మరో 72 గంటల పాటు అతి భారీ వర్షాలు..

  • IndiaGlitz, [Tuesday,October 13 2020]

హైదరాబాద్‌కు వాతావరణ శాఖ భారీ వర్ష సూచన చేసింది. మరో 72 గంటలపాటు అతి భారీ వర్షాలు కురవనున్నట్టు వెల్లడించింది. ఈ మేరకు జీహెచ్ఎంసీ క‌మిష‌న‌ర్ డి.ఎస్.లోకేష్ కుమార్ ప్ర‌క‌ట‌న‌ విడుదల చేశారు. కొన్ని చోట్ల 9 నుండి 16 సెంటిమీట‌ర్ల అతిభారీ వ‌ర్ష‌పాతం న‌మోద‌య్యే అవ‌కాశం ఉంద‌ని లోకేష్ కుమార్ వెల్లడించారు. వాతావరణశాఖ హెచ్చరికలతో ప్రభుత్వం అధికారులను అప్రమత్తం చేసింది. మాన్ సూన్ బృందాలు అలర్ట్‌గా ఉండాలని లోకేష్‌కు కుమార్ ఆదేశించారు.

లోతట్టు ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండాలని.. ప్రజలు అవసరమైతేనే బయటకు రావాలని అధికారులకు లోకేష్ కుమార్ సూచించారు. అదేవిధంగా ఆయా ప్రాంతాల్లో రిలీఫ్ సెంట‌ర్లుగా గుర్తించిన పాఠ‌శాల‌లో, క‌మ్యునిటీహాల్స్‌, ఇత‌ర వ‌స‌తుల‌ను సిద్ధం చేయాల‌ని అధికారులను ఆదేశించారు. మరోవైపు మంత్రి కేటీఆర్ నగరంలో శిథిలావస్థలో ఉన్న భవనాలకు నోటీసులు ఇచ్చి.. అందులో ఉన్నవాళ్లను ఖాళీ చేయించాలని అధికారులను ఆదేశించారు. అప్రమత్తంగా ఉండాలని టౌన్ ప్లానింగ్ సిబ్బందికి సైతం సూచించారు.

కాగా.. నేటి ఉదయం నుంచి హైదరాబాద్‌లో భారీగా వర్షం కురుస్తూనే ఉంది. ఎల్బీ నగర్, ఉప్పల్, నాగోల్, బేగంపేట, కోఠి, మెహదీపట్నం, మణికొండ, బంజారాహిల్స్‌తో పాటు పలు ప్రాంతాల్లో భారీ వర్షం పడుతోంది. దీంతో రోడ్లపై చాలా చోట్ల నీళ్లు నిలిచిపోయాయి. ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడుతోంది.

More News

జైల్లో గాయపడిన హీరోయిన్..

శాండల్‌వుడ్ డ్రగ్స్ కేసులో అరెస్టైన కన్నడ హీరోయిన్ రాగిణీ ద్వివేది జైల్లో గాయపడింది. నడుముకు, వెన్నుకు గాయాలయ్యాయని ప్రైవేటు ఆసుపత్రిలో

గుణశేఖర్‌ హీరోయిన్‌ ఎవరో?

తాను తీసే సినిమాలన్నీ చారిత్రాక, పురాణ అంశాల ఆధారంగానే ఉండేలా చూసుకోవడం డైరెక్టర్‌ గుణశేఖర్‌కు ఉండే అలవాటు.

అక్కడ ఫిక్సయిన 'పుష్ప'.. నిర్మాతలేం చేశారంటే?

స్టైలిష్‌స్టార్ అల్లుఅర్జున్‌, సుకుమార్ కాంబినేష‌న్‌లో ‘ఆర్య‌, ఆర్య 2’ త‌ర్వాత రూపొందుతోన్న చిత్రం ‘పుష్ప‌’.

బయోపిక్‌లో రానా దగ్గుబాటి..?

ఇండియన్‌ సినిమాల్లో బయోపిక్స్‌ హవా ఏ మాత్రం తగ్గడం లేదు. సినీ, రాజకీయం, క్రీడలు ఇలా పలు రంగాల్లోని కీలక వ్యక్తుల బయోపిక్స్‌ రూపొందుతున్నాయి.

తిండి విషయంలో 'ఆర్‌ఆర్‌ఆర్‌' యూనిట్‌ తీసుకున్న నిర్ణయం

ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి, యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, మెగాప‌వ‌ర్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్ కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న ప్రెస్టీజియ‌స్ చిత్రం 'ఆర్‌ఆర్‌ఆర్‌(రౌద్రం రణం రుధిరం)'.