మ‌హేష్ సినిమాలోనూ అలాగే..

  • IndiaGlitz, [Saturday,June 09 2018]

ద‌ర్శ‌కుడిగా త‌న తొలి ప్ర‌య‌త్నం 'మున్నా' నిరాశ‌ప‌రిచినా.. బృందావ‌నం, ఎవ‌డు, ఊపిరి చిత్రాల‌తో హ్యాట్రిక్ విజ‌యాల‌ను అందుకున్నారు వంశీ పైడిప‌ల్లి. ఊపిరి విడుద‌లైన రెండేళ్ళ విరామం త‌రువాత త‌న త‌దుప‌రి చిత్రం ప‌ట్టాలెక్కుతోంది. సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు క‌థానాయ‌కుడిగా న‌టిస్తున్న ఈ సినిమాని.. వంశీ పైడిప‌ల్లి తొలి మూడు చిత్రాల‌ను తెర‌కెక్కించిన దిల్ రాజు నిర్మిస్తున్నారు. మ‌రో నిర్మాత‌గా సి.అశ్వ‌నీద‌త్ వ్య‌వ‌హ‌రిస్తున్నారు. పూజా హెగ్డే క‌థానాయిక‌గా న‌టిస్తున్న ఈ సినిమాలో అల్ల‌రి న‌రేష్ ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు. త‌న గ‌త చిత్రాల్లో క‌లిసొచ్చిన ఓ అంశాన్ని త‌న తాజా చిత్రంలోనూ రిపీట్ చేస్తున్నారు వంశీ.

ఇంత‌కీ అదేమిటంటే.. ఫ్రెండ్ షిప్‌. బృందావ‌నంలో త‌న ఫ్రెండ్ కాజ‌ల్ కోసం త‌న ల‌వ‌ర్ ఎన్టీఆర్‌ను వ‌దులుకోవ‌డానికి కూడా సిద్ధ‌మ‌య్యే ఫ్రెండ్ పాత్ర‌లో స‌మంత న‌టించిన సంగ‌తి తెలిసిందే. ఇక ఊపిరి చిత్రం ప్ర‌ధానంగా స్నేహం చుట్టూ తిరుగుతుంది. ప్ర‌స్తుతం.. మ‌హేష్‌తో చేస్తున్న చిత్రంలోనూ ఫ్రెండ్ షిప్ ఓ కీల‌క‌మైన అంశం కానుంది. మ‌హేష్‌, అల్ల‌రి న‌రేష్ మ‌ధ్య సాగే స‌న్నివేశాలే ఈ సినిమాకి బ‌లం అని తెలుస్తోంది. ఇప్ప‌టికే స్నేహం అనే అంశాన్ని త‌న చిత్రాల్లో జోడించి హిట్స్ కొట్టిన వంశీ.. తాజా చిత్రంతోనూ దాన్ని కొన‌సాగిస్తారేమో చూడాలి.

More News

మ‌ళ్ళీ బిజీ అవుతున్న నివేదా

రెండేళ్ళ క్రితం విడుద‌లైన జెంటిల్ మ‌న్ చిత్రంతో తెలుగు తెర‌కు క‌థానాయిక‌గా ప‌రిచ‌య‌మైంది నివేదా థామ‌స్‌. ఆ త‌రువాత నిన్ను కోరి, జై ల‌వ కుశ చిత్రాలు చేసింది.

రానా బ‌య‌ట‌కు వ‌చ్చేశారు

ప్ర‌స్తుతం ఇండియన్ స్క్రీన్‌పై బ‌యోపిక్‌ల ట్రెండ్ నడుస్తున్న సంగ‌తి తెలిసిందే.

శంభో శంకర టీజర్ ను లాంచ్ చేసిన డైరెక్టర్ హరీష్ శంకర్

శంక‌ర్ ని హీరోగా,  శ్రీధ‌ర్ ఎన్. ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం చేస్తూ ఆర్. ఆర్. పిక్చ‌ర్స్ సంస్థ, ఎస్.కె. పిక్చ‌ర్స్ స‌మ‌ర్ప‌ణ‌లో వై. ర‌మ‌ణారెడ్డి, సురేష్ కొండేటి సంయుక్తంగా నిర్మిస్తోన్న 'శంభో శంక‌ర'.

'విశ్వ‌రూపం 2' ట్రైల‌ర్ డేట్ ఫిక్స్‌

లోకనాయకుడు కమల్ హాసన్ స్వీయ దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'విశ్వరూపం 2'.

అల్లరి నరేష్, సునీల్ 'సిల్లీ ఫెల్లోస్' టైటిల్ లాంచ్

బ్లూ ప్లానెట్ ఎంటర్టైన్మెంట్స్ ఎల్ ఎల్ పి అండ్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సమర్పణలో ప్రొడక్షన్ 3 గా వస్తున్న చిత్రం "సిల్లీ ఫెల్లోస్".