'రైట్ రైట్' షూటింగ్ పూర్తి

  • IndiaGlitz, [Tuesday,April 05 2016]
సుమంత్ అశ్విన్ హీరోగా మ‌ను ద‌ర్శ‌క‌త్వంలో శ్రీ స‌త్య ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ ప‌తాకంపై జె.వంశీకృష్ణ నిర్మిస్తున్న చిత్రం 'రైట్ రైట్‌'. వ‌త్స‌వాయి వెంక‌టేశ్వ‌ర్లు స‌మ‌ర్పిస్తున్నారు. 'బాహుబ‌లి' ఫేమ్ ప్ర‌భాక‌ర్ ఇందులో కీల‌క పాత్ర పోషిస్తున్నారు. పూజా జ‌వేరి క‌థానాయిక‌. ఇటీవ‌లే ఈ సినిమా షూటింగ్ పూర్త‌యింది.
ఈ సంద‌ర్భంగా....
నిర్మాత జె.వంశీకృష్ణ మాట్లాడుతూ ''మా సినిమా తొలి షెడ్యూల్‌ను అర‌కు, ఒడిశాలో 25 రోజులు చిత్రీక‌రించాం. రెండో షెడ్యూల్‌ను జ‌న‌వ‌రి 20 నుంచి 30 వ‌ర‌కు వికారాబాద్‌లో చేశాం. వికారాబాద్‌లోని బ‌స్ డిపో, బ‌స్టాండు, ఫారెస్ట్ లో కీల‌క స‌న్నివేశాల‌ను తెర‌కెక్కించాం. మూడో షెడ్యూల్‌ను ఇటీవ‌ల కేర‌ళ‌లో చిత్రీక‌రించాం. క్లైమాక్స్, పాట‌, ఛేజ్ సన్నివేశాల‌ను తెర‌కెక్కించ‌డంతో షూటింగ్ మొత్తం పూర్త‌యింది. ఐదు పాట‌లున్నాయి. శ్రీమ‌ణి రాశారు. జె.బి. మంచి ట్యూన్లు ఇచ్చారు. త్వ‌ర‌లోనే పాట‌ల‌ను విడుద‌ల చేస్తాం. సినిమాను మే నెలాఖ‌రున‌గానీ, జూన్ ప్ర‌థ‌మార్ధంలోగానీ విడుద‌ల చేస్తాం'' అని అన్నారు.
ద‌ర్శ‌కుడు మాట్లాడుతూ '' సుమంత్ అశ్విన్ కెరీర్‌లో మంచి సినిమా అవుతుంది. 'ల‌వ‌ర్స్', 'కేరింత‌' సినిమాల స‌క్సెస్‌లో ఉన్న ఆయ‌న‌కు ఈ సినిమా గుర్తుండిపోతుంది. నాజ‌ర్ చాలా అద్భుత‌మైన పాత్ర‌ను పోషించారు. తొలి స‌గం వినోదాత్మ‌కంగా సాగుతుంది. మ‌లి స‌గంలో మిస్ట‌రీ ఉంటుంది. మొత్తానికి ఉత్కంఠ‌భ‌రితంగా సాగే చిత్ర‌మ‌వుతుంది. 'బాహుబ‌లి' ప్ర‌భాక‌ర్ ఇందులో డ్రైవ‌ర్‌గా, సుమంత్ అశ్విన్ కండ‌క్ట‌ర్‌గా క‌నిపిస్తారు. మ‌ల‌యాళంలో ఘ‌న విజ‌యాన్ని మూట‌గ‌ట్టుకున్న 'ఆర్డిన‌రీ' సినిమా స్ఫూర్తితో తెర‌కెక్కిస్తున్నాం. మ‌న తెలుగు నేటివిటీకి త‌గ్గ‌ట్టు మార్పులు, చేర్పులు చేశాం. ఎస్‌.కోట నుంచి గ‌విటికి వెళ్లే ఓ ఆర్టీసీ బ‌స్సు ఈ సినిమాలో కీ రోల్ ప్లే చేస్తుంది. కామెడీ, ల‌వ్‌, మిస్ట‌రీ అంశాలున్న చిత్ర‌మిది'' అని తెలిపారు.

More News

మొరాకోకు బాలయ్య...

నందమూరి బాలకృష్ణ వందో సినిమా కోసం శరవేగంగా ప్లానింగ్ జరుగుతున్నాయి.

బ్రహ్మోత్సవం వచ్చేస్తుంది..

సూపర్ స్టార్ మహేష్ హీరోగా శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం బ్రహ్మోత్సవం.ఈ చిత్రాన్ని పి.వి.పి సంస్థ తెలుగు, తమిళ్ లో నిర్మిస్తుంది.

నాగ్ స్టూడియోలో వెంకీ మూవీ...

టాలీవుడ్ కింగ్ నాగార్జున అన్నపూర్ణ స్టూడియోలో విక్టరీ వెంకటేష్ నటిస్తున్న బాబు..బంగారం షూటింగ్ జరుపుకుంటుంది.

సర్ధార్ ఇంటర్వెల్ డైలాగ్ ఇదే..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన సర్ధార్ గబ్బర్ సింగ్ లో ఇంటర్వెల్ ఎపిసోడ్ సినిమాకి హైలెట్ గా నిలుస్తుందని డైరెక్టర్ బాబీ ఇంటర్ వ్యూలో చెప్పారు.

'ఈడోరకం ఆడోరకం' సెన్సార్ డేట్....

మంచు విష్ణు,రాజ్ తరుణ్,సోనారిక,హేబా పటేల్ హీరో హీరోయిన్స్ గా జి.నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో ఎ.కె.ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై రామబ్రహ్మం సుంకర నిర్మించిన చిత్ర 'ఈడోరకం ఆడోరకం'.