ఎట్టకేలకు నామినేటెడ్ పదవి దక్కించుకున్న రోజా

  • IndiaGlitz, [Saturday,July 13 2019]

వైసీపీ ఫైర్ బ్రాండ్ రోజాకు మంత్రి పదవి దక్కకపోవడంతో ఆమె ఎంత బాధపడిందో తెలియదు గానీ.. ఆమె అభిమానులు, వైసీపీ కార్యకర్తలు నిరాశకు గురయ్యారు. రోజా ఇక జబర్దస్త్, బతుకు జట్కా బండీ చేసుకోవడమేనని ప్రత్యర్థులు సెటైర్లు సైతం వేశారు. ఎన్నికల ఫలితాలకు ముందు నానా హడావిడి చేసిన రోజా... మంత్రివర్గ విస్తరణ తర్వాత పత్తా లేకుండా పోయారు.

మీడియాలోనూ ఘాటూ విమర్శలు తగ్గిపోయాయి. అయితే ఈ ప్రచారానికి చెక్ పెడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆమెను తన ఇంటికి పిలిపించుకుని మాట్లాడారు. ఏపీఐఐసీ ఛైర్మన్ పదవిని ఇస్తానని హామీ ఇచ్చారు. సీఎం మాట అయితే ఇచ్చారు కానీ.. ప్రభుత్వం నుంచి అధికారిక ఉత్తర్వులు మాత్రం వెలువడలేదు. దీంతో మళ్లీ రోజాకు ఎదురుచూపులు తప్పలేదు.

వ్యూహాత్మకంగానే జగన్ ఆమెను పక్కనబెట్టారని మళ్లీ ఎత్తిపొడుపులు మొదలయ్యాయి. అయితే ఈసారి పక్క పార్టీల నుంచి కాకుండా సొంత పార్టీలోను గొనుగుడు మొదలైనట్లు పసిగట్టిన వైసీపీ అధినేత... వేగంగా పావులు కదిపారు. రోజా విషయంలో ఏదో ఒక నిర్ణయం తీసుకోని పక్షంలో అది అంతిమంగా పార్టీకి చేటు చేసే అవకాశం లేకపోలేదని వైసీపీ వ్యూహకర్తలు సైతం జగన్ చెవిన వేసినట్లు లోటస్ పాండ్‌ టాక్.

ఈ నేపథ్యంలో రోజాను ఏపీఐఐసీ ఛైర్మన్‌గా నియమిస్తూ ప్రభుత్వం నుంచి శనివారం అధికారిక ఉత్తర్వులు వెలువడ్డాయి. దీనిపై ఆమె హర్షం వ్యక్తం చేశారు. ఈ నెల 15వ తేదీ మధ్యాహ్నం రోజా ఏపీఐఐసీ ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టనున్నట్లుగా సమాచారం.

More News

ప్రముఖ రచయిత పురాణపండ మహత్తర గ్రంథానికి భారీ డిమాండ్

ఈ ప్రపంచంలో హనుమంతుడు లేని ప్రదేశం లేదు. కదిలే ప్రతి కణంలో, సాగే ప్రతిక్షణంలో, ప్రసరించే ప్ర కిరణంలో, ప్రచరించే ప్రతి ప్రాణంలో ఆంజనేయ భగవానుని లాలిత్యం వ్యక్తమవుతూనే ఉంటుంది.

పాట‌ల చిత్రీక‌ర‌ణ‌లో 'ఎర్ర‌చీర‌'

శ‌తాధిక చిత్రాల హీరో శ్రీ‌కాంత్ కీల‌క పాత్ర‌లో బేబీ ఢమరి సమర్పణలో శ్రీ సుమన్‌ వెంకటాద్రి ప్రొడక్షన్స్‌ పతాకంపై తెరకెక్కుతున్న చిత్రం `ఎర్రచీర`.

భ‌క్తిఛానెల్ ఛైర్మ‌న్‌గా థ‌ర్టీ ఇయ‌ర్స్ పృథ్వీ

థ‌ర్టీ ఇయ‌ర్స్ ఇక్క‌డ‌... అంటూ పృథ్వీ చేసే కామెడీ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క‌ర్లేదు.

'గ్యాంగ్‌లీడర్' ప్రమోషన్స్ స్టార్ట్

నేచుర‌ల్ స్టార్ నాని 24వ చిత్రం `గ్యాంగ్ లీడ‌ర్‌`. విక్ర‌మ్ కె.కుమార్ ద‌ర్శ‌కుడు. `ఆర్‌.ఎక్స్ 100` ఫేమ్ కార్తికేయ కీల‌కపాత్ర‌లో న‌టిస్తున్నాడు.

రెండో పెళ్లి చేసుకున్న డైరెక్ట‌ర్‌

కోలీవుడ్ డైరెక్ట‌ర్ ఎ.ఎల్‌.విజ‌య్ డాక్ల‌ర్ ఐశ్వ‌ర్య‌ను రెండో పెళ్లి చేసుకున్నారు. విజ‌య్ గురించి ప్ర‌త్యేక‌మైన ప‌రిచ‌యం అక్క‌ర్లేదు.