close
Choose your channels

మ‌హేష్, మురుగుదాస్ మూవీ ముహుర్తం

Saturday, October 31, 2015 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

సూప‌ర్ స్టార్ మ‌హేష్, క్రేజీ డైరెక్ట‌ర్ మురుగుదాస్ కాంబినేష‌న్లో ఓ మూవీ తెర‌కెక్క‌నున్న విష‌యం తెలిసిందే. ఈ చిత్రాన్నిఎన్.వి.ప్ర‌సాద్, ఠాగూర్ మ‌థు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఒకేసారి తెలుగు, త‌మిళ్ తో పాటు హిందీ లో కూడా రిలీజ్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నార‌ని స‌మాచారం. దాదాపు 100 కోట్ల భారీ బ‌డ్జెట్ తో అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా ఈ మూవీని నిర్మించున్నారు.

మ‌హేష్ స‌ర‌స‌న న‌టించే హీరోయిన్ ఎవ‌ర‌నేది ఇంకా ఫైన‌ల్ కాలేదు. అయితే శ్రుతి హాస‌న్, అలియాభ‌ట్ ల‌ను ప‌రిశీలిస్తున్నారు. త్వ‌ర‌లోనే మ‌హేష్ స‌ర‌స‌న న‌టించే హీరోయిన్ ఎవ‌ర‌నేది ఫైన‌ల్ చేయ‌నున్నారు. అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా రూపొందే ఈ భారీ చిత్రాన్ని ఏప్రిల్ 12న ప్రారంభించ‌డానికి ముహుర్తం ఫిక్స్ చేసిన‌ట్టు స‌మాచారం. యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ గా రూపొందే ఈ సినిమాలో మంచి సందేశం కూడా ఉంటుంది. మ‌రి..మ‌హేష్, మురుగుదాస్ చేసే ఈ సందేశాత్మ‌క చిత్రం ఏ రేంజ్ స‌క్సెస్ సాధిస్తుందో చూడాలి.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.