టాలీవుడ్‌లో విషాదం .. సీనియర్ నటుడు బాలయ్య కన్నుమూత

  • IndiaGlitz, [Saturday,April 09 2022]

తెలుగు చిత్ర పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. సీనియర్ నటులు బాలయ్య కన్నుమూశారు. హైదరాబాద్ యూసుఫ్‌గూడలోని తన స్వగృహంలో శనివారం ఉదయం తుదిశ్వాస విడిచారు. ఆయన వయసు 94 సంవత్సరాలు.

1930లో గుంటూరు జిల్లా చావపాడులో ఆయన జన్మించారు. చెన్నైలోని ప్రఖ్యాత గుండీ ఇంజనీరింగ్ కాలేజీలో ఆ రోజుల్లోనే బీఈ (మెకానికల్) చదివారు. ఆ సమయంలోనే నాటకాలు వేస్తూ గుర్తింపు పొందారు. బాలయ్యను చూసిన కొందరు .. హిందీ నటుడు అశోక్ కుమార్ లాగా ఉన్నావు అనేవారు. దాంతో ఆయనకు కూడా సినిమా రంగంపై ఆసక్తి కలిగింది. మిత్రుల ప్రోత్సాహంతో చిత్రసీమలో అడుగు పెట్టారు. అప్పటికే ‘రోజులు మారాయి’ చిత్రంతో దర్శకునిగా తనదైన ముద్ర వేసిన తాపీ చాణక్యను కలిశారు. ఆయన కూడా బాలయ్యను ప్రోత్సహిస్తూ తాను తెరకెక్కించిన ‘ఎత్తుకు పైఎత్తు’ చిత్రంతో హీరోని చేశారు. బాలయ్య హిందీలో పృథ్వీరాజ్ కపూర్, శాంతారామ్ ను, తెలుగులో ఎన్టీఆర్ ను అభిమానించేవారు. అన్నగారితో కలసి పనిచేయడం వల్ల ఆయన క్రమశిక్షణకు ఆకర్షితులయ్యారు బాలయ్య.

నటుడిగా 300కిపైగా చిత్రాల్లో నటించిన బాలయ్య.. నిర్మాతగా, దర్శకుడుగా, కథా రచయితగానూ రాణించారు. అమృత ఫిల్మ్స్ బ్యానర్‌పై చెల్లెలి కాపురం, నేరము - శిక్ష , చుట్టాలున్నారు జాగ్రత్త, ఊరికిచ్చిన మాట తదితర చిత్రాలను బాలయ్య నిర్మించారు. దర్శకుడుగా పసుపు తాడు, నిజం చెబితే నేరమా, పోలీసు అల్లుడు రూపొందించారు. ఉత్తమ కథా రచయితగా ఊరికిచ్చిన మాట చిత్రానికి, చెల్లెలి కాపురం చిత్రానికి నిర్మాతగా నంది అవార్డులను అందుకున్నారు. బాలయ్య కుమారుడు తులసీరామ్ కూడా కొన్ని చిత్రాల్లో హీరోగా నటించారు. ఆయన మరణం పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు. జనసేన పార్టీ పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ కూడా బాలయ్య మరణం పట్ల సంతాపం తెలియజేశారు.

More News

మెగా ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్ : ప్రీ రిలీజ్ ఈవెంట్‌ డేట్ కన్ఫర్మ్.. ఎప్పుడంటే..?

మెగాస్టార్ చిరంజీవి - కొరటాల శివ కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘‘ఆచార్య’’ సినిమా రిలీజ్‌కు రెడీ అయ్యింది.

హరిహర వీరమల్లు అదిరిపోయే సెట్స్..  ఆర్ట్ డైరెక్టర్ తోట తరణిని సత్కరించిన పవన్ కల్యాణ్

పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా క్రిష్ దర్శకత్వంలో హరిహర వీరమల్లు అనే సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే.

‘పుష్ప.. పుష్పరాజ్‌.. జ‌వాబులు రాసేదే లే’.. టెన్త్ స్టూడెంట్ ఆన్సర్ షీట్‌‌‌ వైరల్, టీచర్‌కు షాక్

సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటించిన ‘‘పుష్ప’’ సినిమా సృష్టించిన సంచలనాలు అన్ని ఇన్నీ కావు. ఈ సినిమాలోని పాటలు,

రియల్ స్టార్ సోనూసూద్‌కు అరుదైన గౌరవం.. ‘‘గోల్డెన్ వీసా’’ ఇచ్చిన దుబాయ్

కరోనా సమయంలోనూ.. ఆ తర్వాత కూడా తన సామాజిక సేవతో ఎంతోమంది అవసరాలు తీర్చారు సోనూసూద్.

నేను ఇండస్ట్రీకి వచ్చి పదేళ్లా.. నమ్మలేకపోతున్నా: పూజా హెగ్డే

నెల్సన్ దర్శకత్వంలో ఇళయ దళపతి విజయ్- పూజా  హెగ్డే నటించిన ‘‘బీస్ట్’’ చిత్రం ఏప్రిల్ 13న విడుదలకు సిద్ధమైంది.