‘వకీల్‌ సాబ్’కు పోటీగా ‘డైరెక్టర్ సాబ్’ వచ్చేశాడు!

పవర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్ 26వ చిత్రానికి ‘వ‌కీల్ సాబ్’ అనే టైటిల్‌ను ఖ‌రారు చేసిన సంగతి తెలిసిందే. బోనీ కపూర్ సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, బేబీ వ్యూ ప్రాజెక్ట్స్ బ్యానర్స్‌పై శిరీష్, దిల్‌రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఎస్‌.ఎస్‌.త‌మ‌న్ సంగీతం అందిస్తోన్న ఈ చిత్రానికి పి.ఎస్‌.వినోద్ సినిమాటోగ్రఫీని అందిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా ఫ‌స్ట్‌లుక్‌ను విడుద‌ల చేశారు. మ‌హిళా దినోత్సవం సంద‌ర్భంగా ఈ సినిమాలో ఓ సాంగ్‌ను విడుద‌ల చేయ‌డానికి చిత్రబృందం సన్నాహాలు చేస్తోంది.

ఫస్ట్ లుక్ అదుర్స్!
ఇక ఫ‌స్ట్ లుక్ విష‌యానికి వ‌స్తే.. తిప్పిన కుర్చీపై కాళ్లు పెట్టుకుని తీరిగ్గా ప‌వ‌న్ క‌ల్యాణ్ పుస్తకం చ‌దువుకుంటున్నట్లు ఆ లుక్ ఉంది. మరోవైపు.. ఫస్ట్ లుక్ ట్విట్టర్‌లో ప్రభంజనం సృష్టిస్తోంది. వరల్డ్ వైడ్ ట్రెండింగ్‌లో ప్రస్తుతం మూడో స్థానంలో కొనసాగుతోంది. పీఎస్ పీకే 26, వకీల్ సాబ్ హ్యాష్ ట్యాగ్ లతో రిలీజైన ఈ ఫస్ట్ లుక్‌కు సామాజిక మాధ్యమాల్లో అభిమానులు నీరాజనాలు పలుకుతున్నారు. ఈ లుక్‌పై ఇప్పటికే పలువురు సినీ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులు కూడా స్పందించి కామెంట్స్ చేశారు. తాజాగా సంచన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ స్పందించారు.

ఆర్జీవీ సెటైర్!
‘వకీల్ సాబ్‌’ కు ప్యారడీగా ‘డైరెక్టర్ సాబ్’ అంటూ సేమ్ టూ సేమ్ పవన్ గెటప్‌లో కుర్చీలో కూర్చున్న పిక్‌ను ఆర్జీవీ రిలీజ్ చేశారు. అంతేకాదు.. కాళ్లు బారచాపుకుని కూడా పోజిచ్చారు.అంతటితో ఆగని ఆయన.. ‘పిచ్చిపని కాని ఈ పనిని ఏ పిచ్చివాడైనా చేస్తాడని నేను అనుకోవడంలేదు’ అంటూ తనదైన శైలిలో ఓ సెటైర్ పేల్చారు. దీనికి పవన్ వీరాభిమానులు, మెగాభిమానులు చిత్రవిచిత్రాలుగా కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరైతే ఇంకో అడుగు ముందుకేసి ఆర్జీవీని బూతులతో తిట్టిపోస్తున్నారు.

More News

భారత్‌లో కరోనా.. హైదరాబాద్‌కూ వచ్చేసింది!

కరోనా వైరస్ లేదా కోవిడ్-19 పేరు వింటేనే ప్రపంచం వణికిపోతోంది.. చైనాలోని వూహాన్‌లో వచ్చిన ఈ వైరస్ ఖండాలను దాటేసి ప్రపంచ వ్యాప్తంగా విస్తరిస్తోంది.

కాల్ రాగానే హీరోయిన్ ముంబై ఎందుకెళ్లింది.. అసలు కథ ఇదీ!?

‘రాహు’ మూవీ హీరోయిన్ కృతి గార్గ్‌‌కు ‘అర్జున్ రెడ్డి’ దర్శకుడు సందీప్ రెడ్డి వంగ పేరుతో ఓ వ్యక్తి కాల్ చేసి ట్రాప్ చేశాడని వార్తలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే.

కరోనాపై అతి వీడియో ఏంటి చార్మీ.. సబబేనా!?

కరోనా వైరస్ లేదా కోవిడ్-19 పేరు వింటేనే ప్రపంచం వణికిపోతోంది.. చైనాలోని వూహాన్‌లో వచ్చిన ఈ వైరస్ ఖండాలను దాటేసి ప్రపంచ వ్యాప్తంగా విస్తరిస్తోంది.

నిర్భయ నిందితుల ఉరి మళ్లీ వాయిదా

దేశ రాజధాని న్యూ ఢిల్లీలో జరిగిన నిర్భయ ఘటనలోని నిందితుల ఉరిశిక్ష ఇప్పట్లో అమలు అయ్యే పరిస్థితులు కనిపించట్లేదు.

‘ఓ పిట్టకథ’ పెద్ద హిట్ కావాలి - మెగాస్టార్ చిరంజీవి

విశ్వంత్‌ దుద్దంపూడి, సంజయ్‌ రావు, నిత్యా శెట్టి, బ్రహ్మాజీ నటించిన చిత్రం ‘ఓ పిట్టకథ’. భవ్య క్రియేషన్స్ పతాకం ఫై