ప్రభాస్ 'స్పిరిట్' కథ చెప్పేసిన సందీప్ రెడ్డి.. మామాలుగా లేదుగా..

  • IndiaGlitz, [Monday,April 08 2024]

'అర్జున్ రెడ్డి', 'యానిమల్' సినిమాలతో దేశవ్యాప్తంగా దర్శకుడు సందీప్ రెడ్డి విపరీతమైన క్రేజ్ తెచ్చుకున్నాడు. తన సినిమాల్లో చూపించే హీరో యాటిట్యూడ్‌కి ఓ వర్గం అభిమానులు ఫిదా అయిపోతున్నారు. అయితే కొంతమంది మాత్రం విమర్శలకు దిగుతుంటారు. కానీ ఆ విమర్శలను పట్టించుకోకుండా తనదైన శైలిలో వెళ్తూ ఉంటాడు. యానిమల్ సినిమా బ్లాక్‌బస్టర్ తర్వాత తన తర్వాతి చిత్రం కోసం అందరూ ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే రెబల్ స్టార్ ప్రభాస్‌తో తన తదుపరి సినిమా ఉంటుందని చెప్పి డార్లింగ్‌ ఫ్యాన్స్‌లో జోష్‌ నింపాడు.

దీంతో ప్రభాస్ అభిమానులంతా ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న 'స్పిరిట్' సినిమాలో ప్రభాస్ మొదటిసారి పోలీస్ ఆఫీసర్ పాత్రని పోషిస్తున్నాడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ జరుపుకుంటున్న ఈ మూవీ గురించి ఆసక్తికర విషయాలను సందీప్ రీసెంట్ ఇంటర్వ్యూలో పంచుకున్నాడు. ఏకంగా ఈ మూవీ స్టోరీ గురించి మాట్లాడుతూ.. ప్రభాస్ ఒక నిజాయితీ గల పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపిస్తారు. అలాంటి ఆఫీసర్ జీవితంలో తనకి బాగా దగ్గరైన వ్యక్తి విషయంలో ఒక తప్పు జరుగుతుంది. ఆ తరువాత ఆ పోలీస్ ఆఫీసర్ ఎలా రియాక్ట్ అయ్యాడు అనేది మూవీ కథ అని తెలిపాడు.

ఇప్పటికే సినిమా స్క్రిప్ట్ 60 శాతం పూర్తి అయ్యిందని.. డిసెంబర్ నాటికీ స్క్రిప్ట్ మొత్తం పూర్తి చేసి.. షూటింగ్‌కి వెళ్తామని పేర్కొన్నాడు. ఈ మూవీని రూ.300 కోట్ల భారీ బడ్జెట్‌తో తీస్తున్నట్లు వెల్లడించాడు. ట్రైలర్, టీజర్ ఆడియన్స్‌కి రీచ్ అయితే.. ప్రభాస్ ఇమేజ్‌కి తొలి రోజే రూ.150 కోట్లు వచ్చేస్తాయని ధీమా వ్యక్తం చేశాడు. అంతేకాకుండా యానిమ‌ల్ సినిమా కంటే ముందు ప్రభాస్ ఒక హాలీవుడ్ సినిమాని రీమేక్ చేద్దామని నన్ను సంప్రదించాడు. అప్పుడు ఈ ఆలోచ‌న మీకు బాగా పని చేస్తుందని నేను సూచించాను. కానీ అనుకోని కారణాల వ‌ల్ల ఈ సినిమా ప‌ట్టాలెక్కలేదు. ఆ త‌ర్వాత ‘స్పిరిట్‌’ క‌థ‌తో ప్రభాస్ ముందుకి వెళ్లాను. ఆ క‌థ ప్రభాస్‌కు బాగా న‌చ్చింది. ఈ సినిమా పూర్తి కాగానే ర‌ణ్‌బీర్ క‌పూర్‌తో ‘యానిమ‌ల్ పార్క్' చేస్తా అని చెప్పుకొచ్చాడు.

ఇదిలా ఉంటే ప్రభాస్ సినిమాల విషయానికొస్తే నాగ్ అశ్విన్ దర్శకత్వంలో నటిస్తున్న 'కల్కి' సినిమా మే 30వ తేదీని మూవీని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. ఉగాది పండుగ నుంచి ప్రమోషన్స్ చేయనున్నట్లు సమాచారం. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల మహాశివరాత్రి సందర్భంగా ప్రభాస్ క్యారెక్టర్ పేరును రివీల్ చేస్తూ రిలీజ్ చేసిన పోస్టర్ ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. ఈ మూవీలో ప్రభాస్ పాత్ర పేరు 'భైరవ' అని చెబుతూ పొడవాటి జట్టు, పిలకతో స్టైలిష్‌గా ఉన్నాడు. కాగా ఈ మూవీతో పాటు మారుతి దర్శకత్వంలో 'రాజాసాబ్' చిత్రంలోనూ నటిస్తున్నాడు.

More News

Pothina Mahesh: పవన్ కల్యాణ్ అమ్ముడుపోయారు.. పోతిన మహేష్ సంచలన వ్యాఖ్యలు..

జనసేన పార్టీకి రాజీనామా చేసిన పోతిన మహేష్ పవన్ కల్యాణ్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్ కల్యాణ్ టీడీపీకి అమ్ముడుపోయారని..

Prashanth Kishor: ప్రశాంత్ కిషోర్ మాటలకు విలువేదీ..? గతంలోనూ తప్పిన అంచనాలు..

ఐప్యాక్ సంస్థ వ్యవస్థాపకుడిగా ప్రశాంత్ కిషోర్ గతంలో కొన్ని పార్టీల తరపున పనిచేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆ సంస్థ నుంచి బయటకు వచ్చి బీహార్‌ రాజకీయాల్లో అడుగుపెట్టారు

Pothina Mahesh: జనసేన పార్టీకి భారీ షాక్.. కీలక నేత పోతిన మహేష్ రాజీనామా..

ఎన్నికల సమయంలో జనసేన పార్టీకి భారీ షాక్ తగిలింది. విజయవాడలో పార్టీ కీలక నేతగా ఉన్న పోతిన మహేష్ రాజీనామా చేశారు.

Kavitha: కవితకు భారీ షాక్.. మధ్యంతర బెయిల్ పిటిషన్ కొట్టివేత..

ఢిల్లీ లిక్కర్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు భారీ షాక్ తగిలింది. ఆమెకు మధ్యంతర బెయిల్ ఇచ్చేందుకు రౌస్ అవెన్యూ కోర్టు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది.

అమ్మవారిగా బన్నీ విశ్వరూపం.. 'పుష్ప' గాడి మాస్ జాతర మొదలైంది..

'పుష్ప' సినిమాతో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ దేశవ్యాప్తంగా క్రేజ్ సంపాదించుకున్న సంగతి తెలిసిందే. అంతేకాకుండా ఈ సినిమాలోని నటనకు గాను జాతీయ ఉత్తమ నటుడి అవార్డు కూడా అందుకున్నాడు.