ట్రంప్‌ పర్యటనకు కోటి మంది.. ఆర్జీవీ ఐడియా!

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ భారత్‌లో పర్యటించనున్న సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 24న అమెరికా అధ్యక్షుడి తొలి భారత పర్యటన ప్రారంభం కానుంది. పర్యటనకు ఆయనతో పాటు భార్య మెలానియా ట్రంప్, కూతరు ఇవాంకా, అల్లుడు జేరెడ్ కుష్నర్ కూడా హాజరుకానున్నారు. అయితే ట్రంప్ పర్యటనలో భాగంగా అహ్మదాబాద్‌లో నిర్వహించే రోడ్‌ షో, నమస్తే ట్రంప్‌ కార్యక్రమాలలో ట్రంప్‌ పాల్గొనబోతున్నారు. ఈ కార్యక్రమాలకు స్వాగతం పలికేందుకు కోటి మంది వరకు వస్తారని ట్రంప్ ఆశిస్తున్నారట. కోటి మంది వస్తున్నారని ఆశిస్తున్న ట్రంప్ పర్యటనపై టాలీవుడ్ వివాదాస్పద దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ తన ట్విట్టర్ వేదికగా ఆసక్తికర ట్వీట్ చేశారు.

ఇలా చేయండి!

‘ట్రంప్‌కు స్వాగతం పలకడానికి కోటి మంది రావాలని అనుకుంటున్నారని తెలిసింది. నిజంగానే కోటి మంది రావడానికి ఒకే మార్గం ఉంది. అదేమిటంటే.. ఆయనతో పాటు స్టేజీపైన బాలీవుడ్‌ స్టార్ హీరోలు అమితాబ్‌ బచ్చన్‌, సల్మాన్‌ ఖాన్‌, అమిర్‌ ఖాన్‌, షారుక్‌ ఖాన్‌, సూపర్ స్టార్ రజనీకాంత్‌, కత్రినా కైఫ్‌, దీపికా పదుకొనె, సన్నీ లియోన్‌ ఇలా వీరందరూ వరుసగా నిలబెడితే ఆయన అకున్నట్లు కోటిమంది కచ్చితంగా వస్తారు’ అని ఆర్జీవీ ట్వీట్‌ చేశాడు. వర్మ చేసిన ఈ ట్వీట్‌కు ఆయన వీరాభిమానులు పెద్ద ఎత్తున కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ఇంకొందరైతే పడిపడి నవ్వుతున్నారు.

More News

ట్రంప్‌తో విందుకు కేసీఆర్.. ప్రత్యేక ఆహ్వానం!

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ భారత్‌లో పర్యటించనున్న సంగతి తెలిసిందే. పర్యటనలో భాగంగా..

గూగుల్ ప్లే స్టోర్ నుంచి 600 యాప్‌లు తొలగింపు!

అవును మీరు వింటున్నది నిజమే.. ఒకట్రెండు కాదు ఏకంగా 600 మంది యాప్‌లను గూగుల్ ప్లే స్టోర్‌ నుంచి తొలగించడం జరిగింది.

రోజంతా లేడీస్‌ హాస్టల్‌లో విద్యార్థి.. రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకోవడంతో..!

విద్యార్థినీలు ఉన్న హాస్టల్‌లోకి బాయ్స్‌కు అనుమతి ఉండదన్న విషయం తెలిసిందే. అయితే.. అబ్బే ఈ షరతులు అందరికీ వర్తిస్తాయ్ కానీ నాకు కాదు అనుకున్నాడేమో కానీ..

త‌రుణ్ భాస్క‌ర్ షాక్‌!!

షార్ట్ ఫిలింస్ నుండి `పెళ్ళిచూపులు` చిత్రంతో ద‌ర్శ‌కుడిగా మారిన త‌రుణ్ భాస్క‌ర్ తొలి చిత్రంతోనే భారీ విజయాన్ని న‌మోదు చేసుకోవ‌డ‌మే కాదు..

సాయి కుమార్ చేతుల మీదుగా కాలేజ్ కుమార్ ట్రైలర్ లాంచ్ !!!

ఎమ్ ఆర్  పిక్చర్స్ పతాకంపై లక్ష్మణ్ గౌడా సమర్సణ లో ఎల్ పద్మనాభ నిర్మించిన చిత్రం కాలేజ్ కుమార్. కన్నడ ఘన విజయం సాధించిన ఈ మూవీ ని  తెలుగు లో రిమేక్ చేసాడు