అల్లు అర్జున్‌పై ప్రశంసల జల్లు కురిపించిన సల్మాన్

స్టార్ హీరో సల్మాన్‌ఖాన్‌ కథానాయకుడిగా తెరకెక్కుతున్న చిత్రం ‘రాధే: యువర్‌ మోస్ట్‌ వాంటెడ్‌ భాయ్‌’. ప్రభుదేవా దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. దిశా పటానీ హీరోయిన్‌గా నటించింది. ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ గురువారం విడుదలైంది. మాదక ద్రవ్యాల నేపథ్యంలో ముంబై నగరంలో పెరిగిపోయిన క్రైమ్ రేటును తగ్గించేందుకు ఒక స్పెషల్ ఆఫీసర్‌ ఏం చేశాడనే కథాంశంతో ఈ సినిమా రూపొందింది. ఇటీవలే సినిమా ట్రైలర్ విడుదలై ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి.

అయితే ఈ సినిమాలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘దువ్వాడ జగన్నాథం’ చిత్రంలోని సీటీమార్‌ పాటను ఇందులో రీమేక్‌ చేశారు. మామూలుగానే బన్నీ డ్యాన్స్ ఇరగదీస్తాడు. ఇక ఈ మాస్ సాంగ్‌కు స్టెప్స్ అదరగొట్టేశాడేశాడు. దీంతో ఈ పాట తెలుగులో ఎంత సక్సెస్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పటికీ ఈ సాంగ్‌కు యూత్ స్టెప్పులేస్తూనే ఉంటుంది. ఇప్పుడు ఈ హిందీ ప్రేక్షకులను సైతం అలరించేందుకు సిద్ధమవుతోంది. ఈ రీమేక్‌ గీతంలో దిశా పటానీ, సల్మాన్‌ వేసిన స్టెప్పులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. గ్లామర్‌ బ్యూటీ, సల్మాన్‌ స్నేహితురాలు జాక్వలైన్‌ ఫెర్నాండెజ్‌ కూడా ఈ పాటలో సందడి చేసింది.

అయితే ‘సీటీ మార్’ ఒరిజినల్ సాంగ్‌ను చూసిన సల్మాన్ అల్లు అర్జున్ స్టెప్పులకు ఫిదా అయిపోయారు. ట్విటర్ వేదికగా బన్నీని ప్రశంసలతో ముంచెత్తారు. ఈ పాటలో బన్నీ చేసిన డ్యాన్స్ అదిరిపోయిందని సల్మాన్ ట్విటర్ ద్వారా ప్రశంసల జల్లు కురిపించారు. ‘‘థాంక్యూ అల్లు అర్జున్.. సీటీమార్’ పాటలో నువ్వు చేసిన పెర్ఫార్మెన్స్ అదిరిపోయింది. నువ్వు డ్యాన్స్ చేసిన విధానం.. నీ స్టైల్, మొత్తంగా సింప్లీ ఫెంటాస్టిక్.. టేక్ కేర్, సేఫ్‌గా ఉండు. లవ్‌ యూ బ్రదర్‌’’ అని సల్మాన్‌ ట్వీట్‌ చేశారు. ‘రాధే’ చిత్రం మే 13న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

More News

భారత్‌కు రూ.135 కోట్ల విరాళాన్ని ప్రకటించిన గూగుల్

కరోనా మహమ్మారి దేశంలో ఊహించని విధంగా విస్తరిస్తోంది. సెకండ్ వేవ్ విస్తరణ వేగం అధికంగా ఉండటంతో రోజుకు లక్షల్లో జనాభా కరోనా బారిన పడుతున్నారు.

కోవిడ్ ఆసుపత్రిలో ప్రమాదం.. 82 మంది మృతి

కోవిడ్ ఆసుపత్రుల్లో ప్రమాదాలు మన దేశంలోనే కాదు.. ఇతర దేశాల్లోనూ జరుగుతూనే ఉన్నాయి. ఒకవైపు జనాలు కోవిడ్ కారణంగా మరణిస్తూ ఉంటే.. మరోవైపు ఆసుపత్రుల నిర్లక్ష్యం కారణంగా పలువురు ప్రాణాలు కోల్పోతున్నారు.

అట్టహాసంగా ప్రారంభమైన ఆస్కార్ సందడి

ప్రపంచ సినీ రంగంలో ఎంతో గొప్పగా భావించే ఆస్కార్‌ 93వ అవార్డుల ప్రదానోత్సవం అట్టహాసంగా ప్రారంభమైంది. కోవిడ్ మహమ్మారి కారణంగా ఈ కార్యక్రమం వాయిదా పడుతూ వచ్చింది.

పూజా హెగ్డేకు కరోనా పాజిటివ్

దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. కేసుల సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోంది. సెకండ్ వేవ్ మరింత వేగంగా విస్తరిస్తూ ఆందోళనకు గురి చేస్తోంది. ప్రస్తుతం రాజకీయ, సినీ ప్రముఖులకు

కరోనా ఎఫెక్ట్.. మహిళా కానిస్టేబుల్‌కు స్టేషన్‌లోనే మంగళ స్నానం..

కరోనా మహమ్మారి కారణంగా ఫ్రంట్ లైన్ వారియర్స్‌కి సెలవులు కూడా దొరకడం లేదు. పెళ్లైనా.. పేరంటమైనా కూడా ఏదో ఒకటి అర సెలవులతో సరిపెట్టుకోవాల్సిందే. ప్రస్తుతం అన్ని