శంక‌రాభ‌ర‌ణం కి సెంటిమెంట్ క‌లిసొస్తుందా..

  • IndiaGlitz, [Saturday,October 31 2015]

తెలుగు చ‌ల‌న‌చిత్ర చ‌రిత్ర‌లో మ‌ర‌చిపోలేని సంచ‌ల‌న‌ చిత్రం శంక‌రాభ‌ర‌ణం. ఈ సంచ‌ల‌న సినిమాని క‌ళాత‌ప‌స్వి విశ్వ‌నాథ్ తెర‌కెక్కించారు. ఇప్పుడు శంకరాభ‌ర‌ణం టైటిల్ తో ఓ చిత్రం వ‌స్తుంది. ఈ చిత్రంలో నిఖిల్, నందిత జంట‌గా న‌టించారు.నూత‌న ద‌ర్శ‌కుడు ఉద‌య్ నంద‌న‌వ‌న‌మ్ ఈ సినిమాకి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఈ శంక‌రాభ‌ర‌ణం సినిమాకి స్టార్ రైట‌ర్ కోన వెంక‌ట్ క‌థ‌, క‌థ‌నం, మాట‌లు అందించ‌డంతో పాటు చిత్ర స‌మ‌ర్ప‌కుడిగా వ్య‌వ‌హ‌రించ‌డం విశేషం.

బీహార్ బ్యాక్ డ్రాప్ తో క్రైమ్ థ్రిల్ల‌ర్ గా రూపొందించిన‌ శంక‌రాభ‌ర‌ణం సినిమాని బాలీవుడ్ లో విజ‌యం సాధించిన పాస్ గ‌యా రే ఒబామా సినిమా ఆధారంగా తెర‌కెక్కిస్తున్నారు. ఇక శంక‌రాభ‌ర‌ణం సెంటిమెంట్ విష‌యానికి వ‌స్తే...ఈ చిత్రాన్ని క‌ళాత‌ప‌స్వి విశ్వ‌నాథ్ షార్ట్ క‌ట్ లో.. ఇంగ్లీషులో చెప్పాలంటే కె.వి తెర‌కెక్కించారు. అలాగే లేటెస్ట్ శంకరాభ‌ర‌ణం చిత్రానికి క‌థ‌,క‌థ‌నం అందించ‌డంతో పాటు చిత్ర స‌మ‌ర్ప‌కుడిగా వ్య‌వ‌హరిస్తుంది కోన వెంక‌ట్ షార్ట్ క‌ట్ లో ఇంగ్లీషులో చెప్పాలంటే కె.వి. మ‌రి..ఈ సెంటిమెంట్ క‌లిసొచ్చిశంక‌రాభ‌ర‌ణం స‌క్సెస్ అవుతుందా..? ఎలాంటి విజ‌యాన్ని సాధిస్తుంది అనేది తెలుసుకోవాలంటే న‌వంబ‌ర్ 20 వ‌ర‌కు ఆగాల్సిందే.

More News

సంక్రాంతి రేసులో వ‌రుణ్ తేజ్

మెగా బ్ర‌ద‌ర్ నాగ‌బాబు త‌న‌యుడు వ‌రుణ్ తేజ్ హీరోగా డేరింగ్ & డాషింగ్ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న చిత్రం మా అమ్మ మ‌హాల‌క్ష్మి. ఈ చిత్రాన్ని సి.క‌ళ్యాణ్ నిర్మిస్తున్నారు.

నిర్మాతను మార్చేసిన చరణ్

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తమిళ్ చిత్రం తని ఓరువన్ రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాని కూడా బ్రూస్ లీ నిర్మాత దానయ్యే నిర్మించాలనుకున్నారు. చరణ్ కూడా ఓకె అన్నాడు. అయితే బ్రూస్ లీ సినిమా ఇచ్చిన రిజల్ట్ తో ఆలోచనలో పడ్డ చరణ్ నిర్మాతను మార్చేసాడట

నాగ‌చైత‌న్య తొలిసారిగా..

అక్కినేని నాగ‌చైత‌న్య ఇప్ప‌టివ‌ర‌కు ప‌ది చిత్రాల్లో హీరోగా న‌టించాడు. ప్ర‌స్తుతం ప‌ద‌కొండ‌వ సినిమా 'సాహ‌సం శ్వాస‌గా సాగిపో'తో బిజీగా ఉన్నాడు.

క‌మ‌ల్‌తో అజిత్‌కిది నాలుగోసారి

ఈ దీపావ‌ళి త‌మిళ‌నాట ర‌స‌వ‌త్త‌రంగా మారింది. ఎందుకంటే.. క‌మ‌ల్ హాస‌న్ తాజా చిత్రం 'తూంగ‌న‌గ‌రం' (తెలుగులో 'చీక‌టి రాజ్యం'), అజిత్ కొత్త సినిమా 'వేదాళం' ఒకే రోజున (న‌వంబ‌ర్ 10) విడుద‌ల కావ‌డ‌మే అందుకు కార‌ణం.

మ‌హేష్, మురుగుదాస్ మూవీ ముహుర్తం

సూప‌ర్ స్టార్ మ‌హేష్, క్రేజీ డైరెక్ట‌ర్ మురుగుదాస్ కాంబినేష‌న్లో ఓ మూవీ తెర‌కెక్క‌నున్న విష‌యం తెలిసిందే.