డ్రంక్ అండ్ డ్రైవ్ చేసే వాళ్లు టెర్రరిస్ట్‌లతో సమానం: సీపీ సజ్జనార్

  • IndiaGlitz, [Wednesday,December 30 2020]

సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ మద్యం సేవించి డ్రైవింగ్ చేసే వారి విషయమై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇకపై సైబరాబాద్ పరిధిలో మద్యం సేవించి వాహనం నడిపారో అంతే సంగతులు.. ఐపీసీ 304 కింద కేసులు నమోదు చేసి.. పది సంవత్సరాల పాటు జైలు శిక్ష పడేలా చూస్తామని సజ్జనార్ మందుబాబులకు వార్నింగ్ ఇచ్చారు. డ్రంక్ అండ్ డ్రైవ్ చేసే వాళ్లు టెర్రరిస్ట్‌లతో సమానమంటూ సీపీ సజ్జనార్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

నిన్న ఒక్క రోజే 402 మంది తాగి వాహనం నడిపిన వారిపై కేసులు నమోదు చేసినట్టు తెలిపారు. కరోనా సమయంలో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలను నిలిపివేసిన పోలీసులు.. ఇటీవలే తిరిగి ప్రారంభించారు. ప్రస్తుతం ఇయర్ ఎండింగ్‌ కాబట్టి మందుబాబులు మద్యం సేవించి విచ్చలవిడిగా రోడ్లపై తిరిగే అవకాశం ఉండటంతో వారి పని పట్టేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే న్యూఇయర్ సెలబ్రేషన్స్‌పై సైబరాబాద్ సీపీ నిషేధం విధించిన సంగతి తెలిసిందే.

ఇయర్ ఎండింగ్‌తో పాటు న్యూ ఇయర్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలూ జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. ఈ వారం పాటు సైబరాబాద్ పరిధిలో ప్రత్యేక డ్రంక్ అండ్ డ్రైవ్ టీమ్స్ పని చేస్తూనే ఉంటాయన్నారు. అంతేకాదు.. డ్రంక్ అండ్ డ్రైవ్ కోసం ఈ వారం రోజులూ.. ట్రాఫిక్, లా అండ్ ఆర్డర్, ఏఆర్‌తో పాటు ఎస్‌వోటీ పోలీసులను కూడా వినియోగిస్తామన్నారు. తాగి రోడ్లపైకి వచ్చి డ్రైవ్ చేస్తూ పట్టుబడితే ఎవ్వరినీ వదిలేది లేదని సీపీ సజ్జనార్ హెచ్చరించారు.

More News

‘వ‌కీల్ సాబ్’‌... ప‌వ‌న్ పూర్తి చేశాడు

వ‌కీల్‌సాబ్‌..ఇటు ప‌వ‌న్‌క‌ల్యాణ్‌కు, అటు ద‌ర్శ‌క నిర్మాత‌ల‌కు ఓపెద్ద టెన్ష‌న్ తీరింది. ‘వ‌కీల్ సాబ్’ సినిమా కోసం ప‌వ‌న్ చాలా త‌క్కువ రోజులే కాల్షీట్స్ ఇచ్చాడు.

ఎల్ఆర్ఎస్‌పై తెలంగాణ ప్రభుత్వం కీలక ఆదేశాలు..

తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన ఎల్ఆర్ఎస్‌పై (వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లు) ప్రజానీకం నుంచి వ్యతిరేకత వస్తోంది.

న్యూ ఇయర్ ముందు ఉద్యోగులపై కేసీఆర్ వరాల జల్లు

నూతన సంవత్సర కానుకగా రాష్ట్రంలోని అన్నిరకాల ప్రభుత్వ ఉద్యోగులకు వేతనాలు పెంచాలని, ఉద్యోగ విరమణ వయస్సును పెంచాలని, అన్నిశాఖల్లో

'తెర వెనుక' దర్శకుడు వెల్లుట్ల ప్రవీణ్ చందర్ ఇంటర్వ్యూ..

1996 లో వచ్చిన ఆలీ ,ఇంద్రజ ల పిట్టలదొర సినిమా ద్వారా నృత్య దర్శకునిగా పరిచయమై.

మరో మెగా హీరోకు కరోనా...

తాను కరోనా బారిన పడ్డానంటూ మంగళవారం ఉదయం మెగా పవర్ స్టార్హీ రామ్ చరణ్ ప్రకటించిన విషయం తెలిసిందే.