close
Choose your channels

జక్కన్న ఆర్ ఆర్ ఆర్ లో హీరోయిన్లు ఎవరు

Tuesday, November 6, 2018 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

జక్కన్న ఆర్ ఆర్ ఆర్ లో హీరోయిన్లు ఎవరు

దర్శకధీరుడు రాజమౌళి బాహుబలి చిత్రంతో సంచలన విజయం దక్కించుకుని తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచానికి చాటారు. ఈ సినిమా తర్వాత జక్కన్న మన దేశంలో ఉన్న టాప్ మోస్ట్ దర్శకుల్లో ముందు వరుసలో నిలిచారు. ఆయన నుంచి సినిమా అంటే దేశం మొత్తం ఆసక్తిగా ఎదురు చూసే పరిస్థితి నెలకొంది. దాన్ని దృష్టిలో పెట్టుకొనే రాజమౌళి తన తదుపరి చిత్రాన్ని భారీ స్థాయిలో తెరకెక్కించేందుకు ప్లాన్ చేశాడు.

టాలీవుడ్ క్రేజీ హీరోలు యంగ్ టైగర్ ఎన్టీఆర్ ,మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ లతో జక్కన్న తన తదుపరి చేయనున్న విషయం తెలిసిందే. పీరియాడిక్ డ్రామా గా తెరకెక్కనున్న ఈ సినిమా ఈ నెల నవంబర్ 11న 11 గంటలకు ప్రారంభం కానుంది.ఇంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కనున్న ఈ చిత్రంలో హీరోయిన్ లు ఎవరనేది సర్వత్రా ఆసక్తి నెలకొంది.

అయితే ముగ్గురు హీరోయిన్ లు ఉండనున్న ఈ సినిమాలో ఒక హీరోయిన్ గా ఫారిన్ భామ ను తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే బ్రిటిష్ కాలం నాటి కథ కాబట్టి ఓ అందమైన ఫారిన్ భామనే జక్కన్న పెట్టాలని డిసైడ్ అయినట్లు సమాచారం. అయితే ఇంకా మిగిలిన ఇద్దరు హీరోయిన్ లు ఎవరు అనేది తెలియాల్సి ఉంది.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.