దిల్ రాజుకు తలనొప్పిగా మారిన సంక్రాంతి రిలీజులు

  • IndiaGlitz, [Monday,December 30 2019]

ప్ర‌స్తుతం తెలుగు చలన చిత్ర పరిశ్రమలో స్టార్ నిర్మాత‌ల్లో దిల్‌రాజు ఒక‌రు. పెద్ద హీరోలు, చిన్న హీరోలనే తేడా లేకుండా బ్యాక్ టూ బ్యాక్ ఫిల్మ్స్ ప్రొడ్యూస్ చేయడం ఆయ‌న‌ అలవాటు. దీనితో పాటు ఇండస్ట్రీలో బెస్ట్ జడ్జిమెంట్ ఉన్న నిర్మాతగా దిల్ రాజుకి పేరుంది. అందుకే సినిమా విడుదలకి ముందే వాటి రిజల్ట్ ని కరెక్ట్ గా జడ్జ్ చేయడం ఈ నిర్మాతకి సినిమాతో పెట్టిన విద్య. ఇప్పుడు ఈయ‌న ఒక స‌మ‌స్య‌తో ఇబ్బంది ప‌డుతున్నాడ‌ట‌. ఆయ‌న స‌మ‌స్య‌కు కారణం ఇద్ద‌రు స్టార్ హీరోలు.

సంక్రాంతి పోరులో నిలవబోతున్న ఈ ఇద్దరు స్టార్ హీరోల సినిమాలు రాజుకి కొత్త చిక్కులు తెచ్చి పెట్టాయి. సూపర్ స్టార్ మహేశ్ మూవీ 'సరిలేరు నీకెవ్వరు' జనవరి 11న విడుదల కానుంది. ఇక స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మూవీ 'అల వైకుంఠపురములో' జనవరి 12 న ప్రేక్షకుల ముందుకి రానుంది. ఇప్పుడు ఈ రెండు సినిమాలకి థియేటర్స్ సర్దుబాటు చేయలేక సతమతవుతున్నాడట ఈ బిజీ ప్రొడ్యూసర్. ఈ రెండు చిత్రాల్లో సరిలేరు సినిమాకు దిల్‌రాజు నిర్మాత అయితే.. బ‌న్నీ సినిమా అల వైకుంఠ‌పుర‌ములో సినిమా నైజాం డిస్ట్రిబ్యూట‌ర్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నాడు. ఈ రెండు సినిమాలకు ప్రిఫరబుల్ థియేటర్స్ సెట్ చేయడం దిల్ రాజుకు తలనొప్పిగా మారిందట. ఇప్పటికే రెండు సినిమాల చిత్ర యూనిట్స్ తమకు కావాల్సిన థియేటర్స్ లిస్ట్ ఇవ్వడంతో ఎవరిని ఒప్పించాలో, ఎవరిని నొప్పించాలో తెలియక ఇబ్బంది పడిపోతున్నాడట దిల్ రాజు. మ‌రి ఈ అగ్ర నిర్మాత త‌న స‌మ‌స్య‌ను ఎలా అధిగ‌మిస్తారో వేచి చూడాల్సిందే..

More News

నేవీ కీలక నిర్ణయం.. సోషల్ మీడియా, స్మార్ట్ ఫోన్లు నిషేధం

భారత రక్షణ దళాలను లక్ష్యంగా చేసుకొని గత కొన్ని రోజులుగా పాకిస్తాన్, చైనాతో పాటు పలుదేశాలు హనీట్రాప్‌కు పాల్పడుతున్న సంగతి తెలిసిందే.

సినిమాల్లో నటిస్తారా అని కేటీఆర్‌ను అడగ్గా..!

తెలంగాణ మంత్రి కేటీఆర్ సోషల్ మీడియాలో యమా యాక్టివ్‌గా ఉంటారన్న విషయం తెలిసిందే. అప్పుడప్పడు కేటీఆర్‌ ప్రత్యేకంగా ఫ్యాన్స్,

2020లో బ్లాక్ బాస్టర్ అల్బమ్ తో వస్తున్న 'అల వైకుంఠపురంలో..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, మాటల మాంత్రికుడు, సుప్రసిద్ధ సినీ దర్శకుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో

'అమ్మాయంటే అలుసా' చిత్రాన్ని దిశ కు అంకిత మిస్తున్నాను.... హీరో, నిర్మాత,దర్శకుడు నేనే శేఖర్

నవులూరి భాస్కర్ రెడ్డి సమర్పణలో   గీతాశ్రీ అర్ట్స్ పతాకంపై నేనే శేఖర్, కార్తీక్ రెడ్డి,స్వాతి,శ్వేత,

సింహా సింగపూర్ తీసుకెళతాడనే నమ్మకం వుంది: సంగీత దర్శకులు ఎమ్.ఎమ్.కీరవాణి

అది 2000వ సంవత్సరం కెరీర్, డబ్బుల పరంగా నాకు బ్యాడ్‌టైమ్ నడుస్తోంది. ఉమ్మడి  కుటుంబసభ్యుల బాధ్యతలు నాపై ఉండటంతో ఆర్థికంగా ఇబ్బందులు పడ్డాను. ఆ సమయంలో శ్రీసింహాకు నాలుగేళ్లు ఉంటాయి.