షామిలి.. సెకండ్ ఇన్నింగ్స్

  • IndiaGlitz, [Friday,January 05 2018]

బేబి షామిలి.. ఈ పేరు వింటే ముద్దు ముద్దు మాటలు, చక్కని నటనతో మణిరత్నం తెరకెక్కించిన అంజలి'...అలాగే చిరంజీవి, శ్రీదేవి జంటగా నటించిన జగదేకవీరుడు అతిలోక సుందరి' సినిమాలు గుర్తుకు రాకమానవు. ఇలా.. చిన్నతనంలోనే ప్రేక్షకుల మదిని దోచిన ఈ చిన్నారి 2009లో సిద్దార్థ్ హీరోగా వచ్చిన ఓయ్' సినిమాలో కథానాయిక పాత్రలో మెరిసింది.

ఆ సినిమా అనుకున్నంత విజయం సాధించకపోవడంతో.. ఎనిమిదేళ్ల గ్యాప్ త‌రువాత‌ తమిళంలో విక్ర‌మ్‌ ప్రభు సరసన ఓ మాస్ మ‌సాలా మూవీలో నటించింది. అంతేకాకుండా.. దాదాపు తొమ్మిదేళ్ల గ్యాప్‌ తర్వాత మళ్ళీ తెలుగు సినిమాలో నటించడానికి ముందుకు వచ్చింది ఈ కేర‌ళ‌కుట్టి. డెబ్యు డైరెక్టర్ సుందర్ సూర్య తెరకెక్కించిన అమ్మమ్మగారి ఇల్లు' సినిమాలో నాగశౌర్య సరసన నటించింది షామిలి. ఈ రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్‌టైన‌ర్‌ని వేసవిలో విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ చిత్రాన్ని స్వజిత్ మూవీస్ పతాకంపై నిర్మించారు. సెకండ్ ఇన్నింగ్స్‌లోనైనా షామిలికి హిట్ దొరుకుతుందేమో చూడాలి.

More News

ర‌వితేజ విష‌యంలో ప్రియ‌ద‌ర్శి క‌ల నెలవేరింద‌ట‌

మాస్ మహారాజా రవితేజ న‌టిస్తున్న‌ కొత్త సినిమా ఈ రోజు ప్రారంభమైంది. సోగ్గాడే చిన్ని నాయ‌నా, రారండోయ్ వేడుక చూద్దాం ఫేమ్ కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకి 'నేల టికెట్' అనే పేరు ప్ర‌చారంలో ఉంది.

'సైరా నరసింహారెడ్డి' అప్ డేట్స్

మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం 'సైరా నరసింహారెడ్డి'.

చిన్నారి పాట‌కు ప‌వ‌న్ ఫిదా

ప్రపంచ వ్యాప్తంగా పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌కి అభిమానులు ఉన్న సంగ‌తి తెలిసిందే. కాని ఇప్పుడు ఓ ఎనిమిది సంవత్సరాల బాలుడికి అభిమాని అయిపోయారు ప‌వ‌న్‌.

సినిమాని ఆదరిస్తున్నందుకు కృతఙ్ఞతలు... కానీ హీరో సందీప్ కిషన్ నా విలన్ : ఎస్ కె బషీద్

ఎస్ బి కె ఫిలిమ్స్ కార్పొరేషన్ పతాకంపై ఎస్ కె అబ్దుల్లా సమర్పించిన చిత్రం ప్రాజెక్ట్ Z

ర‌వితేజ, క‌ళ్యాణ్ కృష్ణ చిత్రం షూటింగ్ ప్రారంభం

రాజాదిగ్రేట్ లాంటి గ్రాండ్ సక్సెస్ త‌రువాత మాస్ మ‌హ‌రాజ ర‌వితేజ హీరోగా , సోగ్గాడే చిన్న‌నాయ‌న‌, రారండోయ్ వేడుక చూద్దాం లాంటి భారీ విజ‌యాల‌తో దూసుకుపోతున్న యంగ్ డైర‌క్ట‌ర్ క‌ళ్యాణ్ కృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో ఎస్ ఆర్ టి ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్ లో రామ్ తాళ్ళూరి  నిర్మాత గా తొలి చిత్రం తెర‌కెక్కనుంది.