నారా లోకేష్‌పై రోజా సెటైర్ల వర్షం!!

  • IndiaGlitz, [Friday,November 01 2019]

టీడీపీ అధినేత చంద్రబాబు కుమారుడు నారా లోకేష్‌పై.. వైసీపీ ఎమ్మెల్యే, ఏపీఐఐసీ చైర్‌పర్సన్ ఆర్కే రోజా సెల్వమణి మరోసారి సెటైర్ల వర్షం కురిపించారు. ఆంధ్రప్రదేశ్‌లో ఇసుక కొరతపై నారా లోకేష్ దీక్ష చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ దీక్షపై ఇప్పటికే పలువురు వైసీపీ నేతలు, మంత్రులు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. తాజాగా తిరుపతిలో రోజా మీడియాతో మాట్లాడుతూ సెటైర్ల వర్షం కురిపించారు. ‘లోకేష్ ఇసుక సమస్య మీద దీక్ష చేసినట్టు లేదని.. లావుగా ఉన్నాడు కాబట్టి డైటింగ్ చేసినట్టు ఉంది’ అని రోజా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఏపీలో ఇసుక కొరతకు చంద్రబాబు, లోకేష్ కారణమని రోజా విమర్శలు గుప్పించారు.

కాగా.. ఏపీలో ఇసుక కొరత ఉందని.. తద్వారా పలువురు భవన కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్న విషయం విదితమే. ఆంధ్రప్రదేశ్‌లో ఇసుక కొరత కారణంగా భవన నిర్మాణరంగ కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో గుంటూరు వేదికగా నారా లోకేష్ ఒకరోజు నిరాహార దీక్ష చేసిన విషయం విదితమే. ఈ దీక్ష వేదికగా ఏపీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఇదిలా ఉంటే.. విశాఖ వేదికగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈనెల 3న లాంగ్ మార్చ్ చేపట్టిన సంగతి తెలిసిందే.

More News

అమ్మకు ‘ అందాల వరుడు’ కావాలంటూ కుమార్తె ప్రకటన.. కండిషన్స్ అప్లై!

టైటిల్ చూడగానే ఇదేంటి.. కుమార్తెకు అందమైన వరుడు కావాలి.. ఆ వ్యక్తికి ఫలానా లక్షణాలుండాలి అని ప్రకటనలు ఇచ్చే తల్లిదండ్రులు చూశాం.

పవన్‌ కల్యాణ్‌నే టార్గెట్ చేసిన ఏపీ మంత్రి!

అవును మీరు వింటున్నది నిజమే.. జనసేన అధిపతి పవన్ కల్యాణ్‌‌పై ఏపీ మంత్రి ఒకరు ప్రత్యేకంగా దృష్టిపెట్టారు.

జ‌య‌ల‌లిత బ‌యోపిక్స్ కు వ్యతిరేకంగా కేసు నమోదు

త‌మిళ‌నాడు రాజ‌కీయాల్లో మ‌ర‌చిపోలేని పేరు విప్ల‌వ నాయ‌కురాలు జ‌య‌ల‌లిత‌. ముఖ్య‌మంత్రిగా ఉన్న ఆమె అనారోగ్యంతో దివంగతురాల‌య్యారు.

ఎన్టీఆర్, చ‌ర‌ణ్ బాట‌లో బ‌న్నీ

సుకుమార్ సినిమాలంటే హీరోలు చాలా డిఫ‌రెంట్‌గా ఉంటారు. ఆయ‌న సినిమా స్టైలిష్‌గా ఉన్నా, మాసీగా ఉన్నా హీరోకు గ‌డ్డం ఉండ‌టం కామ‌న్‌గా ఉంటుంది.

'యాక్షన్‌' ట్రైలర్‌ చాలా చాలా బాగుంది.. డెఫినెట్‌గా సినిమా చాలా పెద్ద హిట్‌ అవుతుంది - పూరి జగన్నాథ్‌

మాస్‌ హీరో విశాల్‌ హీరోగా సుందర్‌ సి. దర్శకత్వంలో రూపొందుతున్న హై ఓల్టేజ్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ’యాక్షన్‌'.