close
Choose your channels

శీనుకి స్టార్ హీరోయిన్ కావాలట....

Tuesday, January 5, 2016 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

బెల్లంకొండ సురేష్ త‌న‌యుడు బెల్లంకొండ శ్రీనివాస్ న‌టిస్తున్న తాజా చిత్రం స్పీడున్నోడు. భీమ‌నేని శ్రీనివాస‌రావు స్వీయ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న‌ స్పీడున్నోడు సినిమాని ఫిబ్ర‌వ‌రి 5న రిలీజ్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా త‌ర్వాత బెల్లంకొండ శ్రీనివాస్ బోయ‌పాటి శ్రీను ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా చేయ‌నున్నారు.

ఈ విష‌యాన్ని పుట్టిన‌రోజు సంద‌ర్భంగా ఇటీవ‌ల బెల్లంకొండ శ్రీనివాస్ స్వ‌యంగా ప్ర‌క‌టించారు. ఈ చిత్రాన్ని అభిషేక్ పిక్చ‌ర్స్ సంస్థ నిర్మించ‌నుంది. అయితే ఈ సినిమాలో హీరోయిన్ గా...స్టార్ హీరోయిన్ ర‌కుల్ అయితే బాగుంటుంద‌నే ఆలోచ‌న‌లో ఉన్నార‌ట‌. త్వ‌ర‌లోనే ర‌కుల్ ని సంప్ర‌దించ‌నున్నార‌ని స‌మాచారం. ఏప్రిల్ 8న ఈ చిత్రాన్ని ప్రారంభించ‌నున్నారు. మ‌రి...బెల్లంకొండ శ్రీనివాస్ స‌ర‌స‌న న‌టించేందుకు ర‌కుల్ ఎస్ అంటుందో...నో అంటుందో చూడాలి.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.