. సౌత్ ఇండ‌స్ట్రీలోని న‌లుగురు టాప్ ఫైట్ మాస్ట‌ర్లు రామ్‌-ల‌క్ష్మ‌ణ్, అన్బు-అరివు మాస్ట‌ర్స్ ఈ చిత్రానికి వ‌ర్క్ చేస్తుండ‌డం విశేషం. 'లూసిఫ‌ర్' ఫేమ్ సుజిత్ వాసుదేవ్ సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు.

శ్రీ‌కాంత్ విస్సా, దేవిశ్రీ ప్ర‌సాద్ సోద‌రుడు సాగ‌ర్‌ డైలాగ్స్ రాస్తున్న ఈ చిత్రానికి శ్రీ‌మ‌ణి సాహిత్యం అందిస్తున్నారు. అమ‌ర్ రెడ్డి ఎడిట‌ర్‌గా ప‌నిచేస్తున్నారు.

తారాగ‌ణం: ర‌వితేజ‌, మీనాక్షి చౌధ‌రి, డింపుల్ హ‌య‌తి

More News

మస్క్‌ను న్యాయస్థానంలో నిలబెట్టిన భారతీయ విద్యార్థి

ప్రపంచ కుబేరుడు, ప్రముఖ ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ టెస్లా అధినేత ఎలన్ మస్క్‌ను ఓ భారతీయ అమెరికన్ విద్యార్థి న్యాయస్థానంలో నిలబెట్టగలిగాడు.

ఉక్కు మ‌హిళ పాత్ర‌లో కంగ‌నా.. !

భార‌త‌దేశం ఉక్కు మ‌హిళ .. ప్ర‌ధాని ఇందిరాగాంధీ. మ‌న దేశానికి తొలి మ‌హిళా ప్ర‌ధాని.

‘ఆచార్య, పుష్ప, ఆర్ఆర్ఆర్’.. కామన్ పాయింట్ గుర్తించారా?

‘ఆచార్య, పుష్ప, ఆర్ఆర్ఆర్’కి సంబంధించి ఓ కామన్ పాయింట్ ఉంది. ఈ కామన్ పాయింట్‌ ఆసక్తిని రేకెత్తిస్తోంది.

స్టార్ మా లో ప్రతి సండే... స్పెషల్ !!

అందరూ ఎదురుచూసేది ఆదివారం కోసం. ఆ ఆదివారం ఇంకా స్పెషల్ గా వుండాలని, ఓ మంచి అనుభూతిని మిగల్చాలని ఆదివారం

మదనపల్లె ఘటన: అలేఖ్యను చంపి ఆమె నాలుకను తినేసిందట..

చిత్తూరు జిల్లా మదనపల్లెలో జరిగిన జంట హత్యల కేసులో ఈ దారుణాలకు ప్రధాన కారణం పెద్ద కుమార్తె అలేఖ్యేనని తెలుస్తోంది.