close
Choose your channels

జైల్లో గాయపడిన హీరోయిన్..

Tuesday, October 13, 2020 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

జైల్లో గాయపడిన హీరోయిన్..

శాండల్‌వుడ్ డ్రగ్స్ కేసులో అరెస్టైన కన్నడ హీరోయిన్ రాగిణీ ద్వివేది జైల్లో గాయపడింది. నడుముకు, వెన్నుకు గాయాలయ్యాయని ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స చేయించుకునేందుకు అవకాశం కల్పించాలని కోరుతూ కోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. జైలులో తనకు చికిత్సను అందిస్తున్నప్పటికీ ఇప్పటి వరకూ తనకు ఏమాత్రం నొప్పి తగ్గలేదని పేర్కొంది. కాబట్టి తనకు ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స చేయించుకునే అవకాశం కల్పించాలని రాగిణి పిటిషన్‌లో కోరింది.

రాగిణి పిటీషన్‌ను విచారణకు స్వీకరించిన కోర్టు.. దీనిపై అభ్యంతరాలు ఉంటే తెలపాల్సిందిగా సీసీబీ పోలీసులను కోరింది. అనంతరం కేసు విచారణను వాయిదా వేసింది. కొద్ది రోజుల క్రితం కోర్టు రాగిణికి ఈ నెల 23 వరకు రిమాండ్ విధించింది. ప్రస్తుతం డ్రగ్స్ కేసులో అరెస్టైన కన్నడ ముద్దుగుమ్మలిద్దరూ రాగిణి, సంజన బెంగుళూరులోని పరప్పన జైలులో రిమాండ్‌లో ఉన్నారు. ముద్దుగుమ్మలిద్దరికీ మొదటి నుంచి పడదని టాక్. ఇప్పుడు ఒకటే జైలులో ఉంచే సరికి ఇద్దరూ గొడవలతో పోలీసులకు తలనొప్పిగా మారారని సమాచారం.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.