రీమేక్‌లో నాగ్‌... యంగ్ డైరెక్ట‌ర్ కోసం అన్వేష‌ణ‌!!

  • IndiaGlitz, [Tuesday,July 21 2020]

కింగ్ నాగార్జున గ‌త ఏడాది 'మ‌న్మ‌థుడు 2'తో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చాడు. అయితే ఈ సినిమా ప్లాప్ అయ్యింది. అయితే నాగార్జున మ‌రో సినిమాకు క‌మిట్ కాలేదు. సాల్మోన్ ద‌ర్శ‌క‌త్వంలో ‘వైల్డ్ డాగ్’ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ క‌రోనా ఎఫెక్ట్ వ‌ల్ల ఆగింది. దీని త‌ర్వాత ప్ర‌వీణ్ స‌త్తారు ద‌ర్శ‌క‌త్వంలోనూ నాగార్జున ఓ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌లోనూ న‌టించ‌నున్నారు. ఇది కాకుండా ఓ బాలీవుడ్ రీమేక్‌లో న‌టించ‌డానికి నాగార్జున ఆస‌క్తిగా ఉన్నార‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. వివ‌రాల్లోకెళ్తే.. అజ‌య్ దేవ‌గ‌ణ్ హీరోగా న‌టించిన బాలీవుడ్ చిత్రం 'రైడ్‌'. ఈ సినిమా తెలుగు రీమేక్‌లో నాగార్జున న‌టించాల‌నుకుంటున్నార‌ట‌. అయితే అనుభ‌వం ఉన్న ద‌ర్శ‌కుల‌తో కాకుండా యంగ్ డైరెక్ట‌ర్స్‌తో ఈ రీమేక్ చేయాల‌ని నాగార్జున యోచిస్తున్నార‌ట‌. ప్ర‌స్తుతం నాగ్ ద‌ర్శ‌కుల వేట‌లో బిజీగా ఉన్నారు.

ఇవ‌న్నీ కాకుండా.. నాగార్జున త్వ‌ర‌లోనే ప్రారంభం కాబోయే తెలుగు రియాలిటీ షో బిగ్‌బాస్ సీజ‌న్ 4కు వ్యాఖ్యాత‌గా కూడా వ్య‌వ‌హ‌రించ‌నున్నారు. బిగ్‌బాస్ 4 త్వ‌ర‌లోనే ప్రారంభం కానుంది. అందుకు సంబంధించిన లోగో కూడా విడుద‌లైంది కానీ.. నాగార్జున హోస్టింగ్ గురించి మాత్రం క్లారిటీ రాలేదు. త్వ‌ర‌లోనే ఆ విష‌యంపై కూడా క్లారిటీ వ‌చ్చేస్తుంది. బిగ్‌బాస్ 4తో పాటు సినిమాల‌పై కూడా నాగార్జున ఫోకస్ చేయనున్నారు.

More News

ప్లాస్మా డోనర్ పేరుతో బడా మోసం.. 200 మంది నుంచి డబ్బు వసూలు..

కరోనా కారణంగా చావుకి దగ్గరైన వ్యక్తులను బతికించేందుకు చిట్టచివరి ఆయుధంగా వైద్యులు ప్లాస్మాను ప్రయోగిస్తున్నారు.

ఎన్ 95 మాస్కులు కరోనాను కట్టడి చేయలేవు: డీజీహెచ్ఎస్

ఎన్ 95 మాస్కుల వినియోగంపై డైరెక్టర్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్(డీజీహెచ్ఎస్) కీలక ప్రకటన చేసింది.

‘ఆచార్య’ కోసం స్పెషల్ సెట్

మెగాస్టార్ చిరంజీవి 152వ చిత్రం ‘ఆచార్య‌’. మెసేజ్ మిక్స్ చేసిన క‌మ‌ర్షియ‌ల్ చిత్రాల‌ను తెర‌కెక్కించే ద‌ర్శ‌కుడు కొర‌టాల శివ ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తోన్న సంగ‌తి తెలిసిందే.

తెలంగాణ కరోనా అప్‌డేట్.. తగ్గిన కేసులు..

తెలంగాణ కరోనా హెల్త్ బులిటెన్‌ను సోమవారం వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసింది.

‘బిగ్‌బాస్’ తెలుగు అప్‌డేట్ వచ్చేసింది..

బిగ్‌బాస్ సీజన్ స్టార్ట్ అవుతుందంటేనే ముందు నుంచే ఊహాగానాలు మొదలవుతుంటాయి. సీజన్ 4 కి సంబంధించి కూడా ఎప్పటి నుంచో ఊహాగానాలు చెలరేగుతున్నాయి.