సంక్రాంతికి అలా.. వేసవికి ఇలా...

  • IndiaGlitz, [Saturday,April 02 2016]

ఇద్ద‌రు అగ్ర క‌థానాయ‌కుల సినిమాలు వారాల గ్యాప్‌లోనో లేదంటే ఒకే రోజునే రిలీజైతే ఆ సంద‌డే వేరు. అదీ ఒకే కుటుంబానికి చెందిన హీరోల సినిమాలైతే.. ఎవ‌రి దృష్టి అయినా ఆ సినిమాల మీదే ఉంటుంది. ఈ ఏడాదిలో సంక్రాంతికి అలాంటి వాతావ‌ర‌ణం క‌నిపించింది. నంద‌మూరి కుటుంబానికి చెందిన బాల‌కృష్ణ‌, ఎన్టీఆర్ సినిమాలు ఒక రోజు గ్యాప్‌లో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చాయి. ఇప్పుడు మ‌ళ్లీ వేస‌వి సీజ‌న్ అలాంటి సంద‌డి తీసుకురానుంది.

ఈ సారి మెగా హీరోల మ‌ధ్య ఆ వాతావ‌ర‌ణం క‌నిపించ‌నుంది. మ‌రీ ఒక రోజు విరామంతో కాకుండా రెండు వారాల గ్యాప్ ఉండ‌డం గ‌మ‌నార్హం. ఏప్రిల్ 8న ప‌వ‌న్ క‌ళ్యాణ్ న‌టించిన 'స‌ర్దార్ గ‌బ్బ‌ర్‌సింగ్' విడుద‌ల కానుంటే.. ఏప్రిల్ 22న అల్లు అర్జున్ యాక్ట్ చేసిన 'స‌రైనోడు' రిలీజ్ కానుంది. ఈ సారైనా రెండు సినిమాలూ విజ‌యం సాధిస్తాయేమో చూడాలి.

More News

ప‌వ‌న్ క‌ళ్యాణ్ 'జ‌ల్సా'కి ఎనిమిదేళ్లు

'అత్తారింటికి దారేది'తో ఇండ‌స్ట్రీ హిట్ కొట్టిన కాంబినేష‌న్ ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, మాంత్రికుల మాంత్రికుడు త్రివిక్ర‌మ్‌ది. అయితే ఈ కాంబినేష‌న్‌కి పునాది వేసిన చిత్రం 'జ‌ల్సా'.

చరణ్ సినిమా.. 'కిక్' ఫార్ములా..

'ఎవడు' తరువాత సరైన విజయం అందుకోలేకపోయిన రామ్ చరణ్..

అడ‌వి శేష్ తో అభిషేక్ పిక్చ‌ర్స్..

క్ష‌ణం సినిమాలో హీరోగా న‌టించ‌డంతో పాటు క‌థ - స్ర్కీన్ ప్లే అందించిన మ‌ల్టీటాలెంటెడ్ ప‌ర్స‌న్ అడ‌వి శేష్. క్ష‌ణం సినిమాకి ముందు బాహుబ‌లి, పంజా, కిస్, క‌ర్మ‌ చిత్రాల్లో న‌టించినా...అడ‌వి శేష్ కి  హీరోగా స‌క్సెస్ అందించింది మాత్రం క్ష‌ణం చిత్రం.

లజ్జ ఫేమ్ వరుణ్ ఇంటర్వ్యూ....

కొందరు వ్యాపారం కోసం సినిమాలు తీస్తారు.మరి కొందరు అభిరుచి కోసం సినిమాలు తీస్తారు.ఇంకొందరు మేము కూడా సినిమా తీసాం అనిపించుకోవాలని కూడా తీస్తారు.

మ‌నోజ్ ను చూసి మిగ‌తా హీరోలు నేర్చుకోవాలి..

మంచు మ‌నోజ్ న‌టించిన తాజా చిత్రం ఎటాక్. రామ్ గోపాల్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వంలో మ‌నోజ్ న‌టించిన ఎటాక్ ఈ శుక్ర‌వారం రిలీజ్ అయ్యింది. ప్ర‌కాష్ రాజ్, జ‌గ‌ప‌తిబాబు, వ‌డ్డే న‌వీన్ ముఖ్య‌పాత్ర‌లు పోషించిన ఎటాక్ సినిమా ఏమాత్రం ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకోలేక‌పోయింది.