close
Choose your channels

ఇంటర్వ్యూలో షాకింగ్ విషయాలు చెప్పిన టీవీ9 రవిప్రకాష్!

Wednesday, May 15, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

టీవీ9 వ్యవస్థాపకుడు, చైర్మన్, సీఈవోగా సుమారు 15 ఏళ్లు పాటు మీడియా ఇండస్ట్రీలో సేవలందించిన వ్యక్తి రవిప్రకాష్. టీవీ9 అంటే రవిప్రకాష్.. రవిప్రకాష్ అంటే టీవీ9 అనేంతగా ఇప్పటి వరకూ పరిస్థితులుండేవి. అయితే ఇప్పుడు టీవీ9లో రవి లేడు.. ఆ ప్రకాశం కూడా లేదు! ఫోర్జరీ వ్యవహారం.. కొత్త యాజమాన్యానికి సహకరించకపోవడం.. చానెల్‌లో కేవలం 8 శాతమే షేర్లున్నప్పటికీ 90 శాతం షేర్లున్న కొత్త యాజమాన్యానికి చుక్కలు చూపించిన రవిప్రకాష్‌కు అలంద మీడియా ఊహించని షాకిచ్చి ఆయన్ను ఫౌండర్, చైర్మన్, సీఈవోగా పీకేసి కేవలం షేర్‌ హోల్డర్‌గా మాత్రమే మిగిల్చింది. అంతేకాదు రవిప్రకాష్ చేసిన అవకతవకలు, ఫోర్జరీ వ్యవహారంపై కేసులు నడుస్తున్నాయి. రవిప్రకాష్ పరారీలో ఉన్నాడు. అయితే ఈ తరుణంలో హిందుస్థాన్ టైమ్స్, ది న్యూస్ మినిట్ అనే జాతీయ వెబ్‌సైట్లకు రవిప్రకాష్ ఎక్స్‌క్లూజివ్‌గా ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ ఇంటర్వ్యూలో కొన్ని షాకింగ్ విషయాలు వెల్లడించారు. అసలు కంపెనీలో ఏం జరిగింది..? తనను టార్గెట్ చేసిందెవరు..? ఇలా పలు ఆసక్తికర, షాకింగ్ విషయాలను ఆయన వెల్లడించాడు.

మొత్తం టి. సర్కారే చేసింది!

" నన్ను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కావాలనే టార్గెట్ చేసింది. ఇంటర్ ఫలితాలు వెల్లడైన తర్వాత జరిగిన పరిణామాలు, విద్యార్థుల ఆత్మహత్యల నేపథ్యంలో టీవీ9లో ఒక కథనాన్ని ప్రసారం చేశాం. ఆ రోజు స్వయంగా నేనే తెరపై కనిపించి బోర్డు వైఫల్యాలను ప్రశ్నించి ఎండగట్టాను. నాటి నుంచే తెలంగాణ ప్రభుత్వం నన్ను టార్గెట్ చేసింది. నన్ను టార్గెట్ చేయడం వెనుక కేవలం రాజకీయ కారణాలే కాకుండా వ్యాపార ప్రయోజనాలు కూడా ఉన్నాయి. నేను ఆ రోజు ఇంటర్ బోర్డు వైఫల్యాల మీద మాట్లాడానే తప్ప ప్రభుత్వాన్ని అసలు ప్రశ్నించలేదు. దీన్ని ఆసరాగా తీసుకొని నన్ను టార్గెట్ చేశారు" అని రవిప్రకాశ్ చెప్పుకొచ్చాడు.

బిల్డర్లు, కాంట్రాక్టర్‌లపై పోరాటం!

"బిల్డర్లు, కాంట్రాక్టర్లకు వ్యతిరేకంగా పోరాటం చేస్తాను. టీవీ9 న్యూస్ ఛానెల్ నెట్‌వర్క్‌ను వెనుక డోర్ నుంచి హడావుడి చేస్తున్నారు. నేను ఒక పాత్రికేయుడిగా.. సమాజం కోసం పోరాటం చేస్తాను. ఈ దేశంలో బిల్డర్ల ఒత్తిళ్లు , కాంట్రాక్టుల ఒత్తిళ్లకు ఇది వీలుకాదు. రవి ప్రకాష్ నుంచి సంస్థ అధికారాన్ని తీసుకున్న కొత్త నిర్వహణ నిర్వహణలో ఎన్నడూ రాణించలేదు. ఈ టీవీ9 చానెల్ మొదట అసోసియేటెడ్ బ్రాడ్ కాస్టింగ్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్ (ABCL) చేత స్థాపించబడింది. గత ఏడాది ఆగస్టులో రియల్ ఎస్టేట్ రంగానికి చెందిన మై హోమ్ గ్రూప్, నిర్మాణ దిగ్గజంగా పేరుగాంచిన మెగా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ (ఎంఐఐఎల్) సంయుక్తంగా ఈ సంస్థలో అత్యధిక వాటాను కొనుగోలు చేయడంతో.. అలందా మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్ లిమిటెడ్ ఈ ఏడాది ఏప్రిల్‌లో 90.54 శాతం పెరిగింది" అని రవిప్రకాష్ చెప్పుకొచ్చాడు.

ఇది తప్పుడు నిర్ణయం..!

" షేర్లలో మెజారిటీ షేర్ హోల్డర్స్ ఉన్నాయా..? లేకుంటే మైనారిటీ షేర్లు ఉన్నాయా..? అనేది పాయింట్ కాదు.. వారికి ఎక్కువ శాతం ఉన్నాయి కాబట్టి మేనేజ్మెంట్ తీసుకోవచ్చు. కానీ చైర్మన్‌గా, ఫౌండర్‌గా ఉన్న నన్ను తప్పుడు, నిరాధారమైన ఆరోపణలతో బలవంతంగా సంస్థ నుంచి తొలగించడం బాధాకరం. అడ్డదారుల్లో... మై హోమ్ గ్రూప్ మీడియాలోకి ప్రవేశించింది. ఇది నాకు ఆశ్చర్యం కలిగించే విషయం. టీవీ9 గ్రూప్‌లో ఎల్లప్పుడూ లాభాలే నమోదయ్యేవి. ఇటీవల ఆర్థిక సంవత్సరంలో 2018-19 సంవత్సరానికి రికార్డు చేసినట్లు పేర్కొంది.. ఈ రికార్డు టర్నోవర్ రూ 255 కోట్లు. ప్రస్తుతం టీవీ 9 అనైతిక జర్నలిజంలో మునిగిపోతున్నది" అని రవిప్రకాష్ ఆరోపించాడు.

రేవంత్ వ్యవహారం..

" మై హోం రామేశ్వరరావు 2016లోనే టీవీ9ను దక్కించుకోవాలని అనుకున్నారు. అప్పట్లో నన్ను కూడా సంప్రదించారు. అయితే.. అందుకు నేను అంగీకరించలేదు. రామేశ్వరరావు ఆలోచన వెనుక రాజకీయ అజెండా ఉంది.. పైగా ఆయన తెలంగాణ ముఖ్యమంత్రికి అత్యంత సన్నిహితుడు. అంతేకాకుండా, ఆయన చినజీయర్ స్వామి అనుచరుడు. తన రాజకీయ, సైద్ధాంతిక సిద్ధాంతాలను జొప్పించే ఉద్దేశంతో టీవీ9ను టేకోవర్ చేసుకోవాలని భావించారు. ఈ ప్రతిపాదనకు నేను ఒప్పుకోలేదు. 2018 సెప్టెంబర్‌లో కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డిపై ఐటీ రైడ్స్ జరిగినప్పుడు నేను అమెరికాలో ఉన్నాను. ఆ సమయంలో నాకు న్యూస్‌రూమ్ నుంచి కాల్ వచ్చింది. రేవంత్ రెడ్డి వార్తను ఎలా కవర్ చేయాలో రామేశ్వరరావు కుమారుడు, సోదరుడు డిక్టేట్ చేస్తున్నారని ఫోన్‌ చేసి నా స్టాఫ్ చెప్పింది. రేవంత్ రెడ్డి వారికి రాజకీయ శత్రువు కావడంతో, ఆయనను రాజకీయంగా దెబ్బ తీసేందుకు వారు ప్రయత్నించారు" అని రవిప్రకాష్ ఇంటర్వ్యూలో సంచలన విషయం బయటపెట్టారు.

తెలంగాణ కోర్టులో చుక్కెదురు!

కాగా... భారతదేశంలో న్యాయ వ్యవస్థలో తాను ఇప్పటికీ నమ్ముతున్నారని..ఈ వివాదం నుంచి త్వరలోనే బయటపడాతననే నమ్మకం తనకుందని రవిప్రకాష్ చెప్పుకొచ్చాడు. ఇదిలా ఉంటే.. బుధవారం నాడు రవిప్రకాశ్‌కు తెలంగాణ హైకోర్టులో చుక్కెదురు అయింది. సైబర్‌ క్రైం పోలీసులు తనపై నమోదు చేసిన కేసులు రాజ్యాంగ విరుద్ధమంటూ రవిప్రకాశ్‌ బుధవారం హైకోర్టులో లంచ్‌ మోషన్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై అత్యవసరంగా విచారణ జరపాలని ఆయన న్యాయస్థానాన్ని కోరారు. అయితే దీనిపై అత్యవసర విచారణ అవసరం లేదంటూ పిటిషన్‌ను న్యాయస్థానం కొట్టేసింది. ప్రస్తుతం రవిప్రకాష్, శివాజీ ఇద్దరూ పరారీలో ఉన్నారు. త్వరలోనే తెలంగాణ పోలీసులు లుక్ అవుట్ నోటీసులు జారీ చేసే అవకాశాలు మెండుగా ఉన్నాయి.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.