శీనుకి స్టార్ హీరోయిన్ కావాలట....

  • IndiaGlitz, [Tuesday,January 05 2016]

బెల్లంకొండ సురేష్ త‌న‌యుడు బెల్లంకొండ శ్రీనివాస్ న‌టిస్తున్న తాజా చిత్రం స్పీడున్నోడు. భీమ‌నేని శ్రీనివాస‌రావు స్వీయ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న‌ స్పీడున్నోడు సినిమాని ఫిబ్ర‌వ‌రి 5న రిలీజ్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా త‌ర్వాత బెల్లంకొండ శ్రీనివాస్ బోయ‌పాటి శ్రీను ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా చేయ‌నున్నారు.

ఈ విష‌యాన్ని పుట్టిన‌రోజు సంద‌ర్భంగా ఇటీవ‌ల బెల్లంకొండ శ్రీనివాస్ స్వ‌యంగా ప్ర‌క‌టించారు. ఈ చిత్రాన్ని అభిషేక్ పిక్చ‌ర్స్ సంస్థ నిర్మించ‌నుంది. అయితే ఈ సినిమాలో హీరోయిన్ గా...స్టార్ హీరోయిన్ ర‌కుల్ అయితే బాగుంటుంద‌నే ఆలోచ‌న‌లో ఉన్నార‌ట‌. త్వ‌ర‌లోనే ర‌కుల్ ని సంప్ర‌దించ‌నున్నార‌ని స‌మాచారం. ఏప్రిల్ 8న ఈ చిత్రాన్ని ప్రారంభించ‌నున్నారు. మ‌రి...బెల్లంకొండ శ్రీనివాస్ స‌ర‌స‌న న‌టించేందుకు ర‌కుల్ ఎస్ అంటుందో...నో అంటుందో చూడాలి.

More News

సూర్య‌ను బాలీవుడ్‌కు తీసుకెళ్ళాలంటున్న డైరెక్ట‌ర్‌

తెలుగు, త‌మిళ సినిమా రంగాల్లో మార్కెట్ క‌లిగి ఉన్న సూర్య వర్మ డైరెక్ట్ చేసిన ర‌క్త‌చరిత్ర సినిమాతో బాలీవుడ్‌లో కూడా అడుగుపెట్టాడు.

సునీల్ సరసన ఇద్దరు

పూలరంగడు, మర్యాద రామన్న, భీమవరం బుల్లోడు, మిస్టర్ పెళ్ళికొడుకు చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను నవ్వుల్లో ముంచెత్తిన హీరో సునీల్

రెండో సినిమాకే డబ్బింగ్ చెప్పేసుకుంది

నాని సరసన ‘ఎవడే సుబ్రమణ్యం’ సినిమాలో నటించిన హీరోయిన్ మాళవిక నాయర్. ఈ సినిమా తర్వాత గ్యాప్ తీసుకున్న మాళవిక నాయర్

నాని టైటిల్ మారుతుందా...

నానికి 2015 ఏడాది బాగా కలిసి వచ్చింది.భలే భలే మగాడివోయ్ సినిమాతో మంచి సక్సెస్ ను చవిచూశాడు నాని.

'లచ్చిందేవికి ఓ లెక్కుంది' రిలీజ్ డేట్

న‌వీన్ చంద్ర, లావణ్య త్రిపాఠి జంటగా మయూఖ క్రియేషన్స్ బ్యానర్ పై జగదీశ్ తలశిల దర్శకత్వంలో సాయి ప్రసాద్ కామినేని నిర్మించిన చిత్రం 'లచ్చిందేవికి ఓ లెక్కుంది.