close
Choose your channels

మా అమ్మ-నాన్న విడిపోవడానికి కారణమిదే: మెగా హీరో

Wednesday, April 24, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

మా అమ్మ-నాన్న విడిపోవడానికి కారణమిదే: మెగా హీరో

మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడు, 'చిత్రలహరి' మూవీ హీరో సాయిధరమ్‌లో ఓ యూట్యూట్ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు మెగాభిమానులు, సినీ ప్రియులతో షేర్ చేసుకున్నాడు. ఇంటర్వ్యూలో తన ఫ్యామిలీ, తన పర్సనల్ లైఫ్‌కు సంబంధించిన విషయాలనూ తేజ్ పంచుకున్నాడు.

2011లో అమ్మకు మరో పెళ్లి చేశాం..!

"నా తల్లిదండ్రులు పదిహేనేళ్ల క్రితమే విడిపోయారు. అప్పుడు నేను 10వ తరగతి చదువుతున్నాను. మేం మా అమ్మ వద్దే ఉండిపోయాం. మా నాన్నతో నేను ఇప్పటికీ మాట్లాడుతుంటాను. కానీ.. అప్పుడున్నంత ఫీల్ ఇప్పుడుందని చెప్పలేను. ఆయనకు సినిమా రంగం గురించి పెద్దగా అవగాహనలేదు. తల్లయినా, తండ్రయినా మాకు ఆమే. మా కోసం తన జీవితాన్ని వృథా చేసుకోకుండా ఆమెకూ ఓ తోడు ఉంటే బాగుంటుందని అందరం కలిసి ఆలోచించాం. దీంతో 2011లో అమ్మ మరో పెళ్లి చేసుకున్నారు.

మా పెళ్లిళ్లు అయిపోతే ఆమె ఒంటరితనం ఫీల్ కాకూడదన్నదే ఇలా ఆలోచించాం. మా సవతి తండ్రితో మా సంబంధాలు బాగానే ఉన్నాయి. ఆయన కేర్ హాస్పిటల్లో కంటి డాక్టర్‌గా పనిచేస్తున్నారు. ఆయన చాలా మంచి వ్యక్తి. మాకు ఎక్కడా ఇబ్బంది కలిగించేలా ఆయన వ్యవహరించరు... ఇప్పుడు అంతా బాగుంది" అని సాయిధరమ్ తేజ్ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. కాగా ఈ విషయం తెలుసుకున్న మెగాభిమానులు సోషల్ మీడియా వేదికగా తేజ్‌కు సపోర్ట్‌గా నిలుస్తున్నట్లు కామెంట్స్ చేస్తున్నారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.