close
Choose your channels

షామిలి.. సెకండ్ ఇన్నింగ్స్

Friday, January 5, 2018 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

బేబి షామిలి.. ఈ పేరు వింటే ముద్దు ముద్దు మాటలు, చక్కని నటనతో మణిరత్నం తెరకెక్కించిన అంజలి`...అలాగే చిరంజీవి, శ్రీదేవి జంటగా నటించిన జగదేకవీరుడు అతిలోక సుందరి` సినిమాలు గుర్తుకు రాకమానవు. ఇలా.. చిన్నతనంలోనే ప్రేక్షకుల మదిని దోచిన ఈ చిన్నారి 2009లో సిద్దార్థ్ హీరోగా వచ్చిన ఓయ్` సినిమాలో కథానాయిక పాత్రలో మెరిసింది.

ఆ సినిమా అనుకున్నంత విజయం సాధించకపోవడంతో.. ఎనిమిదేళ్ల గ్యాప్ త‌రువాత‌ తమిళంలో విక్ర‌మ్‌ ప్రభు సరసన ఓ మాస్ మ‌సాలా మూవీలో నటించింది. అంతేకాకుండా.. దాదాపు తొమ్మిదేళ్ల గ్యాప్‌ తర్వాత మళ్ళీ తెలుగు సినిమాలో నటించడానికి ముందుకు వచ్చింది ఈ కేర‌ళ‌కుట్టి. డెబ్యు డైరెక్టర్ సుందర్ సూర్య తెరకెక్కించిన అమ్మమ్మగారి ఇల్లు` సినిమాలో నాగశౌర్య సరసన నటించింది షామిలి. ఈ రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్‌టైన‌ర్‌ని వేసవిలో విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ చిత్రాన్ని స్వజిత్ మూవీస్ పతాకంపై నిర్మించారు. సెకండ్ ఇన్నింగ్స్‌లోనైనా షామిలికి హిట్ దొరుకుతుందేమో చూడాలి.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.