ఏపీలో ఐదు చోట్ల మళ్లీ పోలింగ్..

  • IndiaGlitz, [Wednesday,May 15 2019]

ఏపీలోని చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో ఐదు పోలింగ్ బూతుల్లో మరోసారి ఎన్నికలు నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘం.. రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. బుధవారం సాయంత్రం ఈ విషయమై సీఈసీ ఏపీ ఎన్నికల సంఘానికి లేఖ రాసింది. ఈ లేఖపై స్పందించిన రాష్ట్ర ఎన్నికల సంఘం ఈ నెల 19న ఉదయం 7గంటల నుంచి సాయంత్రం 6గంటల వరకు ఆయా బూత్‌ల పరిధిలో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌ జరపాలని అధికారులను ఆదేశించింది. కాగా.. ఏప్రిల్-11న ఎన్నికలు జరిగిన అనంతరం రెండోసారి కొన్ని ప్రాంతాల్లో రీపోలింగ్ జరిగిన విషయం విదితమే.

రీ- పోలింగ్ జరిగేది ఎక్కడ!?

321-ఎన్‌ఆర్‌ కమ్మపల్లి, 104- పులివర్తి వారి పల్లి, 316- కొత్త ఖండ్రిగ, 318-కమ్మపల్లి, 313-వెంకట రామాపురం పోలింగ్‌ కేంద్రాల్లో రీపోలింగ్‌ జరగనుంది. కాగా ఇప్పటికే ఎన్నికల కోడ్ అమలులో ఉండటంతో ఈ రీపోలింగ్ జరగనున్న ప్రాంతాలల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేసే యోచనలో ఈసీ ఉన్నట్లు తెలుస్తోంది.

రీ- పోలింగ్ ఎందుకు జరుగుతోంది..?

చంద్రగిరి నియోజకవర్గంలోని కొన్ని బూతుల్లో రీపోలింగ్ జరపాలని ఈ నెల 10, 11న ఇటు వైసీపీ.. అటు టీడీపీ అభ్యర్థులు, పార్టీ నేతల నుంచి రాష్ట్ర, కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు అందాయి. మరీ ముఖ్యంగా.. చంద్రగిరి సిట్టింగ్‌ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌ రెడ్డి రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని ఇటీవల కలిసి మా నియోజకవర్గంలో దళితులను ఓటు వేయకుండా చేశారంటూ ఫిర్యాదులు చేశారు.ఈ విషయంపై జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారాలతో మాట్లాడిన రాష్ట్ర ఎన్నికల సంఘం అసలేం జరిగింది...? రీపోలింగ్ ఎందుకు నిర్వహించాలి..? ఫిర్యాదుల్లో ఏయే అంశాలు ప్రస్తావనకు తెచ్చారు..? ఇలాంటివన్నీ పరిగణనలోనికి తీసుకుని రాష్ట్ర ఎన్నికల సంఘం సీఈసీ నివేదించింది. దీంతో చంద్రగిరి నియోజకవర్గంలోని ఎన్‌.ఆర్‌ కమ్మపల్లె, కమ్మపల్లె, పులివర్తిపల్లె, కొత్తకండ్రిగ, వెంకట్రామపురంలో రీపోలింగ్‌కు ఆదేశించింది.

ఎవరెవరు పోటీ చేస్తున్నారు.. చంద్రగిరి చరిత్రేంటి?

కాగా ఈ నియోజకవర్గం నుంచి వైసీపీ తరఫున.. సిట్టింగ్ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి.. టీడీపీ తరఫున పులివర్తి నాని పోటీ చేస్తున్నారు. 9 సార్లు జరిగిన ఎన్నికల్లో ఇప్పటి వరకూ కేవలం రెండు సార్లు మాత్రమే టీడీపీ గెలిచింది. మిగిలిన ఏడు సార్లలో ఆరు సార్లు కాంగ్రెస్.. 2014లో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గెలిచారు. కాగా 1978లో మొట్ట మొదటిసారి ఇక్కడ్నుంచి నారా చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ తరఫున పోటీచేసి గెలుపొందారు.

ఆ తర్వాత టీడీపీ నుంచి అయ్యదేవ నాయుడు.. అనంతరం నారావారి కుటుంబం నుంచి 1994లో నారా రామ్మూర్తి నాయుడు టీడీపీ నుంచి గెలిచి నిలిచారు. అయితే ఈ 2019 సార్వత్రిక ఎన్నికల్లో చెవిరెడ్డి గెలిచి కంచుకోటగా మలుచుకుంటారో..? లేక పులివర్తి నాని గెలిచి ఫస్ట్ టైమ్ ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీ గడప తొక్కుతారో వేచి చూడాల్సిందే మరి. సో.. ఇక్కడ గెలుపెవరిదో.. ఏపీ సీఎం ఎవరు కాబోతున్నారో తెలియాలంటే మే-23 వరకు వేచి చూడాల్సిందే మరి.

More News

ఇంటర్వ్యూలో షాకింగ్ విషయాలు చెప్పిన టీవీ9 రవిప్రకాష్!

టీవీ9 వ్యవస్థాపకుడు, చైర్మన్, సీఈవోగా సుమారు 15 ఏళ్లు పాటు మీడియా ఇండస్ట్రీలో సేవలందించిన వ్యక్తి రవిప్రకాష్. టీవీ9 అంటే రవిప్రకాష్.. రవిప్రకాష్ అంటే టీవీ9 అనేంతగా ఇప్పటి వరకూ పరిస్థితులుండేవి.

గోదావరి వాసుల గుండెల్లో ఉన్నావ్ కాటన్ దొర!

అన్నం పెట్టే రైతన్నకు సాగునీరు అందక అల్లాడుతున్న కాలంలో ధాన్యం పండించేందుకు, ప్రజలకు తాగునీరు అందించేందుకు ఆనకట్టకు రూపకల్పన చేసిన మహనీయుడు సర్‌ ఆర్ధర్‌ కాటన దొర.

86 వసంతాల తెలుగు సినిమా పుస్తకం 200 ప్రతులు మా నటీనటుల సంఘంకు బహూకరణ 

రెండు దశాబ్దాల ఫిలిం అనలిటికల్‌ అండ్‌ అప్రిసియేషన్‌ (ఫాస్‌) అధ్యక్షులు డా. కె. ధర్మారావు కృషితో, ఫాస్‌ ముద్రించిన మరియు సినీ ప్రముఖుల ప్రశంసలు పొందిన '' 86 వసంతాల తెలుగు సినిమా ''

హైదరాబాద్‌లో వరల్డ్ బిగ్గెస్ట్ వన్‌ ప్లస్ స్టోర్ నిర్మాణం

హైదరాబాద్‌లో అతిపెద్ద స్టోర్ ప్రారంభించడానికి చైనీస్ స్మార్ట్ ఫోన్ మేకర్ వన్ ప్లస్ సంస్థ సన్నాహాలు చేస్తోంది. టెక్నాలజీ, ఐటీ హబ్‌గా హైదరాబాద్ మారుతుండటం ఎంతో ప్రత్యేకమని వన్ ప్లస్ సంస్థ

చిక్కిపోతున్న ‘చంద్రుడు’.. పెను ప్రమాదం తప్పదా!?

చందమామ రోజురోజుకు చిక్కిపోతున్నాడు. అసలేం జరుగుతోందో అర్థం కాని పరిస్థితి.. మున్ముంథు పెను ప్రమాదం తప్పదనే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.