close
Choose your channels

'రైట్ రైట్' షూటింగ్ పూర్తి

Tuesday, April 5, 2016 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com
సుమంత్ అశ్విన్ హీరోగా మ‌ను ద‌ర్శ‌క‌త్వంలో శ్రీ స‌త్య ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ ప‌తాకంపై జె.వంశీకృష్ణ నిర్మిస్తున్న చిత్రం `రైట్ రైట్‌`. వ‌త్స‌వాయి వెంక‌టేశ్వ‌ర్లు స‌మ‌ర్పిస్తున్నారు. `బాహుబ‌లి` ఫేమ్ ప్ర‌భాక‌ర్ ఇందులో కీల‌క పాత్ర పోషిస్తున్నారు. పూజా జ‌వేరి క‌థానాయిక‌. ఇటీవ‌లే ఈ సినిమా షూటింగ్ పూర్త‌యింది.
ఈ సంద‌ర్భంగా....
నిర్మాత జె.వంశీకృష్ణ మాట్లాడుతూ ``మా సినిమా తొలి షెడ్యూల్‌ను అర‌కు, ఒడిశాలో 25 రోజులు చిత్రీక‌రించాం. రెండో షెడ్యూల్‌ను జ‌న‌వ‌రి 20 నుంచి 30 వ‌ర‌కు వికారాబాద్‌లో చేశాం. వికారాబాద్‌లోని బ‌స్ డిపో, బ‌స్టాండు, ఫారెస్ట్ లో కీల‌క స‌న్నివేశాల‌ను తెర‌కెక్కించాం. మూడో షెడ్యూల్‌ను ఇటీవ‌ల కేర‌ళ‌లో చిత్రీక‌రించాం. క్లైమాక్స్, పాట‌, ఛేజ్ సన్నివేశాల‌ను తెర‌కెక్కించ‌డంతో షూటింగ్ మొత్తం పూర్త‌యింది. ఐదు పాట‌లున్నాయి. శ్రీమ‌ణి రాశారు. జె.బి. మంచి ట్యూన్లు ఇచ్చారు. త్వ‌ర‌లోనే పాట‌ల‌ను విడుద‌ల చేస్తాం. సినిమాను మే నెలాఖ‌రున‌గానీ, జూన్ ప్ర‌థ‌మార్ధంలోగానీ విడుద‌ల చేస్తాం`` అని అన్నారు.
ద‌ర్శ‌కుడు మాట్లాడుతూ `` సుమంత్ అశ్విన్ కెరీర్‌లో మంచి సినిమా అవుతుంది. `ల‌వ‌ర్స్`, `కేరింత‌` సినిమాల స‌క్సెస్‌లో ఉన్న ఆయ‌న‌కు ఈ సినిమా గుర్తుండిపోతుంది. నాజ‌ర్ చాలా అద్భుత‌మైన పాత్ర‌ను పోషించారు. తొలి స‌గం వినోదాత్మ‌కంగా సాగుతుంది. మ‌లి స‌గంలో మిస్ట‌రీ ఉంటుంది. మొత్తానికి ఉత్కంఠ‌భ‌రితంగా సాగే చిత్ర‌మ‌వుతుంది. `బాహుబ‌లి` ప్ర‌భాక‌ర్ ఇందులో డ్రైవ‌ర్‌గా, సుమంత్ అశ్విన్ కండ‌క్ట‌ర్‌గా క‌నిపిస్తారు. మ‌ల‌యాళంలో ఘ‌న విజ‌యాన్ని మూట‌గ‌ట్టుకున్న `ఆర్డిన‌రీ` సినిమా స్ఫూర్తితో తెర‌కెక్కిస్తున్నాం. మ‌న తెలుగు నేటివిటీకి త‌గ్గ‌ట్టు మార్పులు, చేర్పులు చేశాం. ఎస్‌.కోట నుంచి గ‌విటికి వెళ్లే ఓ ఆర్టీసీ బ‌స్సు ఈ సినిమాలో కీ రోల్ ప్లే చేస్తుంది. కామెడీ, ల‌వ్‌, మిస్ట‌రీ అంశాలున్న చిత్ర‌మిది`` అని తెలిపారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.