బ్రేకింగ్ వివాదంలో షారుక్ ఖాన్ 'జీరో'

  • IndiaGlitz, [Tuesday,November 06 2018]

బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుక్ తాజాగా నటించిన చిత్రం 'జీరో'. ఆనంద్ ఎల్ రాయ్ దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రం లో షారుక్ ఖాన్ మరుగుజ్జు పాత్రలో మెప్పించనున్నాడు. ఇటీవలే విడుదలైన ఈ చిత్రం ట్రైలర్ యూట్యూబ్ లో హల్ చల్ చేస్తున్న విషయం తెలిసిందే. షారుక్ ఖాన్ సరసన ఈ చిత్రంలో హాట్ భామలు అనుష్క శర్మ, కత్రినా కైఫ్ లు నటిస్తున్నారు.

భారీ అంచనాల మధ్య వస్తున్న ఈ చిత్రం తాజాగా వివాదంలో చిక్కుకుంది.అయితే ఈ చిత్రంలో షారుక్ సిక్కులు ఎంతో పవిత్రంగా భావించే కత్తిని ధరించాడు. అయితే ఈ కత్తిని సాంప్రదాయం ప్రకారం అమృత దారి అయినా సిక్కులు మాత్రమే ధరించాలని, అటువంటి పవిత్రమైన కత్తిని షారుక్ సినిమాలో ధరించి మమ్మల్ని ఆవమానించాడని, తమ మనోభావాలు దెబ్బ తీసే విధంగా చిత్రంలో పలు సన్నివేశాలు ఉన్నాయంటూ ఢిల్లీ సిక్కు గురుద్వార్ కమిటీ జనరల్ సెక్రటరీ ఢిల్లీ పోలీస్ స్టేషన్ లో కంప్లెయింట్ చేశారు.

ఇలా సిక్కులను అవమానించినందుకు షారుక్ ఖాన్ దర్శకుడు ఆనంద్ ల పై చర్యలు తీసుకోవాలని, అలాగే సినిమాలో సిక్కులను అవమానించేలా ఉన్న అభ్యంతరకరమైన సన్నివేశాలను తొలగించాలంటూ వారు డిమాండ్ చేశారు.

More News

అల్లు అర్జున్ కు కేరళ 'సి ఎం' ఆహ్వానం

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా కేరళలో కూడా భారీ ఫాలోయింగ్ ఉన్న విషయం తెలిసిందే.

అల్లు అర్జున్ కొత్త సినిమా అనౌన్స్ మెంట్ ఎప్పుడంటే

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గత సినిమా "నా పేరు సూర్య" విడుదలై ఇప్పటికే నాలుగు నెలలు కావస్తున్నా తన తదుపరి సినిమాను ఎవరితో  చేయనున్నాడనేది కన్ఫర్మ్ కాలేదు.

బోయపాటి రామ్ చరణ్ ల ఫస్ట్ లుక్ అదిరిందిగా

ఊర మాస్ యాక్షన్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.

2.ఓ ట్రైలర్ పై మహేష్ బాబు స్పందన

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఇటీవలే విడుదలై సంచలనాలు సృష్టిస్తున్న రజినీకాంత్ 2. ఓ చిత్రం ట్రైలర్ గురించి తాజాగా స్పందించారు.

జక్కన్న ఆర్ ఆర్ ఆర్ లో హీరోయిన్లు ఎవరు

దర్శకధీరుడు రాజమౌళి బాహుబలి చిత్రంతో సంచలన విజయం దక్కించుకుని  తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచానికి చాటారు.