close
Choose your channels

బ‌న్నీతో 'రొమాంటిక్' భామ‌

Tuesday, May 21, 2019 • తెలుగు Comments

బ‌న్నీతో రొమాంటిక్ భామ‌

అల్లు అర్జున్‌, త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్‌లో హ్యాట్రిక్ చిత్రం రూపొందుతోన్న సంగ‌తి తెలిసిందే. నాన్న నేను, పార్థు అనే టైటిల్స్ ప‌రిశీల‌లో ఉన్న‌ట్లు స‌మాచారం. పూజా హెగ్డే మెయిన్ హీరోయిన్‌గా న‌టిస్తుంది. అయితే సాధార‌ణంగా త‌న సినిమాల్లో మెయిన్ హీరోయిన్‌ను కాకుండా మ‌రో హీరోయిన్‌ను కీల‌క పాత్ర‌లో న‌టింప చేయ‌డం త్రివిక్ర‌మ్ అల‌వాటు.

ఈషారెబ్బా, అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్‌, పార్వ‌తీ మెల్ట‌న్ త‌దిత‌రులు ఇలా న‌టించిన‌వారే. కాగా ఇప్పుడు బ‌న్నీతో తాను రూపొందించే హ్యాట్రిక్ మూవీలో కూడా అలాంటి పాత్ర కోసం కేతికా శ‌ర్మ అనే హీరోయిన్‌ను తీసుకున్నాడ‌ట త్రివిక్ర‌మ్‌. ఈమె ఆకాష్ పూరి `రొమాంటిక్` చిత్రంలో హీరోయిన్‌గా న‌టిస్తుందని స‌మాచారం. మ‌రి కేతికా శర్మ‌కు ఈ అవ‌కాశం  ఏ మేర హెల్ప్ అవుతుందో చూద్దాం. 

Get Breaking News Alerts From IndiaGlitz