స‌మంత రియాలిటీ షో!!

  • IndiaGlitz, [Monday,February 24 2020]

అక్కినేని కోడ‌లుగా మారిన త‌ర్వాత స‌మంత రేంజ్ మ‌రో లెవ‌ల్‌లోకి వెళ్లింది. గ్లామ‌ర్ పాత్ర‌లు కంటే పెర్ఫామెన్స్‌కి స్కోప్ ఉన్న పాత్ర‌లే వ‌స్తున్నాయి. అలాగే ఆమె సినిమాల‌ను ఎంచుకుంటుంది. మ‌రో ప‌క్క లేడీ ఓరియెంటెడ్ సినిమాల‌కు కేరాఫ్ అడ్ర‌స్‌గా కూడా నిలుస్తుంది. సినిమాల‌తోనే కాకుండా డిజిట‌ల్ రంగంలోనూ ఆమె అడుగు పెట్టారు. 'ద ఫ్యామిలీ మేన్' వెబ్ సిరీస్ సీజ‌న్‌2లో ఓ నెగ‌టివ్ పాత్ర‌లో న‌టిస్తున్నాన‌ని రీసెంట్‌గా ఓ ఇంట‌ర్వ్యూలోనూ చెప్పారామె. ఇలా డిఫ‌రెంట్‌గా ఆలోచిస్తూ కెరీర్‌ను మ‌రింత ప‌క‌డ్బందీగా ప్లాన్ చేస్తున్న స‌మంత అక్కినేని తాజాగా మ‌రో నిర్ణ‌యం తీసుకున్నార‌ట‌.

స‌మాచారం మేర‌కు స‌మంత ఓ రియాటిలీ షోలో వ్యాఖ్యాత‌గా చేయ‌బోతున్నార‌ట‌. తెలుగు ఓటీటీ సంస్థ అహా.. స‌మంత‌ను ఓ రియాలిటీ షో వ్యాఖ్యాత‌గా వ్య‌వ‌హ‌రించ‌మ‌ని సంప్ర‌దింపులు జ‌రుపుతుంద‌ట‌. త్వ‌ర‌లోనే స‌మంత దీనిపై ఏదో ఒక నిర్ణ‌యం తీసుకోనుంద‌ని తెలుస్తుంది. అయితే ఇక్క‌డ ప్ర‌స్తావించాల్సిన విష‌య‌మేమంటే అక్కినేని వారింటి అక్కినేని నాగార్జున .. మీలో ఎవ‌రు కోటీశ్వ‌రుడు, బిగ్‌బాస్ వంటి షోల‌కు వ్యాఖ్యాత‌గా వ్య‌వ‌హ‌రించాడు. ఆ త‌ర్వాత స‌మంత మాత్ర‌మే ఆ క్రెడిట్‌ను సొంతం చేసుకున్న‌ట్లు అవుతుంది. మ‌రి అక్కినేని వారి కోడ‌లు రియాలిటీ షో చేయ‌డానికి గ్రీన్ సిగ్న‌ల్ ఇస్తుందంటారా!.

More News

డిఫరెంట్ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌ '22' డెఫినెట్ గా మంచి హిట్ అవుతుంది.-- మ్యూజిక్ డైరెక్ట‌ర్ సాయికార్తీక్

`పటాస్`,`సుప్రీమ్`,`ఈడో రకం..ఆడో రకం`,`రాజుగారి గది` వంటి సూప‌ర్ హిట్ చిత్రాల‌కు స్వర సారధ్యం వహించి సినీ ప‌రిశ్ర‌మ‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు

ఛాలెంజింగ్ పాత్రలు అంటే నాకు ఇష్టం.. రాహు హీరో అభిరామ్ వర్మ

గ్రిప్పింగ్   థ్రిల్లర్ గా విడుదలకు ముందే ఇండస్ట్రీలో మంచి టాక్ ను సొంతం చేసుకున్న రాహుల్ ఈ నెల 28న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

వేయి స్థంబాల గుడిలో కామాంధ పూజారి!

ఆడవారికి ఇంటా బయట రక్షణ లేదని.. కామాంధుల కాటుకు బలైపోతున్నారని మనం నిత్యం వార్తల్లో చూస్తుంటాం.

కలెక్షన్లలో దూసుకెళ్తున్న‘భీష్మ’...!

టాలీవుడ్ కుర్ర హీరో నితిన్, రష్మిక మందన్నా నటీనటులుగా వెంకీ కుడుముల తెరకెక్కించిన చిత్రం ‘భీష్మ’ ఇటీవలే రిలీజ్ అయ్యింది.

'మీనా బజార్'., చిత్రం మార్చి లో విడుదల !!!

ఇటీవల సినీ రాజకీయల సమక్షంలో www. మీనా బజార్., ఆడియో లాంచ్ కార్యక్రమం ఫిబ్రవరి 6న హైదరాబాద్ లో జరిగింది.