నిజాయితీతో చేసిన ప్ర‌య‌త్నాన్ని ప్రేక్ష‌కులు ఆద‌రిస్తారు - స‌ప్త‌గిరి

  • IndiaGlitz, [Wednesday,December 06 2017]

క‌మెడియిన్ సప్త‌గిరి హీరోగా న‌టిచిన చిత్రం 'స‌ప్త‌గిరి ఎల్‌.ఎల్‌.బి'. సాయి సెల్యులాయిడ్‌ సినిమాటిక్‌ క్రియేషన్స్‌ ప్రై లిమిటెడ్‌ బ్యానర్‌పై చరణ్‌ లక్కాకుల దర్శకత్వంలో డా.రవికిరణ్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా డిసెంబర్‌ 7న వరల్డ్‌వైడ్‌గా రిలీజ్‌ అవుతోంది. ఈ సందర్భంగా హీరో సప్తగిరితో ఇంటర్వ్యూ....

సినిమా ద్వారా ఎలాంటి మెసేజ్ ఇవ్వ‌బోతున్నారు?

'సప్తగిరి ఎక్స్‌ప్రెస్‌' సినిమా హీరోగా నాకు మంచి పేరుని, మా నిర్మాత డా.రవికిరణ్‌గారికి మంచి లాభాలను తెచ్చి పెట్టిన సినిమా. మళ్లీ అదే కాంబినేషన్‌లో సినిమా చేయాలనుకుని చేసిన సినిమాయే 'సప్తగిరి ఎల్‌.ఎల్‌.బి'. పోలీసు కానిస్టేబుల్స్‌లో ఎంత నిజాయితీ పరులుంటారో, ఎంత హార్డ్‌వర్క్‌ చేస్తారో అనే విషయాన్ని 'సప్తగిరి ఎక్స్‌ప్రెస్‌' సినిమాలో చూపించడమే కాకుండా పోలీస్‌ కానిస్టేబుళ్లకు ఆ సినిమాను అంకితం చేశాం.

బేసిక్‌గా నేను కమెడియన్‌ను అయినప్పటికీ ఆ మూవీలో నేను చేసిన సెంటిమెంట్‌, ఎమోషన్స్‌కు ఆడియెన్స్‌ కనెక్ట్‌ అయ్యారు. నాకు విజయాన్ని అందించారు. దాంతో మళ్లీ మరో మెసేజ్‌ ఓరియెంటెడ్‌ సినిమా చేయాలనుకున్నాం. అందుకనే ఓ కామెన్‌ మేన్‌ను రెప్రెజెంటేటివ్‌ చేస్తూ, బాలీవుడ్‌లో విడుదలైన 'జాలీ ఎల్‌.ఎల్‌.బి' సినిమాను తీసుకుని, తెలుగు నెటివిటీకి తగినట్లు మార్చి, ముఖ్య క‌థాంశం పాడవకుండా 'సప్తగిరి ఎల్‌.ఎల్‌.బి' సినిమా నిర్మించాం.

సినిమాలో ముఖ్య క‌థాంశం ఏంటి?

భారతదేశంలో పుట్టిన ధనికుడికైనా, పేదలకైనా ఎవరికైనా కావచ్చు..ప్రతి పౌరుడుకి న్యాయం దక్కాలనేది మన రాజ్యాంగం చెబుతుంది. అలాంటి న్యాయం ప్రతి ఒక్కరికీ దక్కడం కోసం పోరాడే ఓ చిన్న లాయర్‌ కథే ఇది. హండ్రెడ్‌ పర్సెంట్‌ కథ అందరినీ హత్తుకునేలా ఉంటుంది.

మ‌ళ్లీ రీమేక్ సినిమానే ఎందుకు చేయాల‌నుకున్నారు?

రీమేక్‌ సినిమానే చేయాలనే నిర్ణయాన్ని నేను, నిర్మాతగారు కలిసే తీసుకున్నాం. సప్తగిరి అనేవాడు 75 సినిమాల్లో కమెడియన్‌గా చేశాను. మళ్లీ కమెడియన్‌గా చేస్తే బావుండదు. కొత్తగా చేయాలి. ఏదైనా నిజాయితీగా చేయాలని నిర్ణయంతోనే ఈ సప్తగిరి ఎల్‌.ఎల్‌.బి సినిమా చేశాను. ఇందులో నాది లాయర్‌ పాత్ర. సప్తగిరి ఎక్స్‌ప్రెస్‌ను కానిస్టేబుల్స్‌కు అంకితం ఇస్తే, ఈ సినిమాను నిజాయితీ గల లాయర్స్‌కు అంకితం ఇస్తున్నాం.

ఈ సినిమా ఎమోషన్స్‌తో నడుస్తుంది. అలాగే నా కామెడీ కూడా ఆడియెన్స్‌ను నవ్విస్తుంది. హిందీ సినిమాలో ఎక్కువగా సాంగ్స్‌ ఉంటాయి. ఆ సాంగ్స్‌ స్థానంలో నేను కమర్షియల్‌ ఎలిమెంట్స్‌ను చూపించాం. చివరి 45 నిమిషాలు ప్రేక్షకులను కట్టిపడేసే సన్నివేశాలుంటాయి. ఓ భావోద్వేగానికి, ఉత్కంఠతకు ప్రేక్షకులు లోనవుతారు. సప్తగిరి చాలా చిన్నవాడు, కమెడియన్‌. అలాంటివాడు ఇలాంటి సబ్జెక్ట్‌ చేస్తే ఎలా ఉంటుందో అలా మార్పులు చేసి సినిమా చేశాం.

హీరోగా జ‌ర్నీ ఎలా ఉంది?

కమెడియన్‌గా 75 సినిమాలు చేసిన నాకు వేరియేషన్‌ ఏముంది. ఆ సినిమాలన్నింటిలో కనపడేది ఒకేలానే కదా! ఓ అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా 7 ఏళ్లు కష్టపడ్డాను. దాని వల్ల నాకంటూ కొన్ని ఆలోచనలు ఏర్పడ్డాయి. అనుకోకుండా కమెడియన్‌గా మారాను. అలాగే హీరోగా మారాను. ఇప్పుడు ఆ ఆలోచనలను ప్రెజెంట్‌ చేస్తూ నిజాయితీతో కూడా సినిమాలు చేయాలనేదే నా ప్రయత్నం. ప్రేక్ష‌కులు ఆద‌రిస్తార‌ని భావిస్తున్నాను.

ఈ సినిమాకు చ‌ర‌ణ్‌నే ఎందుకు డైరెక్ట‌ర్‌గా ఎంచుకున్నారు?

చరణ్‌ లక్కాకులగారు సీనియర్‌ మోస్ట్‌ కో డైరెక్టర్‌. నేను అనుకున్న టైమ్‌లో సినిమా పూర్తి కావాలనే ఉద్దేశంతో డేస్‌పై, ఆర్టిస్టులపై అవగాహం ఉన్న వ్యక్తి కావాలనే చరణ్‌గారిని కలిశాను. పాతికేళ్ల అనుభవమున్న వ్యక్తి కాబట్టి సినిమాను అనుకున్న సమయంలో పూర్తి చేశారు.

డ్యాన్సుల కోసం బాగా క‌ష్ట‌ప‌డ్డ‌ట్లున్నారు?

డ్యాన్సులు వేయాలనే కసి ఉంది. మ్యూజిక్‌ వినగానే నాలో ఒక ఊపు వస్తుంది. దాన్ని ఒక ఆర్డర్‌లో పెట్టుకుంటే మంచి అవుట్‌పుట్‌ తేగలనని అనిపించింది. దాంతో ఓ డ్యాన్స్‌ మాస్టర్‌ను పెట్టుకుని కష్టపడ్డాను. రేపు నేను ఎలా డ్యాన్సులు వేశాననే విషయాన్ని మీరే చెప్పాలి మరి. సినిమాలోని సన్నివేశాల్లో సెక్షన్స్‌ సరిగ్గా చెప్పాలనే ఉద్దేశంతో చాలా మంచి లాయర్స్‌ను కలిశాను. అలాగే టైటిల్‌ విషయంలో సెంటిమెంట్‌ను ఫాలో అయ్యాను.

బుల్గానిన్ సంగీతం ఎలా ఉంటుంది?

బుల్గానిన్‌ అందించిన పాటలు కావచ్చు, రీరికార్డింగ్‌ కావచ్చు సూపర్బ్‌గా ఉన్నాయి. సినిమాతో పాటు ప్రేక్షకుడిని ట్రావెల్‌ అయ్యేలా చేస్తుంది.

సాయికుమార్‌, శివ‌ప్ర‌సాద్ రోల్స్ ఎలా ఉండ‌బోతున్నాయి?

హిందీలో బొమన్‌ ఇరానీగారు చేసిన పాత్రలో సాయికుమార్‌గారు చేశారు. సౌరవ్‌శుక్లాగారు చేసిన క్యారెక్టర్‌ను తెలుగులో పార్లమెంట్‌ మెంబర్‌ శివప్రసాద్‌గారు చేశారు. ఈ సినిమాలో నేను, శివప్రసాద్‌గారు, సాయికుమార్‌గారు ముగ్గురు హీరోల్లా చేశాం.

ర‌వికిర‌ణ్‌గారితో మ‌ళ్లీ సినిమా చేయ‌డం ఎలా ఉంది?

మా నిర్మాత ర‌వికిర‌ణ్‌గారు గ్రేట్ ప‌ర్స‌నండీ. నిర్మాత రవికిరణ్‌గారు తొలిసినిమాతో నిర్మాతగా సక్సెస్‌ అయ్యారు. సినిమాల్లో ఏదో సంపాదించుకోవాలనే ఉద్దేశంతో కాకుండా..నా సినిమా అంటే కొన్ని వాల్యూస్‌ ఉండాలి అంటూ ఈ సినిమా మేకింగ్‌లో కూడా ఎక్కడా కాంప్రమైజ్‌ కాలేదు.

More News

బాల‌కృష్ణ చిత్రానికి సీక్వెల్‌?

న‌ట‌సింహ బాల‌కృష్ణ ఇప్ప‌టివ‌ర‌కు సీక్వెల్ చిత్రాల్లో న‌టించ‌లేదు. ఆ మ‌ధ్య ఆదిత్య 369కి సీక్వెల్‌గా తెర‌కెక్కే చిత్రంలో ఆయ‌న న‌టించ‌బోతున్న‌ట్లు వార్త‌లు వినిపించాయి. అయితే.. కొన్ని కార‌ణాల వ‌ల్ల ఆ సినిమా ప‌ట్టాలెక్క‌లేదు.

మ‌రో చిత్రానికి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన సూర్య‌

గ‌జిని చిత్రంతో తెలుగులోనూ మార్కెట్‌ని సంపాదించుకున్నారు త‌మిళ క‌థానాయ‌కుడు సూర్య‌.  ప్ర‌స్తుతం ఆయ‌న న‌టించిన‌ చిత్రం తానే సేరంద కూట్ట‌మ్‌.

చరణ్ హీరోయిన్ గా...

మజ్ను చిత్రంతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన కేరళ కుట్టి అను ఇమ్మాన్యుయేల్. ఇప్పుడు వరుస అవకాశాలతో దూసుకెళుతోంది.

యాక్షన్ ప్లాన్ లో పూరి....

డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ప్రస్తుతం తన తనయుడు ఆకాష్ పూరి హీరోగా సినిమా చేస్తోన్న సంగతి తెలిసింది. పూరి దర్శకత్వంతో పాటు స్వీయ నిర్మాణంలో సినిమా చేస్తున్నాడు. `మెహబూబా` పేరుతో రూపొందుతోంది.

రెండు తొలిప్రేమ‌లు.. రెండు కామ‌న్ పాయింట్స్‌

జులై 24, 1998.. ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ కెరీర్‌లో మ‌ర‌చిపోలేని రోజు. ఎందుకంటే.. ఆ రోజే ప‌వ‌న్ సినీ జీవితంలో ఓ అద్భుతం జ‌రిగింది. అదే తొలి ప్రేమ సినిమా విడుద‌లవ‌డం.