`సాహో` ట్రైలర్ రివ్యూ: గల్లిలో కాదు.. స్టేడియంలో కొట్టినోడే..

  • IndiaGlitz, [Saturday,August 10 2019]

‘సాహో’ ట్రైలర్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా..? అని కళ్లలో ఒత్తులేసుకొని ఎదురుచూస్తున్న ప్రభాస్ ఫ్యాన్స్ చిత్రబృందం శుభవార్త చెప్పింది. అనుకన్న సమయానికే ‘సాహో’ ట్రైలర్ అభిమానుల ముందుకు వచ్చేసింది. 2 నిమిషాల 46 సెకన్లు ఈ ట్రైలర్‌లో సినిమా ఏ రేంజ్‌లో ఉంటుందో తెలిసిపోయింది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్‌తో పాటు పలువురు పాత్రలు సినీ ప్రియుల్లో ఎంతో ఆసక్తిని పెంచేశాయి. అయితే తాజాగా సాహో ట్రైలర్ వచ్చేసింది.

ట్రైలర్‌లో ఏముంది..!

ముంబాయిలో రూ.2000 కోట్లను ఎవరో దొంగలిస్తారు.. అది దొంగతనం చేసింది ఎవరు ? హీరో ఈ దొంగతనం చేశాడా? లేక మరెవరైనా దొంగలించారా..? అనేది కనుక్కోవడానికి పోలీసు అధికారులు తలలు పట్టుకుంటూ ఉంటారు. సరిగ్గా ఇదే సమయంలో అమృతా నాయర్ (శ్రద్దా కపూర్) అనే క్రైమ్ బ్రాంచ్ ఆఫీసర్ రంగంలోకి దిగుతుంది. ముంబాయిలో దొంగతనం చేసిన వాళ్లను పట్టుకునే పనిలో బిజీబిజీగా గడుతుంటుంది. ఈ ట్రైలర్ మొత్తమ్మీద ‘గల్లీలో ఎవరైనా సిక్స్ కొడతాడు.. కానీ స్టేడియంలో కొట్టినవాడికే ఓ రేంజ్ ఉంటది’ అనే డైలాగ్ సూపర్బ్ అనిపించింది. అంతేకాదు ఒకానొక సందర్భంలో శ్రద్ధా.. ప్రభాస్‌ను తనతో ఉన్న తుపాకితో కాల్చేందుకు యత్నిస్తుంది కూడా.

ట్రైలర్ టాక్!

ట్రైలర్ అంచనాలకు ఫ్యాన్స్, సినీ ప్రియుల అంచానాలన్నీ తారుమారు చేసేలా ఉంది. ఈ సినిమాలోని సీన్స్, ఛేజింగ్ దృశ్యాలను చూస్తే.. బాలీవుడ్, హాలీవుడ్ సినిమాలు కూడా ఈ ‘సాహో’ రేంజ్‌కు సరిపోవని తెలుస్తోంది. దర్శకుడిగా సుజిత్ టేకింగ్, ఫోటోగ్రఫీ, ప్రభాస్ స్టంట్స్ ఓ రేంజ్‌లో ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఒక్క మాటలో చెప్పాలంటే.. డైరెక్టర్ సుజిత్ ఇన్ని రోజులు వేచి చూసి ‘సాహో’ సినిమా తీసినప్పటికీ మంచి ఫలితమే దక్కబోతోందని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. సుజిత్ నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా ప్రభాస్ న్యాయం చేశారు. విజువల్ ట్రీట్ మాత్రం సూపర్బ్ అనిపించాయి. ఆ ఫైట్ సీన్స్, విజువల్ ఎఫెక్ట్, కలరింగ్ మాత్రం సూపర్బ్ అనిపించాయి. మరోవైపు ప్రభాస్, శ్రద్దాల కెమిస్ట్రీ అదిరిపోయింది. అయితే అక్కడక్కడ విజువల్స్ మాత్రం ‘బిల్లా’ సినిమాను పోలి ఉండటం గమనార్హం.

ఇదిలా ఉంటే.. ఈ సినిమాను ముందుగా ఆగస్టు 15న రిలీజ్ చేయాలని చిత్రబృందం భావించినప్పటికీ.. కొన్నిఅనివార్య కారణాల వల్ల ఆగష్టు 30న విడుదల చేస్తున్నారు. మరి ఫ్యాన్స్, సినీ ప్రియులకు ప్రభాస్ సినిమాను ఏ మాత్రం ఆదరిస్తారో తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.

More News

ట్రాప్ మూవీ ట్రైలర్ చూడగానే తెలుగు ప్రేక్షకులనందర్నీ 'ట్రాప్' లో పడేస్తుంది అనిపించింది - రసమయి బాలకిషన్

ప్రేమ కవితాలయ ఫిలిమ్స్ బ్యానేర్ పై మహేందర్ ఎప్పలపల్లి, కాత్యాయనీ శర్మ హీరోహీరోయిన్లుగా వీ ఎస్ ఫణింద్ర దర్శకత్వంలో

నాగార్జున పుట్టినరోజు కోసం స్పెషల్ ప్లానింగ్

అక్కినేని నాగార్జున ఈ ఆగస్ట్ 29న తన 60వ పుట్టినరోజును జరుపుకోబోతున్నారు.

తెలుగు సినిమాకు గుర్తింపు దక్కింది: రామ్‌చరణ్

కేంద్రప్రభుత్వం ప్రకటించిన 66వ జాతీయ అవార్డుల్లో తెలుగు సినిమాలు ఏడు అవార్డులను సొంతం చేసుకోవడం టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయ్యింది.

కార్మికుల కోసం మనం సైతం ఉచిత వైద్య శిబిరం

తమ చుట్టూ ఉన్నవారంతా తమ వాళ్ళే అనుకుంటూ సేవా కార్యక్రమాలు చేస్తోంది కాదంబరి కిరణ్ ఆధ్వర్యంలోని

షూటింగ్ పూర్తి చేసుకున్న గోపీచంద్ `చాణక్య`

టాలీవుడ్ యాక్షన్ హీరో గోపీచంద్ టైటిల్ పాత్రలో నటిస్తోన్న స్పై థ్రిల్లర్ `చాణక్య`. ఎ.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై రామబ్రహ్మం సుంకర నిర్మాతగా తిరు దర్శకత్వంలో