షారుఖ్‌... అభిమానుల‌కు షాక్‌

  • IndiaGlitz, [Saturday,June 22 2019]

షారుఖ్ త‌న అభిమానుల‌కు షాక్ ఇచ్చారు. ఎప్పుడూ సినిమాలేనా? నాకూ, నా ఫ్యామిలీకి కాస్త స‌మ‌యం వ‌ద్దా? నా కూతురు చ‌దువుతోంది. కొడుకు చ‌దువుతున్నాడు. వారి చ‌దువుల సంగ‌తి ప‌ట్టించుకోవ‌ద్దా? అని అడుగుతున్నాడు.

ఇంత‌కీ షారుఖ్ అలా ఎందుకు మాట్లాడాల్సి వ‌చ్చిందంటే ఆయ‌న చేతిలో ప్ర‌స్తుతం ఒక్క సినిమా కూడా లేదు కాబ‌ట్టి. ఆయ‌న 'డాన్ 3'లో న‌టిస్తార‌ని, 'సారే జ‌హాసే అచ్చా' స‌బ్జెక్ట్ ను టేక‌ప్ చేస్తార‌ని అంద‌రూ అనుకున్నారు. అయితే అభిమానుల ఆశ‌ల‌పై నీళ్లు చ‌ల్లిన‌ట్టు అయింది. షారుఖ్ అందుకు సుముఖంగా లేరు. ఆ మాట‌కొస్తే ఇప్ప‌టికైతే ఏ ప్రాజెక్టుకూ సంత‌కం చేయ‌లేద‌ని, ఇప్పుడ‌ప్పుడే చేసే ఆలోచ‌న‌లు కూడా లేవ‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. ఫ్యామిలీతో గ‌డ‌ప‌డానికి స‌మ‌యం కావాల‌ని కూడా అంటున్నారు.

వాస్త‌వానికి ఆయ‌న ఇటీవ‌ల న‌టించిన సినిమాలు బాక్సాఫీస్ ద‌గ్గ‌ర పెద్ద‌గా ఆడ‌లేదు. 'జీరో' కూడా బాగా నిరాశ‌ప‌ర‌చింది. దీంతో ఆయ‌న కొన్నాళ్లు వాంటెడ్‌గానే బ్రేక్ తీసుకుంటున్న‌ట్టు స‌మాచారం.