డ్రంక్ అండ్ డ్రైవ్ చేసే వాళ్లు టెర్రరిస్ట్‌లతో సమానం: సీపీ సజ్జనార్
Send us your feedback to audioarticles@vaarta.com
సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ మద్యం సేవించి డ్రైవింగ్ చేసే వారి విషయమై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇకపై సైబరాబాద్ పరిధిలో మద్యం సేవించి వాహనం నడిపారో అంతే సంగతులు.. ఐపీసీ 304 కింద కేసులు నమోదు చేసి.. పది సంవత్సరాల పాటు జైలు శిక్ష పడేలా చూస్తామని సజ్జనార్ మందుబాబులకు వార్నింగ్ ఇచ్చారు. డ్రంక్ అండ్ డ్రైవ్ చేసే వాళ్లు టెర్రరిస్ట్‌లతో సమానమంటూ సీపీ సజ్జనార్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
నిన్న ఒక్క రోజే 402 మంది తాగి వాహనం నడిపిన వారిపై కేసులు నమోదు చేసినట్టు తెలిపారు. కరోనా సమయంలో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలను నిలిపివేసిన పోలీసులు.. ఇటీవలే తిరిగి ప్రారంభించారు. ప్రస్తుతం ఇయర్ ఎండింగ్ కాబట్టి మందుబాబులు మద్యం సేవించి విచ్చలవిడిగా రోడ్లపై తిరిగే అవకాశం ఉండటంతో వారి పని పట్టేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే న్యూఇయర్ సెలబ్రేషన్స్‌పై సైబరాబాద్ సీపీ నిషేధం విధించిన సంగతి తెలిసిందే.
ఇయర్ ఎండింగ్‌తో పాటు న్యూ ఇయర్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలూ జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. ఈ వారం పాటు సైబరాబాద్ పరిధిలో ప్రత్యేక డ్రంక్ అండ్ డ్రైవ్ టీమ్స్ పని చేస్తూనే ఉంటాయన్నారు. అంతేకాదు.. డ్రంక్ అండ్ డ్రైవ్ కోసం ఈ వారం రోజులూ.. ట్రాఫిక్, లా అండ్ ఆర్డర్, ఏఆర్‌తో పాటు ఎస్‌వోటీ పోలీసులను కూడా వినియోగిస్తామన్నారు. తాగి రోడ్లపైకి వచ్చి డ్రైవ్ చేస్తూ పట్టుబడితే ఎవ్వరినీ వదిలేది లేదని సీపీ సజ్జనార్ హెచ్చరించారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments