శర్వాకు ఆపరేషన్ పూర్తి.. 2 నెలల పాటు బెడ్ రెస్ట్
Send us your feedback to audioarticles@vaarta.com
`96` సినిమా చిత్రీకరణలో భాగంగా థాయ్‌లాండ్‌లో స్కై డైవింగ్ ప్రాక్టీస్ చేస్తుండగా, భుజానికి, కాలికి గాయాలైన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో శర్వానంద్ షోలర్డ్ బోన్ డిస్ లొకేట్ అయ్యింది. హూటాహుటిన శర్వాంద్ హైదరాబాద్ చేరుకుని, ఎయిర్ పోర్ట్ నుండి నేరుగా షన్ షైన్ హాస్పిటల్లో జాయిన్ అయ్యారు. పరీక్షలు చేసిన డాక్టర్లు సోమవారం శస్త్రచికిత్స చేయబోతున్నట్లు ప్రకటించిన సంగతి కూడా విదితమే.
నేడు(సోమవారం) నలుగురు డాక్టర్లతో కూడిన బృందం ఉదయం 6.30 గంటల నుండి సాయంత్రం 5 గంటలకు శస్త్ర చికిత్సను పూర్తి చేశారు. భుజానికి తగిలిన గాయం పెద్దది కావడంతో ఆపరేషన్ పూర్తి కావడానికి 11 గంటల సమయం పట్టింది. శస్త్ర చికిత్స అనంతరం శర్వానంద్‌కు రెండు నెలల పాటు బెడ్ రెస్ట్ అవసరమని డాక్టర్స్ సూచించారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.